టాటా గ్రూప్ నుంచి కొత్తగా UPI పేమెంట్ యాప్!! PhonePe, Google Pay లకు పోటీగా

|

భారతదేశంలో ప్రతి ఒక్కరు ఇప్పుడు డిజిటల్ పద్దతిలో పేమెంట్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు. PhonePe, Google Pay, WhatsApp Pay, Amazon Pay మరియు Paytm వంటి UPI ఆధారిత సర్వీస్ ప్రొవైడర్లు ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ప్రజాదరణను పొందాయి. అయితే త్వరలోనే ఈ విభాగంలోకి టాటా గ్రూప్ సంస్థ కూడా చేరనున్నది. టాటా సంస్థ యొక్క UPI ఆధారిత యాప్ నుండి ఇప్పటికే ఉన్న UPI పేమెంట్ యాప్ లు గట్టి పోటీని ఎదుర్కొనే అవకాశం ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

UPI

ది ఎకనామిక్ టైమ్స్ యొక్క నివేదిక ప్రకారం టాటా గ్రూప్ సంస్థ దేశంలో తన స్వంత యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఆధారిత డిజిటల్ పేమెంట్ సర్వీసును అందుబాటులోకి తీసుకొనిరావడం కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NCPI) నుండి క్లియరెన్స్ కోరుతోంది. థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్స్ (TPAP)గా పనిచేయడానికి టాటా గ్రూప్ NPCI కి దరఖాస్తు చేసిందని మరియు వచ్చే నెలలో ఈ సర్వీసును ప్రారంభించాలని యోచిస్తున్నట్లు కొత్త నివేదిక పేర్కొంది.

టాటా గ్రూప్ UPI పేమెంట్ సర్వీస్

టాటా గ్రూప్ UPI పేమెంట్ సర్వీస్

భారతదేశంలో తమ స్వంత UPI ఆధారిత పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌లను అందించడానికి అమెజాన్ పే, వాట్సాప్ పే మరియు గూగుల్ పే వంటి నాన్-బ్యాంకింగ్ పేమెంట్ల ప్లాట్‌ఫారమ్‌లు బ్యాంకులతో భాగస్వామ్యం కలిగి ఉండాలని నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. ఈ కంపెనీలు అన్ని కూడా సాధారణంగా బహుళ భాగస్వాములను కలిగి ఉండటానికి ఇష్టపడతాయి. తద్వారా వారి నెట్‌వర్క్‌పై ఒత్తిడి పెరిగినప్పుడు పేమెంట్లు భాగస్వామి కంపెనీల అంతటా పంపిణీ చేయబడతాయి. ఈ సర్వీసును ఉపయోగిస్తున్నప్పుడు వినియోగదారులు అంతరాయాన్ని ఎదుర్కోకుండా కూడా ఇది నిర్ధారిస్తుంది. దీని కోసం టాటా గ్రూప్స్ డిజిటల్ కామర్స్ వింగ్, టాటా డిజిటల్ కలిసి భారతదేశంలో తన స్వంత UPI ఆధారిత డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌ను శక్తివంతం చేయడానికి ICICI బ్యాంక్‌తో చర్చలు జరుపుతోంది. ఈ కంపెనీ తన డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌ను శక్తివంతం చేయడానికి మరొక ప్రధాన ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ భాగస్వామితో కూడా చర్చలు జరుపుతోంది.

టాటా గ్రూప్ సూపర్ యాప్‌

ఇందులో ఆసక్తికరమైన విషయమేమిటంటే వచ్చే నెల IPL సీజన్‌లో టాటా గ్రూప్ తన సూపర్ యాప్‌ను 'టాటా న్యూ' పేరుతో విడుదల చేయాలనే ఆలోచనలో ఉంది. కొత్త ప్రణాళికలతో ఖరారు చేసిన సమయంలోనే దీనిని అభివృద్ధి చేయాలని సంస్థ యొక్క వ్యూహం. "టాటా న్యూ లాంచ్ అయ్యే సమయానికి వారు (టాటా గ్రూప్) దీనిని సిద్ధంగా ఉంచాలని కోరుకుంటున్నారు, తద్వారా సూపర్ యాప్‌లో మరిన్ని UPI పేమెంట్లు సులభంగా ప్రారంభించబడతాయి" అని మీడియా సమావేశంలో తెలిపింది.

'టాటా న్యూ' UPI పేమెంట్ యాప్

'టాటా న్యూ' UPI పేమెంట్ యాప్

'టాటా న్యూ' UPI పేమెంట్ యాప్ వినియోగదారులకు BigBasket, 1mg, Croma, Tata Cliq వంటి టాటా డిజిటల్ యాప్‌లన్నింటికీ మరియు దాని ఫ్లైట్ బుకింగ్ సర్వీస్‌ను ఒకే యాప్‌లో సులభంగా యాక్సెస్ చేయడానికి వీలును కల్పిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను ఏప్రిల్ 7న టాటా డిజిటల్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Tata Group Plan to Launch New UPI Payment App in India! Competing With PhonePe and Google Pay and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X