GSAT-24 సాటిలైట్ రాకతో టాటా ప్లే సేవలలో భారీ మార్పులు!!

|

భారతదేశంలోని DTH విభాగంలో ముందునుంచి కూడా టాటా స్కై అద్భుతమైన సేవలను అందిస్తూ మంచి యూజర్ బేస్ ని కలిగి ఉంది. ఇటీవల కాలంలో టాటా స్కై టాటా ప్లేగా రూపాంతరం చెందిన తరువాత తన యొక్క వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడం కోసం కొత్త రకమైన ప్రయోగాలను చేస్తూనే ఉంది. ఇటీవల టాటా స్కై అంతరిక్షంలో GSAT-24 ఉపగ్రహాన్ని ప్రయోగించిన తర్వాత తన యొక్క సేవలను మరింత పెంచబోతోంది. GSAT-24 సాటిలైట్ దాదాపు 15 సంవత్సరాల వరకు లైఫ్ ని కలిగి ఉంది. ఇది భారతీయ కస్టమర్ల యొక్క డైరెక్ట్-టు-హోమ్ (DTH) అవసరాలను తీర్చగల అధిక-నాణ్యత టెలికమ్యూనికేషన్స్, టెలివిజన్ మరియు ప్రసార సేవలను అందించడంలో సహాయపడుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

DTH

టాటా ప్లే కంపెనీ తన యొక్క DTH సేవల కోసం GSAT-24 సాటిలైట్ యొక్క సామర్థ్యాన్ని NSIL (న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్) నుండి 15 సంవత్సరాల చెల్లుబాటు కోసం లీజుకు తీసుకుంది. NSIL అనేది ISRO (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) యాజమాన్యంలో ఉంది. ఇది ఇటీవల GSAT-24 సాటిలైట్ మిషన్‌ను ప్రయోగించింది. సాటిలైట్ సంస్కరణల తర్వాత ఎన్‌ఎస్‌ఐఎల్‌కి ఇది మొదటి మిషన్ కావడం విశేషం. 10,863 కిలోల సామర్ధ్యం గల ఈ సాటిలైట్ ని జూన్ 22న ఫ్రెంచ్ గయానాలోని కౌరౌ నుండి ఏరియన్‌స్పేస్ ద్వారా ప్రయోగించారు.

భారతదేశంలో మరింత మెరుగ్గా టాటా ప్లే సేవలు

భారతదేశంలో మరింత మెరుగ్గా టాటా ప్లే సేవలు

GSAT-24 సాటిలైట్ అందుబాటులోకి రావడంతో తన యొక్క వినియోగదారులకు విశ్వసనీయమైన మరియు అతుకులు లేని DTH సేవలను అందించడంలో టాటా ప్లే మరింత మెరుగైన స్థానానికి చేరుకుంటుంది. అలాగే కంపెనీ OTT ఆఫర్‌లను కూడా అధికంగా అందించబోతున్నది. అలాగే DTH విభాగంలో కూడా కంపెనీ యొక్క పోటీదారులతో పోలిస్తే ఖచ్చితంగా ఒక అంచున అధిక స్థానంలోనే ఉంటుంది.

NSIL

'డిమాండ్-డ్రైవెన్' మోడల్‌లో ఆపరేషనల్ శాటిలైట్ మిషన్‌లను చేపట్టడానికి భారత ప్రభుత్వంచే NSIL ఏర్పడింది. టెక్‌రాడార్ నివేదిక ప్రకారం GSAT-24 సాటిలైట్ ప్రస్తుతం అందుబాటులోకి రావడంతో టాటా ప్లే విభాగంలో వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడానికి వీలును కల్పిస్తుంది.

టాటా ప్లే

టాటా ప్లే ఇప్పటికే దేశంలో అతిపెద్ద DTH ప్లేయర్ లలో ఒకటిగా కొనసాగుతున్నది. ఈ DTH ఆపరేటర్ తన యొక్క వినియోగదారులకు OTT నెట్‌ఫ్లిక్స్ బండిల్ తో కూడిన టీవీ ప్లాన్‌లను ఇప్పటికే ప్రకటించింది. కంపెనీ అందించే OTT కాంబో ప్లాన్‌ల విభాగంలో వినియోగదారులు వారి సాధారణ శాటిలైట్ టీవీ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ మాత్రమే కాకుండా మరొక 10 కంటే ఎక్కువ OTT ప్లాట్‌ఫారమ్‌లను కూడా పొందవచ్చు. టాటా ప్లే దాని పోటీదారుల కంటే వేగంగా ముందుకు సాగుతూ కంపెనీని లీడర్ పొజిషన్‌లో ఉంచడంలో GSAT-24 సాటిలైట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

