Tata Neu సూపర్ యాప్ ఏప్రిల్ 7 న లాంచ్ కానున్నది!! ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి...

|

ఇండియాలో టాటా గ్రూప్స్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ సంస్థకు ప్రపంచం మొత్తంగా మీద అనేక రకాలు కంపెనీలు ఉన్నాయి. ఈ సంస్థ యొక్క లాభాలలో అధిక భాగం పేదవారికి వినియోగిస్తూ కూడా ఉంటుంది. ఇటువంటి ఈ సంస్థ 'Tata Neu' పేరుతో కొత్తగా ఒక సూపర్ యాప్ ను ఏప్రిల్ 7న లాంచ్ చేయనున్నది. ఈ యాప్ యొక్క లాంచ్ కి సంబంధించిన టీజర్ ఫోటోని గూగుల్ ప్లే స్టోర్ పేజీలో కంపెనీ విడుదల చేసింది. ప్రస్తుతం ఇండియాలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) టోర్నమెంట్‌తో టాటా Neu సూపర్ యాప్‌ను మొదటిసారి పబ్లిక్‌గా ప్రచారం చేయడం ప్రారంభించింది. ఈ కొత్త యాప్‌ ముందుగా టాటా గ్రూప్ ఉద్యోగులకు మాత్రమే ఉపయోగించేందుకు పరిమితం చేయబడింది. అయితే ఈ యాప్ యొక్క గొప్పతనం ఏమిటో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టాటా Neu సూపర్ యాప్ ప్రాముఖ్యత

టాటా Neu సూపర్ యాప్ ప్రాముఖ్యత

Tata Neu అనేది అనేక రకాల సర్వీసు యాప్‌ల సమ్మేళనం యొక్క సూపర్ యాప్. ఇది అన్ని రకాల డిజిటల్ సేవలు మరియు యాప్‌లను ఒకే ప్లాట్‌ఫారమ్‌పై తీసుకువస్తుంది. టాటా గ్రూప్స్ గూగుల్ ప్లే స్టోర్ పేజీలో యాప్‌కు సంబంధించి ఒక వివరణను విడుదల చేసింది. దాని యొక్క సారాంశం "అత్యాధునిక డిజిటల్ కంటెంట్‌ని వినియోగించుకోండి, పేమెంట్స్ సులభంగా చేయండి, మీ ఆర్థిక లావాదేవీలను మరింత సులభంగా నిర్వహించండి, మీ నెలవారీ కార్యక్రమాలను సులభంగా ప్లాన్ చేసుకోండి, కొత్త విషయాలను అన్వేషించడానికి చాలా మార్గాలు ఉన్నాయి" అని సంస్థ ప్రకటించింది.

Tata Neuలో అందుబాటులో గల సేవలు

Tata Neuలో అందుబాటులో గల సేవలు

Tata Neu యాప్‌ను వినియోగిస్తున్న వినియోగదారులు ఎయిర్ ఆసియా ఇండియా, ఎయిర్ ఇండియాలో విమాన టిక్కెట్‌లను బుక్ చేయడం లేదా తాజ్ గ్రూప్ ప్రాపర్టీలలో హోటల్‌లను త్వరగా బుక్ చేసుకోవచ్చు. బిగ్ బస్కెట్ నుండి కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేయవచ్చు. అలాగే 1mg నుండి మెడికల్ కి సంబందించిన మందులను ఆర్డర్ చేయడం లేదా క్రోమా నుండి ఎలక్ట్రానిక్స్ మరియు వెస్ట్‌సైడ్ నుండి దుస్తులు కొనుగోలు చేయడం వంటి వివిధ టాటా గ్రూప్ డిజిటల్ సేవలు ఈ యాప్ ద్వారా సాధ్యమవుతాయి. వినియోగదారులు ఈ యాప్‌ను ఉపయోగించినందుకుగాను టాటా గ్రూప్ రీడీమ్ చేసుకోగలిగే Neu కాయిన్‌లను కంపెనీ తన వినియోగదారులకు రివార్థుల రూపంలో అందిస్తుంది.

ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు లాంచ్!! జియో 1నెల పూర్తి వాలిడిటి ప్లాన్‌కి పోటీగాఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు లాంచ్!! జియో 1నెల పూర్తి వాలిడిటి ప్లాన్‌కి పోటీగా

సూపర్ యాప్‌లు

భారతదేశంలో కొన్ని యాప్ ల సమ్మేళనాలతో ఇటువంటి సూపర్ యాప్‌లు చాలానే ఉన్నాయి. వీటిలో ముందువరుసలో అమెజాన్, పేటియమ్, రిలయన్స్ జియో యాప్‌లు ఉన్నాయి. ఇవి అనేక ఇంటర్నెట్ సమ్మేళనాలతో సూపర్ యాప్‌ వెర్షన్‌లుగా చెలామనిఅవుతున్నాయి. వీటిని వినియోగిస్తున్న వినియోగదారులు పేమెంట్లను చేయడంతో పాటుగా ఆన్ లైన్ కంటెంట్ స్ట్రీమింగ్, షాపింగ్, ట్రావెల్ బుకింగ్‌లు, కిరాణా సామాగ్రిని కొనుగోలు చేయడం వంటి అనేక రకాల సేవల కలయికతో అందిస్తారు.

భారతీయ కంపెనీలు సూపర్ యాప్‌ల నిర్మాణం

భారతీయ కంపెనీలు సూపర్ యాప్‌ల నిర్మాణం

దేశంలోని జనాభాలోని అధిక మంది టెక్నాలజీ వినియోగించడానికి అధికంగా ఇష్టపడుతున్నారు. ఇందులో కూడా ఎక్కువ మంది స్మార్ట్‌ఫోన్‌లను విరివిగా ఉపయోగిస్తున్నందున తమ యొక్క ఫోన్లలో అధిక యాప్ లను వినియోగించడానికి బదులుగా అన్ని రకాల ప్రయోజనాలను నిర్వహించే ఒకే యాప్ ను ఉపయోగించడానికి ఇష్టపడుతున్నారు. మొదటిసారిగా ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్న వారిలో ఎక్కువ మంది తమ మొబైల్ ఫోన్‌లలో లావాదేవీలు జరుపుతున్న మార్కెట్‌గా భారతదేశం ఇప్పటికే అభివృద్ధి చెందింది. భారతీయ కంపెనీలు సూపర్ యాప్‌లను రూపొందించడానికి వెతుకుతున్న ప్రధాన కారణాలలో ఇది ఒకటి. ఒకే చోట అనేక రకాల సేవలను ఏకీకృతం చేయడంతో రాబడి పెరగడంతో పాటుగా కంపెనీలకు పెద్ద మొత్తంలో వినియోగదారుల డేటాను అందిస్తాయి.

Best Mobiles in India

English summary
Tata Neu Super App Set to Launch on April 7: Here are Specialties and More Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X