Home
News

యూజర్లూ! పండగచేసుకోండి.. (డొకొమో బంపర్ ఆఫర్‌తో)

By Super
 Tata Docomo Launches Truly Unlimited GSM Postpaid Plan – 899

ప్రముఖ టెలికం ప్రొవైడర్ టాటా డొకొమో... తన పోస్ట్‌పెయిడ్ జీఎస్ఎమ్ యూజర్ల కోసం కొత్త అన్‌లిమిటెడ్ ఆఫర్‌ను ప్రకటించింది. నెలకు రూ.899 ఫిక్స్‌డ్ రెంటల్ టారిఫ్ ప్లాన్‌తో టాటా డొకొమో కస్టమర్లు దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాల్స్‌ను చేసుకునే సదుపాయం ఉంటుందని కంపెనీ పేర్కొంది. లోకల్, ఎస్‌టీడీ... మొబైల్ లేదా ల్యాండ్‌లైన్ ఇలా దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌లన్నింటికీ ఈ ఆఫర్ వర్తిస్తుందని, దేశంలో ఇటువంటి ప్రయోజనాన్ని కల్పిస్తున్న తొలి మొబైల్ ఆపరేటర్ తామేనని టాటా డొకొమో ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఆఫర్ సౌలభ్యతతో ట్రాయ్ నిబంధనలకు లోబడి అన్ని లోకల్, ఎస్‌టీడీ సందేశాలను ఉచితంగా పంపుకోవచ్చు.

ట్విట్టర్ ద్వారా రీఛార్జ్!

హైదరాబాద్: ఏ నెట్‌వర్క్ ప్రొవైడర్ కల్పించని విధంగా టాటా డొకోమో తన యూజర్లకు సదుపాయాలను కల్పిస్తుంది. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల ద్వారా రీచార్జ్ చేసుకునే సదుపాయాన్ని టాటా డొకోమో తాజాగా ప్రవేశపెట్టింది. ‘ట్విట్‌కామ్’పేరుతో జీఎస్ఎమ్ వినియోగదారుల కోసం సరికొత్త అప్లికేషన్‌ను డొకోమో రూపొందించింది. ఈ సౌలభ్యతతో వినియోగదారులు ట్విట్లర్ నుంచి రీ-చార్జ్ చేసుకోవటంతో పాటు అనేకమైన విలువ ఆధారిత సేవలను పొందవచ్చు. కాలానికి అనుగుణంగా కొత్త పథకాలను ప్రవేశపెట్టడంలో టాటా డొకోమో ముందుంటుందని టాటా టెలీ బ్రాండ్ మార్కెటింగ్ హెడ్ రితీష్ ఘోషల్ తెలిపారు. త్వరలోనే ఫేస్‌బుక్‌లో కూడా ఇటువంటి అప్లికేషన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X