టాటా ప్లే ఫైబర్ vs ఎయిర్‌టెల్: 200 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో బెస్ట్ ఎవరు?

|

ఇండియాలోని బ్రాడ్‌బ్యాండ్ రంగంలో టాటా ప్లే ఫైబర్ మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రెండు కూడా అద్భుతమైన ఇంటర్నెట్ సర్వీస్లను అందిస్తూ అధిక మంది వినియోగదారులను సంపాదించుకొని టాప్ ప్రొవైడర్లలో ఒకటిగా నిలిచాయి. ఈ రెండు కంపెనీలు సరసమైన ధరల వద్దనే వినియోగదారులకు అద్భుతమైన సేవలను అందించడంలో ప్రసిద్ధి చెందాయి. టాటా ప్లే ఫైబర్ అనేది టాటా స్కై ఫైబర్ యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ అయినప్పటికీ ముందు అందించే అదే రకమైన ప్లాన్‌లను అందిస్తుంది. టాటా ప్లే ఫైబర్ మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రెండూ కూడా తమ కస్టమర్‌లకు 200 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అందిస్తున్నాయి. అయితే ఎవరు మెరుగైన ప్రయోజనాలను అందిస్తున్నారో వంటి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

టాటా ప్లే ఫైబర్ 200 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

టాటా ప్లే ఫైబర్ 200 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

టాటా ప్లే ఫైబర్ దాని 200 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను రూ.1150 ధర వద్ద అందిస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు కంపెనీ నుండి ఉచిత రూటర్‌తో పాటు 3.3TB నెలవారీ ఫెయిర్-యూసేజ్-పాలసీ (FUP) డేటాను పొందుతారు. వినియోగదారులు మూడు నెలల ప్లాన్ లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌కు వెళితే ఇన్‌స్టాలేషన్ చార్జీలను ఉచితంగా పొందవచ్చు. టాటా ప్లే ఫైబర్ యొక్క ఈ 200 Mbps ప్లాన్ ఒక నెల, మూడు నెలలు, ఆరు నెలలు మరియు పన్నెండు నెలల చెల్లుబాటు కాలంతో పాటు అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు దీర్ఘకాలిక ఎంపిక కోసం వెళుతున్నట్లయితే వారు సుమారుగా రూ.10,200 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ప్లాన్ ను పొందిన వారు అదనపు ఖర్చు లేకుండా ఫిక్స్‌డ్-లైన్ వాయిస్ కాలింగ్ కనెక్షన్ ను ఉచితంగా పొందవచ్చు. FUP డేటా వినియోగించబడిన తర్వాత డేటా యొక్క స్పీడ్ 3 Mbpsకి తగ్గించబడుతుంది.

