రూ.149 లకే టాటా స్కై బింగే మొబైల్ ఓన్లీ ప్లాన్‌!! వివరాలు ఇవిగో...

|

భారతదేశపు ప్రముఖ డైరెక్ట్-టు-హోమ్ (డిటిహెచ్) టాటా స్కై అందించే సర్వీసులలో అన్నికంటే ముఖ్యమైన తన 'బింగే' సర్వీస్ కోసం కొత్త ఎంట్రీ లెవల్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ కొత్త ప్లాన్ రూ.149 ధర వద్ద లభిస్తుంది. స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం టాటా స్కై బింగే యాప్ ప్రకటించడంతో ఈ ప్లాన్ ప్రారంభించబడింది. ఇప్పుడు వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లలోనే ఈ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు బింగే ప్లాన్‌లలో ఒకదాని యొక్క సబ్స్క్రిప్షన్ ను పొందవచ్చు.

OTT

ఈ సందర్భంలో యూజర్లు ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా ఓవర్-ది-టాప్ (OTT) కంటెంట్‌ను వినియోగించవచ్చు. మొత్తంగా టాటా స్కై తన యూజర్లకు రెండు బింగే ప్లాన్‌లను అందిస్తుంది. వీటిని యూజర్లు రూ.149 మరియు రూ.299 ధరల వద్ద ఎంచుకోవచ్చు. ఇందులో రూ.299 ప్లాన్ ముందునుంచి అందుబాటులో ఉండగా రూ.149 ప్లాన్ కొత్తగా ప్రకటించింది. దీని గురించి వివరంగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రూ.149 ప్లాన్‌

టాటా స్కై తన యొక్క మొబైల్ వినియోగదారుల కోసం మాత్రమే రూ.149 ప్లాన్‌ను విడుదల చేసింది. ఇక్కడ మీరు గమనించవలసిన మొదటి విషయం ఏమిటంటే మీరు టాటా స్కై బింగే + సెట్-టాప్ బాక్స్ (STB) లేదా అమెజాన్ ఫైర్ టివి స్టిక్ టాటా స్కై ఎడిషన్‌ను కలిగి ఉన్న చందాదారుడు కాకపోతే మీరు సంస్థ అందించే ఈ అతి పెద్ద సర్వీసును యాక్సెస్ చేయలేరు.

రూ.299 ప్లాన్

రూ.149 ప్లాన్ ను కొనుగోలు చేసిన వినియోగదారుడు 3 మొబైల్ స్క్రీన్లలో బింగే సర్వీస్ యొక్క కంటెంట్ ను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. అయితే రూ.299 ప్లాన్ యొక్క వినియోగదారులు ఒక టీవీ స్క్రీన్ లేదా 3 మొబైల్ స్క్రీన్లలో కంటెంట్ను వినియోగించుకోవడానికి అనుమతిస్తుంది.

టాటా స్కై

టాటా స్కై అందించే రెండు ప్లాన్ల మధ్య మరిన్ని ఎక్కువ తేడాలు ఉన్నాయి. రూ.299 ప్లాన్ వినియోగదారులకు 10 కి పైగా ప్లాట్‌ఫాంల నుండి OTT కంటెంట్‌ను వినియోగించుకునే వీలు కల్పిస్తుంది. అయితే రూ.149 ప్లాన్‌తో యూజర్లు కేవలం 7 ప్లాట్‌ఫామ్‌ల నుంచి కంటెంట్‌ను వినియోగించుకునేందుకు పరిమితం అవుతారు.

టాటా స్కై బింగే

టాటా స్కై బింగే అనేది టాటా స్కై నుండి లభించే OTT కంటెంట్ అగ్రిగేటర్ సర్వీస్. ఇది బహుళ ప్రధాన ప్లాట్‌ఫారమ్‌ల యొక్క బండిల్డ్ OTT సభ్యత్వాన్ని కొనుగోలు చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. మీరు క్రొత్త వినియోగదారులు అయితే కనుక మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో బింగే యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు మీ మనస్సును మెరుగుపర్చడానికి సేవ యొక్క 7 రోజుల ఉచిత ట్రయల్ పొందవచ్చు.

టాటా స్కై డిటిహెచ్

టాటా స్కై డిటిహెచ్ ఆపరేటర్ తన యొక్క రూ.149 ప్లాన్‌తో యూజర్‌లు Zee5 ప్రీమియం, సోనీ LIV, వూట్ సెలెక్ట్, ఈరోస్ నౌ, వూట్ కిడ్స్, హంగామా ప్లే, మరియు షెమరూమీ వంటి ప్లాట్‌ఫామ్‌లకు ఉచిత యాక్సిస్ ను పొందుతారు. అలాగే రూ.299 ప్లాన్‌తో వినియోగదారులు పైన పేర్కొన్న అన్ని ప్లాట్‌ఫామ్‌లతో పాటుగా డిస్నీ + హాట్‌స్టార్, సన్‌ఎన్‌ఎక్స్‌టి మరియు క్యూరియాసిటీ స్ట్రీమ్‌తో సహా మరో మూడు అదనపు ప్లాట్‌ఫామ్‌లకు ఉచిత యాక్సిస్ ను పొందుతారు.

Best Mobiles in India

English summary
Tata Sky Binge Brings Another New Mobile Only Plan: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X