OTT కంటెంట్‌

టాటా ప్లే మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ హరిత్ నాగ్‌పాల్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా OTT కంటెంట్‌పై ఆసక్తి విపరీతంగా పెరిగినందున వినియోగదారులు ఇకపై సాధారణ టీవీ ఛానెల్‌లను చూడటం లేదని అన్నారు. అందువల్ల కొత్త బ్రాండ్ వినియోగదారులకు OTT మరియు DTH కంటెంట్‌ను అందించడానికి మరింత అనుగుణంగా ఉందని లైవ్‌మింట్ నివేదించింది. టాటా ప్లే కొత్త కాంబో ప్యాక్‌లతో వినియోగదారులకు కంటెంట్ వీక్షణ అనుభవాన్ని మరింత మెరుగ్గా అతుకులు లేకుండా అందిస్తుంది. వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లు మరియు టీవీ స్క్రీన్‌లలో OTT కంటెంట్ మరియు టీవీ ఛానెల్‌లను యాక్సెస్ చేయగలరు. వినియోగదారుల కోసం స్క్రీన్‌ల అవసరాన్ని బట్టి ప్లాన్‌ల ధరలు మారుతూ ఉంటాయి.

టాటా ప్లే కస్టమర్‌లు

టాటా ప్లే కస్టమర్‌లు తమ ప్యాక్‌లను రీఛార్జ్ చేసుకోని టాటా ప్లే సంస్థ ఉచితంగా రీకనెక్షన్‌లను పొందవచ్చు. అంతేకాకుండా సర్వీస్ విజిట్ ఛార్జీలు రూ.175ని పూర్తిగా తొలగించాలని కంపెనీ నిర్ణయించింది. DTH ఆపరేటర్‌లకు ఇది సహజమైన మార్గం. టాటా ప్లే దాని OTT కాంబో ప్యాక్‌లతో OTTని భవిష్యత్తుగా అంగీకరించడానికి మరియు ఏకీకృతం చేయడానికి మొదటి ఎత్తుగడ వేసింది. Airtel డిజిటల్ TV, Dish TV, D2h మరియు మరిన్నింటితో సహా దేశంలోని ఇతర ప్రముఖ DTH ఆపరేటర్లు కూడా దీనిని అనుసరిస్తారని భావిస్తున్నారు.

 

 

టాటా ప్లే బ్రాడ్‌బ్యాండ్

టాటా ప్లే బ్రాడ్‌బ్యాండ్

ప్రజలు టాటా ప్లే బ్రాడ్‌బ్యాండ్ యొక్క సేవలను ఎంచుకునే క్రమంలో ఎక్కువ మంది ఫిక్సడ్ డేటా ప్లాన్‌లలో చౌకైన ప్లాన్‌ను ఎంచుకుంటారు. ఈ ప్లాన్ యొక్క ధర 790 రూపాయలు. ఈ ప్లాన్ తన చెల్లుబాటు కాలంలో 50 Mbps వేగంతో మొత్తంగా 150GB డేటాను వినియోగదారులకు అందిస్తుంది. ఈ ప్లాన్ కాకుండా రూ.950, రూ.1,000, రూ.1,050, రూ.1,470 ధరల వద్ద మరో నాలుగు ప్లాన్లు కూడా ఉన్నాయి. ఇందులో రూ.950 నెలవారీ ప్లాన్ 100Mbps వేగంతో 250GB డేటాను, రూ.1000 ధర వద్ద లభించే ప్లాన్ 50 Mbps వేగంతో 500GB డేటాను అందిస్తుంది. కేవలం రూ.50ల తేడాతో ఈ ప్లాన్ 250GB ఎక్కువ డేటాను అందిస్తుంది. చివరి రెండు ప్లాన్‌ల విషయానికి వస్తే రూ.1,050 ప్లాన్ 100Mbps వేగంతో 500GB డేటాను మరియు రూ.1,470 ప్లాన్ 300 Mbps వేగంతో 500GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లు అన్ని కూడా ఉచిత రౌటర్, డేటా రోల్‌ఓవర్ ప్రయోజనం మరియు సురక్షిత కస్టడీతో వస్తాయి. కానీ ఈ ప్లాన్‌లతో ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు వర్తించబడతాయి.

Best Mobiles in India

English summary
Tata Play Services Working Big Changes With The Arrival of GSAT-24 Satellite

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X