Tata Play STBల కొనుగోలుపై రూ.400 వరకు డిస్కౌంట్ ఆఫర్!! మిస్ చేసుకోకండి...

|

భారతదేశంలో నంబర్ వన్ డైరెక్ట్-టు-హోమ్ (DTH) ఆపరేటర్ అయిన టాటా ప్లే మరికొంత మంది వినియోగదారులను ఆకట్టుకోవడానికి దాని యొక్క సెట్-టాప్ బాక్స్‌ల (STBలు) కొనుగోలు మీద రూ.400 వరకు తగ్గింపును అందిస్తోంది. టాటా ప్లే కంపెనీ తన యొక్క DTH సేవల కోసం GSAT-24 సాటిలైట్ యొక్క సామర్థ్యాన్ని NSIL (న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్) నుండి 15 సంవత్సరాల చెల్లుబాటు కోసం లీజుకు తీసుకోవడంతో కొత్త విధానాలతో చాలా దూకుడుగా ఉంది.

 

DTH

ఇక మీదట వినియోగదారులు ఓవర్-ది-టాప్ (OTT) సబ్‌స్క్రిప్షన్‌లతో లభించే ఛానెల్ ప్యాక్‌లను కూడా పొందబోతున్నారు. అయితే టాటా ప్లే యొక్క STBల గురించి మరొక గొప్ప విషయం ఏమిటంటే DTH విభాగంలో ఇతర పోటీదారులు అందించే ఆఫర్‌లతో పోలిస్తే కనుక ఇవి ఖరీదైనవి కాకుండా తక్కువ ధరకే లభిస్తున్నాయి. ప్రస్తుతం టాటా ప్లే తన STBలతో అందిస్తున్న తగ్గింపు ఆఫర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Amazon Alexa మీకు ఇష్టమైన వారి వాయిస్‌తో మాట్లాడుతుంది!! త్వరలోనే అందుబాటులోకిAmazon Alexa మీకు ఇష్టమైన వారి వాయిస్‌తో మాట్లాడుతుంది!! త్వరలోనే అందుబాటులోకి

టాటా ప్లే STB కొనుగోలుపై రూ.400 డిస్కౌంట్ ఆఫర్
 

టాటా ప్లే STB కొనుగోలుపై రూ.400 డిస్కౌంట్ ఆఫర్

టాటా ప్లే యొక్క DTH ఆపరేటర్ గా మారాలని ప్రయత్నిస్తున్న వారు సంస్థ యొక్క స్టాండర్డ్ HD STBని కొనుగోలు చేయాలని చూస్తుంటే కనుక వారికి ప్రస్తుతం దానిని రూ.150 తగ్గింపుతో కేవలం రూ.1,699 ధర వద్ద పొందవచ్చు. ఈ డిస్కౌంట్ మొత్తాన్ని పొందడానికి వినియోగదారులు ఆన్‌లైన్‌లో పేమెంట్ చేస్తున్నప్పుడు ‘TPL150' కోడ్‌ను ఉపయోగించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి.

Twitter లో నకిలీ ఖాతాలు , Bot లు తేల్చండి ! లేకపోతే డీల్ లేనట్లే ...?Twitter లో నకిలీ ఖాతాలు , Bot లు తేల్చండి ! లేకపోతే డీల్ లేనట్లే ...?

బింగే+ STB

స్టాండర్డ్ STB ని ఇష్టపడని వినియోగదారులు టాటా ప్లే యొక్క బింగే+ STB ని కొనుగోలు చేయవచ్చు. దీనిని కొనుగోలు చేసే కొత్త వినియోగదారులు రూ.200 వరకు తగ్గింపును పొందవచ్చు. ఇది టాటా ప్లే అందించే హైబ్రిడ్ STB. దీని ద్వారా వినియోగదారులు కొన్ని బటన్‌ల క్లిక్‌తో శాటిలైట్ టీవీ మరియు OTT కంటెంట్ రెండింటినీ చూడవచ్చు. ఈ డిస్కౌంట్ మొత్తాన్ని పొందడానికి వినియోగదారులు కంపెనీకి ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. డిస్కౌంట్ పొందడం కోసం వినియోగదారులు ఆన్‌లైన్‌లో ‘TPL200' కోడ్‌ను వర్తింపజేయవలసి ఉంటుంది అని గుర్తుంచుకోండి. ఈ STBను కొనుగోలు చేసిన వినియోగదారులు అదనంగా టాటా స్కై బింగే సర్వీసు యొక్క ఒక నెల సబ్స్క్రిప్షన్ ని ఉచితంగా కూడా పొందుతారు.

