Tata Play Fiber ఖరీదైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు వాటి వివరాలు!! OTT బెనిఫిట్స్ కూడా లేకుండా...

|

ఇంటర్నెట్ యొక్క అవసరం ప్రస్తుతం అధికంగా ఉంది. హై-స్పీడ్ డేటా కోసం అధిక మంది మొబైల్ ఇంటర్నెట్ కోసం కాకుండా బ్రాడ్‌బ్యాండ్ మీద ఆధారపడుతున్నారు. బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో టాటా ప్లే ఫైబర్ కంపెనీ భారతదేశంలో తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. ఈ కంపెనీ తన యొక్క వినియోగదారుల యొక్క అవసరాల దృష్ట్యా 50 Mbps నుండి 1 Gbps వరకు వేగంతో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తుంది.

టాటా ప్లే ఫైబర్

మీరు మీ ప్రాంతంలో అతి పెద్ద బ్రాండ్ మరియు నమ్మకమైన కస్టమర్ కేర్ టీమ్‌ గల బ్రాడ్‌బ్యాండ్ ప్లేయర్ కోసం చూస్తున్నట్లయితే కనుక టాటా ప్లే ఫైబర్ అనువైనదిగా ఉంటుంది. టాటా ప్లే ఫైబర్ వినియోగదారులకు 99.99% నెట్‌వర్క్ అప్‌టైమ్, అధిక భద్రత, ఏకరీతి అప్‌లోడ్ మరియు డౌన్‌లోడ్ స్పీడ్‌లతో పాటు అన్ని బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో నెలవారీ FUP డేటాను అందిస్తుంది.

టాటా ప్లే ఫైబర్ ఎంట్రీ లెవల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

టాటా ప్లే ఫైబర్ ఎంట్రీ లెవల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

టాటా ప్లే ఫైబర్ యొక్క ఖరీదైన ఎంట్రీ-లెవల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 50 Mbps వేగంతో నెలకు రూ.749 ధర వద్ద వస్తుంది. దీనిని మూడు నెలలకు రూ.2097, ఆరు నెలలకు రూ.3300, 12 నెలలకు రూ.6,000 ధరల వద్ద కొనుగోలు చేయవచ్చు. ఎవరైనా కస్టమర్ టాటా ప్లే ఫైబర్ నుండి ఏదైనా ఒక ప్లాన్ ను ఒక నెల కంటే ఎక్కువ చెల్లుబాటు కోసం పొందితే కనుక ఇన్‌స్టాలేషన్ ఖర్చు ఉండదు. వినియోగదారులు ఈ ప్లాన్ తో 3.3TB నెలవారీ FUP డేటాను పొందుతారు. దీని తర్వాత డేటా స్పీడ్ 3 Mbpsకి పడిపోతుంది. కస్టమర్‌లు ల్యాండ్‌లైన్ కనెక్షన్‌ని కూడా ఉచితంగా పొందవచ్చు. అయితే దానికి సంబంధించిన పరికరాలను విడిగా కొనుగోలు చేయవలసి ఉంటుంది అని గమనించండి.

టాటా ప్లే ఫైబర్ vs జియోఫైబర్

టాటా ప్లే ఫైబర్ vs జియోఫైబర్

టాటా ప్లే ఫైబర్ యొక్క బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో వినియోగదారులకు అందించే సేవలు మరియు ప్రయోజనాలు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవడానికి ఈ ప్లాన్ సరిపోతుంది. ఇదే ధర వద్ద జియోఫైబర్ తన వినియోగదారులకు 100 Mbps ప్లాన్‌ను అందిస్తుంది. అది కూడా OTT ప్రయోజనాలను అదనంగా అందిస్తూ కూడా. అయితే టాటా ప్లే ఫైబర్ తన కస్టమర్‌లకు అందించే అదనపు ప్రయోజనాలు లేని తన 50 Mbps ప్లాన్ తో కస్టమర్‌ల వద్ద నుంచి అధిక మొత్తంలో డబ్బును వసూలు చేస్తోంది. ఎవరైనా ఒక కస్టమర్ జియోఫైబర్ అందుబాటులో ఉన్న ప్రాంతంలో టాటా ప్లే ఫైబర్‌ను ఎందుకు ఎంచుకుంటారో అనేది గుర్తించడం కష్టం.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్

టాటా ప్లే ఫైబర్ ఈ ప్లాన్‌తో మాత్రమే కాకుండా కంపెనీ నుండి వచ్చే అన్ని హై-ఎండ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు కూడా ఎటువంటి OTT ప్రయోజనాలతో రావు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ మరియు జియోఫైబర్ వంటి ప్లేయర్‌లతో గల పోటీలో టాటా ప్లే ఫైబర్ మార్కెట్‌లో ప్రభావం చూపడం కష్టమవుతుంది. అంతేకాకుండా Excitel వంటి చిన్న ప్లేయర్‌లు కూడా పోటీలో ఉన్నాయి. ఇవి అధిక వేగంతో మరింత సరసమైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తాయి. మార్కెట్ లో ఎల్లప్పుడు పోటీ అధికంగా ఉంటుంది కాబట్టి టాటా ప్లే ఫైబర్ కొత్త ట్రెండ్‌ను అందుకోలేకపోయినట్లు కనిపిస్తోంది. అలాగే ఇతర ప్లేయర్‌లు అందిస్తున్న దానికంటే దాని సేవలు మరింత "ప్రీమియం"గా ఉన్నాయని కంపెనీ విశ్వసిస్తోంది.

