సరసమైన ధరలో టాటా స్కై యొక్క 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు!! వాటి వివరాలు

|

ఇండియాలో డైరెక్ట్-టు-హోమ్ (DTH) మార్కెట్ లోని అతిపెద్ద సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన టాటా స్కై కంపెనీ తన FTTH వ్యాపారాన్ని "టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్" ను మరింత వేగవంతం చేయడానికి కూడా కృషి చేస్తోంది. ప్రస్తుత సమయాలలో రూ.1,000 కంటే తక్కువ ధర వద్ద కొనుగోలు చేయగల రెండు సరసమైన టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్‌లు 100 Mbps వేగంతో డేటాను వినియోగదారులకు అందిస్తాయి. చౌకైన ధర వద్ద మెరుగైన వేగంతో లభించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కోసం చూస్తున్న వారికి కంపెనీ యొక్క ఈ ప్లాన్ ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటాయి. కానీ టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ నుండి లభించే అధిక నాణ్యమైన సర్వీసు మీకు లభించకపోవచ్చు కానీ మీరు ఊహించిన దాని కన్నా మెరుగైన ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

టాటా స్కై 100 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

టాటా స్కై 100 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

టాటా స్కై సంస్థ 100 Mbps వేగంతో అందించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ యొక్క ధర ఒక నెలకి రూ.950, మూడు నెలలకు రూ.2700, ఆరు నెలలకు రూ.4500, మరియు 12 నెలలకు రూ.8400 ధరను కలిగి ఉంది. 3 నెలల ప్లాన్‌తో వినియోగదారులు రూ.150 ను ఆదా చేస్తారు. అలాగే 6 నెలల ప్లాన్‌తో రూ.200 ఆదా చేస్తారు మరియు 12 నెలల ప్లాన్‌తో వినియోగదారులు రూ.400 వరకు ఆదా చేయవచ్చు.

టాటా స్కై 50 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

టాటా స్కై 50 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

టాటా స్కై కంపెనీ సరసమైన ధర విభాగంలో అందించే మరొక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ యొక్క విషయానికి వస్తే వినియోగదారులు 50 Mbps వేగంతో లభించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కోసం వెళ్ళవచ్చు. అయితే ఇది 3 నెలలు, 6 నెలలు మరియు 12 నెలలు వంటి మూడు చెల్లుబాటు కాన్ఫిగరేషన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. 3 నెలల వాలిడిటీ ప్లాన్ యొక్క ధర రూ.2097 కాగా, 6 నెలల వాలిడిటీ ప్లాన్ ధర రూ.3300 కాగా చివరిగా 12 నెలల వాలిడిటీ ప్లాన్ రూ.6000 ధర వద్ద అందుబాటులో ఉంటుంది.

బ్రాడ్‌బ్యాండ్
 

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ గురించి మీరు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఏమిటంటే కంపెనీ ఉచిత డ్యూయల్-బ్యాండ్ రూటర్‌తో పాటు ఇన్స్టాలేషన్ ను కూడా పూర్తిగా ఉచితంగా అందిస్తుంది. ఇంకా కంపెనీ 99.9% నెట్‌వర్క్ అప్‌టైమ్‌ను వాగ్దానం చేస్తుంది మరియు రెండు ప్లాన్‌లు నెలకు 3.3TB డేటా యొక్క ఫెయిర్-యూసేజ్-పాలసీ (FUP) పరిమితితో వస్తాయి. కస్టమర్‌లు అన్ని ఒక నెల ప్లాన్‌లు మరియు 50 Mbps ప్లాన్‌ల కోసం రూ.1,000 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. అయితే టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ దేశంలో అన్ని చోట్ల అందుబాటులో లేదు. అయితే రాబోయే నెలల్లో కంపెనీ దూకుడుగా విస్తరించాలని యోచిస్తోంది.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ 1 Gbps ప్లాన్

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ 1 Gbps ప్లాన్

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ తన వినియోగదారులకు నెలకు రూ.3,600 ధర వద్ద కొత్తగా 1Gbps ప్లాన్‌ను అందిస్తుంది. ఇది భారతదేశంలో అత్యంత సరసమైన గిగాబిట్-స్పీడ్ ప్లాన్‌లలో ఒకటి. వినియోగదారులకు అధిక వేగాన్ని అందించడానికి కంపెనీ ఫైబర్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. టాటా స్కై యొక్క బ్రాడ్‌బ్యాండ్ సేవలు దేశంలోని ప్రతి ప్రాంతంలోనూ లేవని గమనించండి. కాబట్టి మీరు కంపెనీ నుండి ప్లాన్‌లను కొనుగోలు చేయలేకపోవచ్చు. సంబంధం లేకుండా మీరు టాటా స్కై నుండి 1 Gbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఇది మీకు మంచి ఎంపిక కావడానికి మరిన్ని కారణాలు చాలానే ఉన్నాయి. ఇది నెలకు 3.3TB లేదా 3,300GB ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP) డేటా ప్రయోజనంను వినియోగదారులకు అందిస్తుంది. Wi-Fi లో వినియోగదారులు 450 Mbps స్పీడ్‌ని పొందుతారని మరియు LAN కేబుల్‌తో 900 Mbps స్పీడ్‌ని అందుకుంటుందని కంపెనీ పేర్కొంది. ఎండ్ డివైస్ 5GHz నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేయగలదు మరియు యూజర్ డ్యూయల్-బ్యాండ్ కనెక్టివిటీతో వచ్చే రూటర్ కలిగి ఉంటే అతడు/ఆమె 1 Gbps స్పీడ్ పొందగలరు.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ 500 Mbps ప్లాన్

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ 500 Mbps ప్లాన్

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ 500 Mbps ప్లాన్ ఒక నెల చెల్లుబాటుతో రూ.2,300 ధర వద్ద లభిస్తుంది. అయితే ఇది 3, 6, మరియు 12 నెలల ఎంపికలో కూడా లభిస్తుంది. 3 నెలల చెల్లుబాటుకు రూ.6,900 (నెలకు రూ .2,300) ధర వద్ద పొందవచ్చు. 3 నెలలకు ఎంచుకున్నప్పుడు ఎటువంటి డిస్కౌంట్ లభించదు. 6 నెలల చెల్లుబాటుకు రూ.12,900 (నెలకు రూ .2,150) ధర వద్ద పొందవచ్చు. ఇది 6 నెలలకు కలుపుకొని నెలకు 150 రూపాయలు ఆదా చేయడంలో మీకు సహాయపడుతుంది. అంటే మొత్తం రూ.900 తగ్గింపుతో లభిస్తుంది. అయితే 12 నెలల చెల్లుబాటుకు రూ.24,600 (నెలకు రూ .2,050) ఖర్చు అవుతుంది. అంటే మీరు ప్రతి నెలా రూ.250 తగ్గింపు పొందవచ్చు. అంటే మొత్తం చెల్లుబాటులో రూ.3,000 వరకు తగ్గింపును పొందవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Tata Sky 100Mbps Speed Broadband Plans At Affordable Price: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X