టాటా ప్లే, జియో మరిన్ని ISPల బెస్ట్ అర్ధ-వార్షిక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు!!

|

ఇండియాలోని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ISPలు) అందరూ కూడా తమ సబ్‌స్క్రైబర్ల యొక్క అవసరానికి అనుగుణంగా వివిధ రకాల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తున్నారు. కొన్ని ISPలు వేర్వేరు ధరల వద్ద వివిధ ప్రయోజనాలతో ప్లాన్‌లను అందించడమే కాకుండా విభిన్న చెల్లుబాటు వ్యవధిని కూడా అందిస్తున్నాయి. అయితే లాంగ్ టర్మ్ ప్లాన్‌లను ఎంచుకోవాలనుకునే వినియోగదారుల కోసం ISPలు త్రైమాసిక, అర్ధ-వార్షిక మరియు వార్షిక ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఇవి వాస్తవానికి నెలవారీ ప్లాన్‌ల కంటే తక్కువ ఖర్చుతో లభిస్తాయి. అయితే ఏకమొత్తంలో మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. టాటా ప్లే, జియో, ఎక్సిటెల్ వంటి ISPలు 6 నెలల చెల్లుబాటు కాలానికి అందించే ఎంపిక చేసిన హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు మరియు వాటి ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలు విపులంగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టాటా ప్లే ఫైబర్ 200 Mbps ప్లాన్

టాటా ప్లే ఫైబర్ 200 Mbps ప్లాన్

భారతదేశంలోని బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో అత్యంత ముఖ్యమైన సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటైన టాటా ప్లే ఫైబర్ తన యొక్క అన్ని రకాల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను 6 నెలల వాలిడిటీతో అందిస్తుంది. టాటా ప్లే మార్కెట్‌లోని కీలకమైన ప్లేయర్‌లలో ఒకటి. ఇది వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎల్లప్పుడూ తమ ప్లాన్‌లను మార్పులు చేస్తూ అందిస్తోంది. వినియోగదారులు టాటా ప్లే ఫైబర్ నుండి 200 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను పొందవచ్చు. ఇది ఆరు నెలలకు రూ.5,550 ధర ట్యాగ్‌తో వస్తుంది. ఈ ప్లాన్ వాస్తవానికి వినియోగదారులు నెలవారీ చెల్లించే దానితో పోలిస్తే దాదాపు రూ.1,350 ఆదా చేయడంలో సహాయపడుతుంది. టాటా ప్లే ఫైబర్ యొక్క 200 Mbps ప్లాన్ వాస్తవానికి చౌకైనది. అయితే OTT ప్లాట్‌ఫారమ్‌లకు సబ్‌స్క్రిప్షన్‌ల వంటి అదనపు ప్రయోజనాన్ని అందించదు.

జియోఫైబర్ 150 Mbps ప్లాన్

జియోఫైబర్ 150 Mbps ప్లాన్

జియోఫైబర్ నుండి అత్యధికంగా అమ్ముడైన సెమీ-వార్షిక ప్లాన్‌లలో ఇది ఒకటి. 150 Mbps వేగంతో లభించే జియోఫైబర్ ప్లాన్ ఆరు నెలల వాలిడిటీకి రూ.5,994 ధరతో అందిస్తుంది. అయితే ఈ ప్లాన్ యొక్క వాస్తవ వ్యాలిడిటీ 180 రోజులు కానీ అదనంగా మరొక 15 రోజులు అదనపు ఖర్చు లేకుండానే వినియోగదారులు ఈ ప్రయోజనాన్ని పొందుతారు. జియోఫైబర్ నుండి ఈ ప్లాన్‌తో వినియోగదారులు 150 Mbps యొక్క అప్‌లోడ్ మరియు డౌన్‌లోడ్ స్పీడ్‌ని అందుకుంటారు. అంతేకాకుండా జియోఫైబర్ నుండి వచ్చే ఈ ప్లాన్ 14 OTT ప్లాట్‌ఫారమ్‌లు మరియు రెండు జియో అప్లికేషన్‌ల ఉచిత సబ్‌స్క్రిప్షన్‌లతో వస్తుంది. OTT సబ్‌స్క్రిప్షన్‌లలో అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ మరియు మరిన్ని ఉన్నాయి.

Excitel బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

Excitel బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

అర్ధ-వార్షిక ప్లాన్‌ల గురించి మాట్లాడుతున్నపుడు భారతదేశం యొక్క అప్ కమింగ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ Excitel కేవలం మూడు రకాల వేగాలతో మాత్రమే తన బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందిస్తుంది. మూడు ప్లాన్‌లు ఆరు నెలల వాలిడిటీతో వస్తాయి. వినియోగదారులు వరుసగా రూ.490, రూ. 545 మరియు రూ.600 ధర ట్యాగ్‌తో 100 Mbps, 200 Mbps లేదా 300 Mbps వేగంతో పొందవచ్చు. పేర్కొన్న ధరలు నెలవారీ ప్రాతిపదికన ఉంటాయి మరియు GST చేర్చబడలేదు. అంతేకాకుండా, Excitel నుండి ప్లాన్‌లు నిజంగా అపరిమితంగా ఉంటాయి మరియు FUP డేటా పరిమితి విధించబడదు.

BSNL భారత్ ఫైబర్ 200 Mbps ప్లాన్

BSNL భారత్ ఫైబర్ 200 Mbps ప్లాన్

భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికమ్యూనికేషన్స్ సంస్థ BSNL 200 Mbps ప్లాన్‌ను అర్ధ-వార్షిక వాలిడిటీతో అందిస్తుంది. బెస్ట్ సెల్లర్ గా గల 'ఫైబర్ ప్రీమియం ప్లస్ హాఫ్ ఇయర్లీ' ప్లాన్ ను 200 Mbps ఇంటర్నెట్ స్పీడ్‌తో వినియోగదారులు ఆరు నెలల చెల్లుబాటు వ్యవధికి రూ.7,024 ధర వద్ద పొందవచ్చు. పేర్కొన్న ధర GSTకి మినహాయించబడింది మరియు ప్లాన్ FUP పరిమితి 3300GB లేదా 3.3TBతో వస్తుంది. డేటా పరిమితికి మించిన తరువాత వినియోగదారులు 15 Mbps ఇంటర్నెట్ వేగాన్ని ఆస్వాదించవచ్చు. 'ఫైబర్ ప్రీమియం ప్లస్ హాఫ్ ఇయర్లీ' ప్లాన్ మొదటి బిల్లు అద్దెపై రూ.500 వరకు 90% తగ్గింపును కూడా అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Tata Play, Jio and More ISPs Best Half-Yearly Broadband Plans: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X