టాటా ప్లే STB కొనుగోలుపై రూ.400 డిస్కౌంట్ ఆఫర్

టాటా ప్లే STB కొనుగోలుపై రూ.400 డిస్కౌంట్ ఆఫర్

టాటా ప్లే యొక్క DTH ఆపరేటర్ గా మారాలని ప్రయత్నిస్తున్న వారు సంస్థ యొక్క స్టాండర్డ్ HD STBని కొనుగోలు చేయాలని చూస్తుంటే కనుక వారికి ప్రస్తుతం దానిని రూ.150 తగ్గింపుతో కేవలం రూ.1,699 ధర వద్ద పొందవచ్చు. ఈ డిస్కౌంట్ మొత్తాన్ని పొందడానికి వినియోగదారులు ఆన్‌లైన్‌లో పేమెంట్ చేస్తున్నప్పుడు ‘TPL150' కోడ్‌ను ఉపయోగించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. స్టాండర్డ్ STB ని ఇష్టపడని వినియోగదారులు టాటా ప్లే యొక్క బింగే+ STB ని కొనుగోలు చేయవచ్చు. దీనిని కొనుగోలు చేసే కొత్త వినియోగదారులు రూ.200 వరకు తగ్గింపును పొందవచ్చు. ఇది టాటా ప్లే అందించే హైబ్రిడ్ STB. దీని ద్వారా వినియోగదారులు కొన్ని బటన్‌ల క్లిక్‌తో శాటిలైట్ టీవీ మరియు OTT కంటెంట్ రెండింటినీ చూడవచ్చు. ఈ డిస్కౌంట్ మొత్తాన్ని పొందడానికి వినియోగదారులు కంపెనీకి ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. డిస్కౌంట్ పొందడం కోసం వినియోగదారులు ఆన్‌లైన్‌లో ‘TPL200' కోడ్‌ను వర్తింపజేయవలసి ఉంటుంది అని గుర్తుంచుకోండి. ఈ STBను కొనుగోలు చేసిన వినియోగదారులు అదనంగా టాటా స్కై బింగే సర్వీసు యొక్క ఒక నెల సబ్స్క్రిప్షన్ ని ఉచితంగా కూడా పొందుతారు.

టాటా ప్లే GSAT-24 సాటిలైట్ సేవలు

టాటా ప్లే GSAT-24 సాటిలైట్ సేవలు

GSAT-24 సాటిలైట్ అందుబాటులోకి రావడంతో తన యొక్క వినియోగదారులకు విశ్వసనీయమైన మరియు అతుకులు లేని DTH సేవలను అందించడంలో టాటా ప్లే మరింత మెరుగైన స్థానానికి చేరుకుంటుంది. అలాగే కంపెనీ OTT ఆఫర్‌లను కూడా అధికంగా అందించబోతున్నది. అలాగే DTH విభాగంలో కూడా కంపెనీ యొక్క పోటీదారులతో పోలిస్తే ఖచ్చితంగా ఒక అంచున అధిక స్థానంలోనే ఉంటుంది. 'డిమాండ్-డ్రైవెన్' మోడల్‌లో ఆపరేషనల్ శాటిలైట్ మిషన్‌లను చేపట్టడానికి భారత ప్రభుత్వంచే NSIL ఏర్పడింది. టెక్‌రాడార్ నివేదిక ప్రకారం GSAT-24 సాటిలైట్ ప్రస్తుతం అందుబాటులోకి రావడంతో టాటా ప్లే విభాగంలో వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడానికి వీలును కల్పిస్తుంది. టాటా ప్లే ఇప్పటికే దేశంలో అతిపెద్ద DTH ప్లేయర్ లలో ఒకటిగా కొనసాగుతున్నది. ఈ DTH ఆపరేటర్ తన యొక్క వినియోగదారులకు OTT నెట్‌ఫ్లిక్స్ బండిల్ తో కూడిన టీవీ ప్లాన్‌లను ఇప్పటికే ప్రకటించింది. కంపెనీ అందించే OTT కాంబో ప్లాన్‌ల విభాగంలో వినియోగదారులు వారి సాధారణ శాటిలైట్ టీవీ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ మాత్రమే కాకుండా మరొక 10 కంటే ఎక్కువ OTT ప్లాట్‌ఫారమ్‌లను కూడా పొందవచ్చు. టాటా ప్లే దాని పోటీదారుల కంటే వేగంగా ముందుకు సాగుతూ కంపెనీని లీడర్ పొజిషన్‌లో ఉంచడంలో GSAT-24 సాటిలైట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

Best Mobiles in India

English summary
Tata Play Fiber Expensive Entry Level Broadband Plans Comes Without OTT Benefits

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X