టాటాడొకోమో యూజర్లుకు గొప్ప సదవకాశం!

హైదరాబాద్: ఏ నెట్‌వర్క్ ప్రొవైడర్ కల్పించని విధంగా టాటా డొకోమో తన యూజర్లకు సదుపాయాలను కల్పిస్తుంది. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల ద్వారా రీచార్జ్ చేసుకునే సదుపాయాన్ని టాటా డొకోమో తాజాగా ప్రవేశపెట్టింది. ‘ట్విట్‌కామ్’పేరుతో జీఎస్ఎమ్ వినియోగదారుల కోసం సరికొత్త అప్లికేషన్‌ను డొకోమో రూపొందించింది. ఈ సౌలభ్యతతో వినియోగదారులు ట్విట్లర్ నుంచి రీ-చార్జ్ చేసుకోవటంతో పాటు అనేకమైన విలువ ఆధారిత సేవలను పొందవచ్చు. కాలానికి అనుగుణంగా కొత్త పథకాలను ప్రవేశపెట్టడంలో టాటా డొకోమో ముందుంటుందని టాటా టెలీ బ్రాండ్ మార్కెటింగ్ హెడ్ రితీష్ ఘోషల్ తెలిపారు. త్వరలోనే ఫేస్‌బుక్‌లో కూడా ఇటువంటి అప్లికేషన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు.
టాటా డొకోమో ఫ్రీ రోమింగ్ ప్లాన్!
హైదరాబాద్: టాటా డొకోమో టెలిసర్వీసెస్ కంపెనీ తన జిఎస్‌ఎం, సిడిఎంఏ వినియోగదారుల కోసం సరికొత్త ‘రోమ్ ఫ్రీ’ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ టారిఫ్ సౌలభ్యతతో యూజర్ రూ.46తో రీచార్జ్ చేయించుకుని దేశంలో ఎక్కడినుంచైనా ఫ్రీ ఇన్‌కమింగ్ రోమింగ్ సౌకర్యాన్ని పొందవచ్చు. అవుట్ గోయింగ్ కాల్స్‌కు సెకనుకు 1.2పైసలు ఛార్జ్ చెయ్యబడుతుంది. ప్రిపెయిడ్ కస్టమర్లు ఎక్కువగా వివిధ ప్రాంతాలకు వెళ్లే వారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుందని ఆ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రామకృష్ణ వెల్లడించారు. యాక్టివేషన్ చేసుకున్న తర్వాత రెండు నెలల పాటు ఈ సౌకర్యం చెల్లుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications








