రూ.350కే 1500 నిమిషాల టాక్‌టైమ్, 5జీబి డేటా

'సింపుల్ ఈజ్ ద బెస్ట్’ పేరుతో సరికొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ను టాటా డొకోమో అనౌన్స్ చేసింది. ఈ ప్లాన్‌లో భాగంగా రూ.350 అద్దె చెల్లించి 1500 నిమిషాల టాక్‌టైమ్‌తో పాటు 5జీ జీబి డేటాను పొందవచ్చు.

రూ.350కే  1500 నిమిషాల టాక్‌టైమ్, 5జీబి డేటా

ఈ హై-డేటా ప్లాన్‌లో భాగంగా వర్తించే 1500 నిమిషాలను అన్ని లోకల్ అలానే ఎస్‌టీడీ కాల్స్‌కు నెల రోజులు పాటు ఉపయోగించుకోవచ్చు. ఈ పోస్ట్ పెయిడ్ సబ్‌స్ర్కిప్షన్‌ స్కీమ్‌లో భాగంగా మొదటి 6 నెలల పాటు 1500 నిమిషాల వాయిస్ బెనిఫిట్స్‌తో 5జీబి డేటాను యూజర్లు ఆస్వాదించే అవకాశం ఉంటుంది. 6 నెలలు పూర్తి అయిన తరువాత వాయిస్ బెనిఫిల్స్ అలానే ఉన్నప్పటికి, 5జీబి 3జీ డేటా బెనిఫిట్ కాస్తా 2జీబి డేటాకు పడిపోతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అత్యవసర పరిస్థితుల్లో లోన్స్..

అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకు టెలికం ఆపరేటర్లు తమ యూజర్లకు వాయిస్ అలానే డేటా లోన్‌లను ప్రొవైడ్ చేస్తున్నాయి. వాటిని ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎయిర్‌టెల్ కష్టమర్లకు..

మీ ఫోన్ బ్యాలన్స్ 5 రూపాయల కన్నా తక్కువ ఉంటే మీరు వెంటనే లోన్ పొందవచ్చు. ఇందుకోసం మీరు మీ మొబైల్ నుంచి *141*10#కు గాని అలాగే 52141 కాల్ చేయాలి. మీరు వెంటనే రూ. 10 టాక్ టైం పొందుతారు. మీరు మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు రీఛార్జ్ చేసుకుంటే కంపెనీ దాన్నుంచి ఆ లోన్ అమౌంట్ తీసుకుంటుంది. డేటా లోన్ కావాలంటే *141*567# కు కాల్ చేసి పొందవచ్చు. ఇది మీకు రెండు రోజుల వ్యాలిడితీ 50 ఎంబీ వరకు వస్తుంది.మీతరువాత రీ ఛార్జ్ లో రూ. 15 ఎయిర్ టెల్ తీసుకుంటుంది.

వొడాఫోన్ కష్టమర్లు

వొడాఫోన్ కష్టమర్లు లోన్ కావాలంటే 1241కి కాల్ చేసి పొందవచ్చు. 'SMS CREDIT' to 144కి ఎసెమ్మెస్ చేయడం ద్వారా పొందవచ్చు. దీంతో పాటు *111*10# నంబర్ కి కాల్ చేసి పొందవచ్చు. 10 రూపాయలు వస్తుంది. మీ నుంచి తరువాత రూ. 13 తీసుకుంటారు.

*111*10# నంబర్ కి కాల్ చేయడం ద్వారా 30 MB of 3G 1 రోజు వ్యాలిడితో వస్తుంది. ఆ తరువాత 10రూపాయలు మీ బ్యాలెన్స్ నుండి తీసుకుంటారు.

 

బిఎస్ఎన్ఎల్ కష్టమర్లు

బిఎస్ఎన్ఎల్ కష్టమర్లు SMS CREDIT' to 53738 ద్వారా రూ. 10 టాక్ టైం పొందవచ్చు. మీరు 24 గంటల్లోగా మీ బ్యాలన్స్ వేయించుకోకపోతే ఆ తరువాత వారు మీనుంచి 11రూపాయలు కట్ చేస్తారు.

రిలయన్స్ కష్టమర్లు

రిలయన్స్ కష్టమర్లు *141*5# డయల్ చేయడం ద్వారా 10 రూపాయలు టాక్ టైం లోన్ పొందుతారు. *141*10# ఈ నంబర్ కి కాల్ చేసినా మీకు ఆఫర్ వస్తుంది. YCR' అని టైప్ చేసి 51234 మెసేజ్ చేసినా మీరు పొందవచ్చు.

ఐడియా కష్టమర్లు

ఐడియా కష్టమర్లు *150*06#కి డయల్ చేయడం ద్వారా 25 ఎంబీ డేటాను రెండు రోజుల పాటు పొందవచ్చు. దీనికోసం ఐడియా మీ నుంచి ఆరు రూపాయలు ఛార్జ్ చేస్తుంది. *150*333# ఈ నంబర్ కి డయల్ చేయడం ద్వారా 35 MB 3G డేటా మీ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. దీనికి తరువాత 11 రూపాయలు ఛార్జ్ చేస్తారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Tata Docomo's new postpaid plans offer up to 1500 minutes of talktime and 5GB data for Rs 350. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot