బ్లాక్‌బెర్రీ యూజర్లకు డొకొమో ఆఫర్

Posted By: Staff

బ్లాక్‌బెర్రీ యూజర్లకు డొకొమో ఆఫర్
హైదరాబాద్: బ్లాక్‌బెర్రి కర్వ్ 9320, బ్లాక్‌బెర్రి కర్వ్ 9220 మొబైల్ ఫోన్‌లు కొనుగోలుదారులకు ప్రత్యేక ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చినట్లు టాటా డొకొమో ఒక ప్రకటనలో తెలిపింది. రూ.599 మంత్లీ సర్వీస్ ప్లాన్ కింద 600 నిమిషాల వరకూ లోకల్, నేషనల్ కాల్స్ ఉచితమని టాటా టెలిసర్వీసెస్ నాన్ వాయిస్ సర్వీసెస్ హెడ్, సునీల్ టండన్ పేర్కొన్నారు. 600 వరకూ లోకల్, నేషనల్ ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితమని తెలిపారు. అంతేకాకుండా అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ సర్వీసునందిస్తామని వివరించారు. జీఎస్ఎమ్ నెట్ వర్క్ యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

ట్విట్టర్ ద్వారా రీఛార్జ్!

హైదరాబాద్: ఏ నెట్‌వర్క్ ప్రొవైడర్ కల్పించని విధంగా టాటా డొకోమో తన యూజర్లకు సదుపాయాలను కల్పిస్తుంది. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల ద్వారా రీచార్జ్ చేసుకునే సదుపాయాన్ని టాటా డొకోమో తాజాగా ప్రవేశపెట్టింది. ‘ట్విట్‌కామ్’పేరుతో జీఎస్ఎమ్ వినియోగదారుల కోసం సరికొత్త అప్లికేషన్‌ను డొకోమో రూపొందించింది. ఈ సౌలభ్యతతో వినియోగదారులు ట్విట్లర్ నుంచి రీ-చార్జ్ చేసుకోవటంతో పాటు అనేకమైన విలువ ఆధారిత సేవలను పొందవచ్చు. కాలానికి అనుగుణంగా కొత్త పథకాలను ప్రవేశపెట్టడంలో టాటా డొకోమో ముందుంటుందని టాటా టెలీ బ్రాండ్ మార్కెటింగ్ హెడ్ రితీష్ ఘోషల్ తెలిపారు. త్వరలోనే ఫేస్‌బుక్‌లో కూడా ఇటువంటి అప్లికేషన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot