ఎయిర్‌టెల్ DTH vs టాటా ప్లే DTH: పోటాపోటీగా ఉచిత OTT సబ్‌స్క్రిప్షన్‌లు...

|

భారతదేశంలో డైరెక్ట్ టు హోమ్ (DTH) సేవలను అందించే వాటిలో టాటా ప్లే, ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ, డిష్ టీవీ మరియు D2h వంటి నాలుగు ముఖ్యమైన కంపెనీలు ఉన్నాయి. కానీ వీటిలో ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ మరియు టాటా ప్లే సంస్థలు మిగిలిన వారితో పోలిస్తే కస్టమర్‌లలో అత్యంత ప్రాచుర్యం పొందాయి. వినియోగదారులకు అత్యుత్తమ సేవలందించేందుకు రెండు కంపెనీల మధ్య పోటీ కొనసాగుతోంది. అయితే ఈ పోటీలలో ప్రయోజనాలు, ఫీచర్లు మరియు ధరల పరంగా ఎవరి సత్తా ఎలా ఉందొ తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

ఎయిర్‌టెల్ DTH సేవలు

ఎయిర్‌టెల్ DTH సేవలు

భారతీయ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తన యొక్క వినియోగదారులకు HD-హై డెఫినిషన్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బేసిక్ మరియు అత్యంత ప్రీమియం ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం వంటి మూడు రకాల కనెక్షన్స్ మరియు సెట్-టాప్ బాక్స్‌లను అందిస్తుంది. ఈ సెట్-టాప్ బాక్స్‌లు వరుసగా రూ.1,300, రూ.2,499, రూ.4,798 ధరలను కలిగి ఉన్నాయి.

HD-హై డెఫినిషన్

మొదటిది HD-హై డెఫినిషన్ సెట్-టాప్ బాక్స్ డాల్బీ డిజిటల్ సౌండ్‌తో వస్తుంది. అదనంగా ఇది రికార్డ్ మరియు ప్లే ఎంపికను కూడా కలిగి ఉంది. రెండవది ఎక్స్‌స్ట్రీమ్ అంతర్నిర్మిత క్రోమ్ కాస్ట్ తో సహా అనేక స్మార్ట్ ఫీచర్‌లతో వస్తుంది. మీ మొబైల్ ఫోన్‌ను రిమోట్‌గా ఉపయోగించవచ్చు మరియు ఇది వాయిస్ శోధనకు కూడా మద్దతు ఇస్తుంది. మూడవది Hotstar మరియు ZEE5 వంటి ప్రముఖ యాప్‌లతో సహా 5000 కంటే ఎక్కువ ప్రీ-లోడ్ చేసిన యాప్‌లతో కూడిన ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం బాక్స్. ప్రాథమిక సెట్-టాప్ బాక్స్‌లో ఉన్నట్లే అనేక ఇతర ఫీచర్లు సాధారణం. కానీ ప్రీమియం ధర ఎక్కువగా ఉంటుంది. ఇందులో లభించే OTT యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ మరియు ఎయిర్‌టెల్ ప్రీమియం సర్వీస్ కారణంగా దీని ధర ఎక్కువగా ఉంది. ఈ మూడు సెట్-టాప్ బాక్స్‌లు పేరెంటల్ కంట్రోల్ ఫీచర్‌లతో ఉంటాయి.

HD సెట్-టాప్ బాక్స్
 

మీరు ఎయిర్‌టెల్ యొక్క HD సెట్-టాప్ బాక్స్ ను ఎంచుకున్నట్లయితే కనుక మీరు సెట్-టాప్ బాక్స్ మరియు మొదటి నెలవారీ అద్దె కోసం రూ.1,300 చెల్లించాలి. ఇక్కడ మీరు ఎంచుకోవడానికి ఐదు ప్రీ-మేడ్ ప్యాకేజీలను కనుగొంటారు. మొదటి ప్యాక్ 84 SD మరియు 8 HD ఛానెల్‌లను అందిస్తూ రూ.295 ధర వద్ద అందుబాటులో ఉంది. రెండవ ప్యాక్ రూ.300 ధర వద్ద 97 SD ఛానెల్‌లకు యాక్సెస్‌ని ఇస్తుంది. మూడవ ప్యాక్ రూ.351 ధర వద్ద అందుబాటులో ఉండి 130 SD ఛానెల్‌లకు యాక్సెస్‌ని అందిస్తుంది. అలాగే నాల్గవ ప్యాక్ రూ.375 ధర వద్ద 79 SD మరియు 14HD ఛానెల్‌లకు యాక్సెస్‌ని అందిస్తుంది. చివరిగా రూ.620 ధర వద్ద లభించే ప్యాక్ 108 SD మరియు 46 HD ఛానెల్‌లకు యాక్సెస్‌ని అందిస్తుంది.