టాటా ప్లే+ HD STB

టాటా ప్లే+ HD STBని కొనుగోలు చేసే వినియోగదారులు రూ.400 వరకు డిస్కౌంట్ ని పొందుతారు. ఈ STB ఇప్పుడు రూ.4,999 ధర వద్ద లభిస్తుంది. అంటే కంపెనీ కొనుగోలుపై దాదాపు 8% వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ డిస్కౌంట్ మొత్తాన్ని పొందడానికి వినియోగదారులు కంపెనీకి ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ ద్వారా పేమెంట్ చేస్తున్నప్పుడు చెక్‌అవుట్ సమయంలో వినియోగదారులు ‘TPL400' కోడ్‌ను వర్తింపజేయాలి. పైన తెలిపిన STBలని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి మీరు టాటా ప్లే యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఇక్కడ ఈ STBలన్నీ జాబితా చేయబడ్డాయి. ప్రస్తుతం రూ.1,499 ధర వద్ద లభించే SD STB లపై ఎలాంటి డిస్కౌంట్ లభించదు.

మీడియాటెక్ కొత్త ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌ లాంచ్ అయింది!! GPU పనితీరు మరింత మెరుగ్గామీడియాటెక్ కొత్త ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌ లాంచ్ అయింది!! GPU పనితీరు మరింత మెరుగ్గా

GSAT-24 సాటిలైట్

GSAT-24 సాటిలైట్ అందుబాటులోకి రావడంతో తన యొక్క వినియోగదారులకు విశ్వసనీయమైన మరియు అతుకులు లేని DTH సేవలను అందించడంలో టాటా ప్లే మరింత మెరుగైన స్థానానికి చేరుకుంటుంది. అలాగే కంపెనీ OTT ఆఫర్‌లను కూడా అధికంగా అందించబోతున్నది. అలాగే DTH విభాగంలో కూడా కంపెనీ యొక్క పోటీదారులతో పోలిస్తే ఖచ్చితంగా ఒక అంచున అధిక స్థానంలోనే ఉంటుంది. టాటా ప్లే ఇప్పటికే దేశంలో అతిపెద్ద DTH ప్లేయర్ లలో ఒకటిగా కొనసాగుతున్నది. ఈ DTH ఆపరేటర్ తన యొక్క వినియోగదారులకు OTT నెట్‌ఫ్లిక్స్ బండిల్ తో కూడిన టీవీ ప్లాన్‌లను ఇప్పటికే ప్రకటించింది. కంపెనీ అందించే OTT కాంబో ప్లాన్‌ల విభాగంలో వినియోగదారులు వారి సాధారణ శాటిలైట్ టీవీ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ మాత్రమే కాకుండా మరొక 10 కంటే ఎక్కువ OTT ప్లాట్‌ఫారమ్‌లను కూడా పొందవచ్చు. టాటా ప్లే దాని పోటీదారుల కంటే వేగంగా ముందుకు సాగుతూ కంపెనీని లీడర్ పొజిషన్‌లో ఉంచడంలో GSAT-24 సాటిలైట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

టాటా ప్లే మేనేజింగ్ డైరెక్టర్

టాటా ప్లే మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ హరిత్ నాగ్‌పాల్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా OTT కంటెంట్‌పై ఆసక్తి విపరీతంగా పెరిగినందున వినియోగదారులు ఇకపై సాధారణ టీవీ ఛానెల్‌లను చూడటం లేదని అన్నారు. అందువల్ల కొత్త బ్రాండ్ వినియోగదారులకు OTT మరియు DTH కంటెంట్‌ను అందించడానికి మరింత అనుగుణంగా ఉందని లైవ్‌మింట్ నివేదించింది. టాటా ప్లే కొత్త కాంబో ప్యాక్‌లతో వినియోగదారులకు కంటెంట్ వీక్షణ అనుభవాన్ని మరింత మెరుగ్గా అతుకులు లేకుండా అందిస్తుంది. వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లు మరియు టీవీ స్క్రీన్‌లలో OTT కంటెంట్ మరియు టీవీ ఛానెల్‌లను యాక్సెస్ చేయగలరు. వినియోగదారుల కోసం స్క్రీన్‌ల అవసరాన్ని బట్టి ప్లాన్‌ల ధరలు మారుతూ ఉంటాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Tata Play Offers Up to Rs.400 Discount Offers on Purchase STB's

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X