డొకొమో అన్ లిమిటెడ్ ప్యాక్ (ఏ నెంబర్‌‌కైనా ఫ్రీ)

Posted By: Staff

డొకొమో అన్ లిమిటెడ్ ప్యాక్ (ఏ నెంబర్‌‌కైనా ఫ్రీ)

హైదరాబాద్: టెలికాం కంపెనీ టాటా టెలీసర్వీసెస్ ఆంధ్రప్రదేశ్‌లోని టాటా డొకొమో జీఎస్‌ఎం, సీడీఎంఏ ప్రిపెయిడ్ కస్టమర్ల కోసం ఆర్‌సీవీ 666 పేరుతో 30 రోజుల వాలిడిటీగల అన్‌లిమిటెడ్ ప్యాక్‌ను బుధవారం ప్రకటించింది. ఈ ప్యాక్‌లో భాగంగా కస్టమర్లు రాష్ట్రంలోని ఏదైనా నెట్‌వర్క్‌లోని మొబైల్, ల్యాండ్‌లైన్‌కు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు.

పోస్ట్ పెయిడ్ అన్‌లిమిటెడ్ ప్లాన్!

తన పోస్ట్‌పెయిడ్ జీఎస్ఎమ్ యూజర్ల కోసం ప్రముఖ టెలికం ప్రొవైడర్ టాటా డొకొమో కొత్త అన్‌లిమిటెడ్ ఆఫర్‌ను గడిచిన జూలైలో ప్రవేశపెట్టింది. నెలకు రూ.899 ఫిక్స్‌డ్ రెంటల్ టారిఫ్ ప్లాన్‌తో టాటా డొకొమో కస్టమర్లు దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాల్స్‌ను చేసుకునే సదుపాయం ఉంటుందని కంపెనీ పేర్కొంది. లోకల్, ఎస్‌టీడీ… మొబైల్ లేదా ల్యాండ్‌లైన్ ఇలా దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌లన్నింటికీ ఈ ఆఫర్ వర్తిస్తుందని, దేశంలో ఇటువంటి ప్రయోజనాన్ని కల్పిస్తున్న తొలి మొబైల్ ఆపరేటర్ తామేనని టాటా డొకొమో ఒక ప్రకటనలో పేర్కొంది.

technology news, tata docomo unlimited prepaid plan, andhrapradesh customers, టెక్నాలజీ న్యూస్, టాటా డొకొమో అన్ లిమిటెల్ ప్రీపెయిడ్ ప్లాన్, ఆంధ్రప్రదేశ్ యూజర్లు

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot