Home
News

టాటా ఎలక్ట్రానిక్స్ హోసూర్‌ ప్లాంట్‌లో ఐఫోన్‌ల అసెంబ్లింగ్‌.. ప్రస్తుతానికి రెండు లైన్స్‌లో..!

టాటా ఎలక్ట్రానిక్స్‌ ఐఫోన్ మోడల్స్‌ అసెంబ్లింగ్‌ ను ప్రారంభించింది. సంస్థ తన హోసూర్‌ ప్లాంట్‌లో ఐఫోన్‌ 16, ఐఫోన్ 16e మోడల్స్‌ను అసెంబ్లింగ్ (iPhones Assembling in India) చేస్తోంది. ప్రస్తుతం రెండు అసెంబ్లింగ్‌ లైన్స్‌ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 4 అసెంబ్లింగ్‌ లైన్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

టాటా ఎలక్ట్రానిక్స్‌ హోసూర్‌ యూనిట్‌లో (Tata Electronics Hosur Plant) ఒక్కో అసెంబ్లింగ్‌ లైన్‌లో గరిష్ఠంగా 2500 మంది పనిచేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పూర్తి సామర్థ్యంతో పనిచేస్తే.. టాటా విస్ట్రాన్ ప్లాంట్‌ను అధిగమిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చర్యలు భారత్‌లో ఐఫోన్‌ల తయారీని గణనీయంగా పెంచే అవకాశం ఉంది.

Tata electronics hosur manufacturing plant

ప్రస్తుతం చైనాలో అధిక శాతం ఐఫోన్‌లు తయారవుతున్నాయి. అయితే భారత్‌లోనూ భారీ స్థాయిలో ఐఫోన్‌లను ఉత్పత్తి చేయాలని ఆపిల్ (Apple) భావించింది. ఫలితంగా అమెరికా మార్కెట్‌కు అవసరం అయిన మెజార్టీ ఐఫోన్‌లను భారత్‌ నుంచే సప్లై చేయాలని భావించింది. దీంతోపాటు భారత్‌లో ఐఫోన్‌ల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని భావించింది.

అయితే ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఆపిల్‌ విస్తరణ తనకు ఇష్టం లేదని, ఆపిల్‌ సీఈవోకు చెప్పినట్లు ట్రంప్‌ వెల్లడించారు. అమెరికాలో ఆపిల్‌ విస్తరణకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. ఇందుకు టిమ్‌ కుక్‌ అంగీకరించినట్లు ట్రంప్‌ వెల్లడించారు.

ప్రస్తుతం ఆపిల్‌ చైనాలో భారీ స్థాయిలో ఐఫోన్‌లను ఉత్పత్తి చేస్తోంది. అమెరికా ఉత్పత్తి వ్యయాల భారం కారణంగా అమెరికాలో ఐఫోన్‌లను తయారు చేయడం లేదు. అయితే కొంత కాలంలో భారత్‌లో ఐఫోన్‌ల తయారీపై ఆపిల్‌ ఫోకస్‌ చేసింది. వివిధ కారణాలతో భారత్‌లో ఐఫోన్‌ల తయారీని గణనీయంగా పెంచాలని భావిస్తోంది.

భారత్‌లో ఫాక్స్‌కాన్‌, టాటా ఎలక్ట్రానిక్స్‌, పెగాట్రాన్‌ ప్లాంట్లలో ఐఫోన్‌లు తయారవుతున్నాయి. మొత్తంగా 15 శాతం ఐఫోన్‌ల ఉత్పత్తిని భారత్‌లో చేపడుతోంది. అయితే గతంతో పోలిస్తే భారీ స్థాయిలో ఐఫోన్‌లను ఉత్పత్తి చేస్తోంది. అయితే ట్రంప్‌ తాజా వ్యాఖ్యలపైనా ఆపిల్‌ స్పందించింది. భారత్‌లో ఆపిల్‌ విస్తరణ కొనసాగుతుందని చెప్పినట్లు తెలిసింది.

* అమెరికా, చైనాల మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతల కారణంగా ఐఫోన్‌ ధరలు పెరిగే అవకాశం ఉందని అంతా భావించారు. అయితే రెండు దేశాల మధ్య వాణిజ్యపరంగా ఒప్పందం కుదిరింది. దీంతో ఇప్పట్లో ఐఫోన్ల ధరలు పెరిగే అవకాశం లేదని భావించారు. అయితే ఇటీవల విడుదల అయిన ఓ నివేదిక షాకింగ్ వివరాలను బయటపెట్టింది.

అమెరికా, చైనాల మధ్య వాణిజ్యంగా పరిస్థితులు ప్రశాంతంగా మారినా.. ఐఫోన్‌ల ధరలు పెరిగే అవకాశం ఉందని ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ నివేదిక పేర్కొంది. డిజైన్‌ అప్‌డేట్స్‌, కొత్త ఫీచర్‌ల కారణంగా భవిష్యత్‌లో ఐఫోన్‌ ధరలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా చైనాలో అధిక శాతం ఐఫోన్‌లను ఆపిల్‌ తయారు చేస్తోంది. ప్రో మోడల్స్‌ను అక్కడే తయారు చేస్తోంది. అయితే భారత్‌లో కూడా ఐఫోన్‌ల ఉత్పత్తికి తగిన సామర్థ్యం ఉన్నా.. కొన్ని మౌలిక వసతులు, సాంకేతిక నైపుణ్యం లేదని తెలుస్తోంది. అయితే ఐఫోన్ల ధరల పెంపుపై త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Tata electronics hosur manufacturing plant has started iphones assembling
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X