ఎక్స్‌స్ట్రీమ్

మీరు ఎక్స్‌స్ట్రీమ్ బేసిక్ లేదా ప్రీమియం బాక్స్‌ను ఎంచుకున్నట్లయితే కనుక మీరు రూ.462 అద్దె ప్యాక్‌తో 7 రోజులు ఉచితంగా యాక్సిస్ ను పొందుతారు. ఈ ప్యాక్ 115 SD మరియు 22 HD ఛానెల్‌లను అందిస్తుంది. అయితే 7 రోజుల తర్వాత మీరు ఈ ప్యాక్ ధరను చెల్లించడం ప్రారంభించాలి. అదనంగా టెల్కో మీకు వరుసగా రూ.499, రూ.849 మరియు రూ.1,599 ధరల వద్ద మూడు OTT సబ్‌స్క్రిప్షన్ ఎంపికలను కూడా అందిస్తుంది.

టాటా ప్లే DTH

టాటా ప్లే DTH

టాటా ప్లే తమ వినియోగదారులకు రూ.1,499 ధర వద్ద టాటా ప్లే హెచ్‌డి సెట్-టాప్ బాక్స్‌తో సహా మరో మూడు డిటిహెచ్ ఎంపికలను కూడా అందిస్తుంది. ఇది 3D అనుకూలతతో వస్తుంది మరియు డాల్బీ డిజిటల్ సరౌండ్ సౌండ్‌కు మద్దతు ఇస్తుంది. రెండవది టాటా ప్లే బింగే+ బాక్స్ రూ.2,999 ధర వద్ద లభిస్తుంది. ఇది అంతర్నిర్మిత క్రోమ్ కాస్ట్ మరియు గూగుల్ అసిస్టెంట్ మద్దతు గల వాయిస్ సెర్చ్ రిమోట్‌ను అందిస్తుంది. గూగుల్ ప్లే నుండి ముందే ఇన్‌స్టాల్ చేయబడిన 5000 కంటే ఎక్కువ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. టాటా ప్లే యొక్క కొత్త కనెక్షన్‌తో మీరు హంగామా ప్లే, డిస్నీ+ హాట్‌స్టార్, ఈరోస్‌నౌ, సోనీలైవ్ మరియు ZEE5తో సహా మొత్తం 10 OTT యాప్‌లకు 6 నెలలపాటు ఉచిత సభ్యత్వాన్ని పొందుతారు. అదనంగా అమెజాన్ ప్రైమ్ వీడియో సభ్యత్వం కూడా 3 నెలల పాటు ఉచితంగా లభిస్తుంది.

టాటా ప్లే+ సెట్-టాప్ బాక్స్

చివరిగా టాటా ప్లే+ సెట్-టాప్ బాక్స్ కనెక్షన్ ను రూ.4,999 ధర వద్ద పొందవచ్చు. అయితే మీరు ఎలాంటి OTT సబ్‌స్క్రిప్షన్‌ను పొందలేరు కానీ మీరు కొత్త కనెక్షన్‌ను తీసుకునేటప్పుడు టాటా ప్లే+తో ఉచితంగా అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్‌ని పొందుతారు. మీరు ఈ బాక్స్‌లో గరిష్టంగా 625 గంటల లైవ్ టీవీని రికార్డ్ చేయవచ్చు. అదనంగా ఇది స్టాండ్‌బైలో మీ కోసం సిరీస్‌ను కూడా రికార్డ్ చేయగలదు. మీరు ఈ బాక్స్ లో ప్రత్యక్ష ప్రసార టీవీని పాజ్ చేయవచ్చు లేదా రివైండ్ చేయవచ్చు. మీరు మీ ప్రకారం ఏదైనా వర్గం లేదా ఛానెల్‌లో లాక్‌ని ఉంచవచ్చు. ఇది మొబైల్ ఫోన్ నుండి రికార్డింగ్‌ను ఆన్ చేయడానికి లేదా ఆపడానికి మీకు ఎంపికను కూడా ఇస్తుంది. ఇది ఆటో-స్టాండ్‌బై, పేరెంటల్ కంట్రోల్స్, డాల్బీ డిజిటల్ సరౌండ్ సౌండ్ వంటి ప్రాథమిక ఫీచర్‌లతో అమర్చబడి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Tata Play DTH vs Airtel DTH: Check Free OTT Subscriptions, Price and More Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X