ఉచితంగా టాటా ప్లే ఫైబర్ 200 Mbps ప్లాన్‌
 

ఉచితంగా టాటా ప్లే ఫైబర్ 200 Mbps ప్లాన్‌

టాటా ప్లే ఫైబర్ తన యొక్క వినియోగదారులకు రూ.1150 ధర వద్ద అందించే 200 Mbps అద్భుతమైన ప్లాన్‌ను వినియోగదారులు 200 Mbps డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ వేగంతో హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్‌ను పొందవచ్చు. జియోఫైబర్ మాదిరిగానే కంపెనీ అందిస్తున్న కొత్త 'ట్రై అండ్ బై' స్కీమ్ ఇది. ఇక్కడ టాటా ప్లే ఫైబర్ వినియోగదారులకు ముందుగా కంపెనీ సర్వీస్ క్వాలిటీని పరీక్షించి ఆపై కనెక్షన్‌ని కొనుగోలు చేయడం ద్వారా నిబద్ధతతో ఉండే అవకాశాన్ని కల్పిస్తోంది. 'ప్రయత్నించండి మరియు కొనుగోలు చేయండి' ఆఫర్ విభాగంలో 200 Mbps ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొనివచ్చింది. అయితే వినియోగదారులు దీనిని పొందడానికి తిరిగి చెల్లించే సెక్యూరిటీ డిపాజిట్ చేయవలసి ఉంటుంది. టాటా ప్లే ఫైబర్ వినియోగదారులు 200 Mbps ప్లాన్‌ను ఉచితంగా పొందాలనుకుంటే వారు కంపెనీకి రూ.1500 రీఫండబుల్ సెక్యూరిటీ డిపాసిట్ మొత్తాన్ని చెల్లించాలి. ఈ ట్రయల్ ప్లాన్‌తో వినియోగదారులు 200 Mbps అత్యధిక వేగంతో 1000GB డేటాను పొందుతారు. కంపెనీ నుండి ఈ మొత్తాన్ని పూర్తిగా వాపసు పొందడానికి మీరు 30వ రోజులోపు కనెక్షన్‌ని రద్దు చేయాల్సి ఉంటుందని గమనించండి. టాటా ప్లే ఫైబర్ ట్రయల్ వ్యవధిలో వినియోగదారులకు ఉచిత ల్యాండ్‌లైన్ కనెక్షన్‌ను కూడా అందిస్తుంది. వినియోగదారులు 30 రోజుల సర్వీసును వినియోగించుకున్న తర్వాత కనెక్షన్‌ని రద్దు చేస్తే కనుక వారికి రూ.500 ఛార్జ్ చేయబడుతుంది. అలాగే సెక్యూరిటీ డిపాజిట్‌లో రూ.1,000 మాత్రమే తిరిగి చెల్లించబడుతుంది. ఇంకా వినియోగదారుకు వాపసు అనేది కస్టమర్ ఆవరణ పరికరాలు (CPE) రికవరీకి లోబడి ఉంటుంది.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ 200 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ 200 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ దాని 200 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను రూ.999 ధర వద్ద అందిస్తుంది. ఇది ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్‌తో వినియోగదారులు పొందే దానికంటే చౌకైనది మరియు అదనంగా ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ యొక్క ఈ ప్లాన్ తో వినియోగదారులు అమెజాన్ ప్రైమ్, Wynk మ్యూజిక్, షా అకాడమీ వంటి మరిన్నింటికి ఉచిత యాక్సిస్ ను పొందుతారు. ఈ ప్లాన్‌తో ఉచిత ఫిక్స్‌డ్-లైన్ వాయిస్ కాలింగ్ కనెక్షన్ కూడా అందించబడుతుంది. ఈ ప్లాన్ 3.3TB నెలవారీ FUP డేటాను కూడా అందిస్తుంది. ఎయిర్‌టెల్ తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను దీర్ఘకాలికంగా డిస్కౌంట్‌లతో అందిస్తుంది.

టాటా ప్లే ఫైబర్ vs ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ 200 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: బెస్ట్ ఎవరు

టాటా ప్లే ఫైబర్ vs ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ 200 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: బెస్ట్ ఎవరు

టాటా ప్లే ఫైబర్ మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ అందించే 200 Mbps బ్రాడ్‌బ్యాండ్ యొక్క రెండు ప్లాన్‌లలో మీరు ఒకదాన్ని ఎంచుకోవాలనుకుంటే కనుక ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ యొక్క ప్లాన్ ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు. ఈ రెండిటికి గట్టి పోటీని ఇచ్చే జియోఫైబర్ మాత్రం తన యొక్క వినియోగదారులకు 200 Mbps ప్లాన్‌ను అందించదు. ఎయిర్‌టెల్ యొక్క ప్లాన్ OTT ప్రయోజనాలను అందిస్తుంది మరియు టాటా ప్లే ఫైబర్ యొక్క 200 Mbps ప్లాన్ అందించే ఆఫర్‌లతో పోలిస్తే వినియోగదారులు పొందే దానికంటే చౌకగా ఉంటుంది.

Best Mobiles in India

English summary
Tata Play Fiber vs Airtel Xstream Fiber: Who is the BEST of 200 Mbps Broadband Plans?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X