టాటా స్కై HD సెట్-టాప్ బాక్స్ కొనుగోలులో బింగే + ఎంపిక!! కారణాలు ఇవే...
ఇండియాలోని డిటిహెచ్ ఆపరేటర్లలో ఒకటైన టాటా స్కై కొత్త వినియోగదారులు డిటిహెచ్ కనెక్షన్‌ను కొనుగోలు చేసేటప్పుడు వారికి అత్యంత ప్రాచుర్యం పొందిన కొన్ని ఎంపికలను అందిస్తుంది. DTH పరిశ్రమలోని ఇటీవల కొన్ని మార్పులు మరియు కొత్త NTO 2.0 కోర్టుల తీర్పుతో మీరు మీ DTH ఆపరేటర్‌ను మార్చాలని చూస్తుంటే కనుక వారికి అవకాశం ఉంది. మీరు టాటా స్కై యొక్క క్రొత్త DTH కనెక్షన్‌ను ఎంచుకోవాలని చూస్తుంటే కనుక ఛానెల్స్ ప్యాక్‌లను పొందడం అనేవి కత్తి మీద సాముగా ఉంటాయి. అలాగే సెట్-టాప్ బాక్స్ ను ఎంచుకోవడంలో కూడా మీరు అతి జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. టాటా స్కై యొక్క HD సెట్-టాప్ బాక్స్‌ను ఎంచుకుంటే కనుక వారికి బింగే + సెట్-టాప్ బాక్స్‌ను కూడా అదనంగా అందిస్తోంది. అయితే ఈ రెండింటి మధ్య గల పోలికల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టాటా స్కై బింగే + సెట్-టాప్ బాక్స్ ధర & ఇతర వివరాలు
టాటా స్కై యొక్క కొత్త కనెక్షన్‌ను కొనుగోలు చేస్తుంటే కనుక మీరు గుర్తుంచుకోవలసిన మొదటి విషయం ఏమిటంటే టాటా స్కై బింగే సర్వీస్ అనేది మీ టీవీ స్క్రీన్‌లోని OTT యాప్ కంటెంట్‌లకు యాక్సిస్ ను అందిస్తుంది. వీటిలో యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి వాటిని సులభంగా చూడటానికి వీలును కలిగి ఉంటుంది.

టాటా స్కై బింగే + సెట్-టాప్ బాక్స్ ను పొందడానికి మొదటి కారణం దాని యొక్క ధర. బింగే + బాక్స్ రూ.2,499 ధర వద్ద లభిస్తుంది. అయితే మీరు సెట్-టాప్ బాక్స్‌లోని సాధారణ HD ఎంపికతో వెళితే మీరు అదనంగా మరొక మూడుసార్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు టాటా స్కై యొక్క HD సెట్-టాప్ బాక్స్ కోసం రూ.1,499 ఖర్చు చేస్తే, తరువాత మీరు అమెజాన్ ఫైర్ టివి స్టిక్ వంటి మరొక డివైస్ ను కొనవలసి ఉంటుంది. దీని కోసం మీకు అదనంగా మరోక రూ.3,000 ఖర్చు చేయవలసి ఉంటుంది. అయితే ఇది 4K లేదా నాన్ -4K వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.

బింగే+ సెట్-టాప్ బాక్స్ కొనడానికి ఇతర కారణాలు
ధరల ప్రయోజనాల పరంగా చూసుకుంటే కనుక ప్రస్తుతం టాటా స్కై తన బింగే + సేవతో పాటు కొన్ని ఆకర్షణీయమైన డిస్కౌంట్లు మరియు సేవలను అందిస్తోంది. ముఖ్యంగా చందాదారులు పొందే మొదటి ఆకర్షణీయమైన ఆఫర్ ఒక నెల ఉచిత అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ యొక్క బండిలింగ్. అలాగే చందాదారులు EROS NOW, Shemaroo, Disney + వంటి ఇతర OTT యాప్ లకు ఒక నెలపాటు ఉచిత యాక్సిస్ ను కూడా అదనంగా పొందుతారు.

టాటా స్కై HD సెట్-టాప్ బాక్స్ vs బింగే+ సెట్-టాప్ బాక్స్
టాటా స్కై యొక్క HD సెట్-టాప్ బాక్స్‌ను బింగే + వేరియంట్‌తో పోల్చినట్లయితే ఆన్‌లైన్ డిస్కౌంట్‌లో మీకు తేడా కనిపిస్తుంది. మీరు ఈ ఎస్‌టిబిలను కొనుగోలు చేయడానికి ఆన్‌లైన్ పేమెంట్ చేస్తే కనుక మీకు హెచ్‌డి వేరియంట్‌పై రూ.150 తగ్గింపు లభిస్తుంది. అయితే, బింగే + వేరియంట్‌పై రూ.200 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. టాటా స్కై యొక్క బింగే + సెట్-టాప్ బాక్స్‌ను మీ యొక్క చేతులలో పొందడానికి చందాదారులు కేవలం 2,200 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

చివరగా OTT సర్వీసుల అవసరం కూడా ఎప్పుడు దూరంగా ఉంటుందని గమనించండి. మీ యొక్క టెలివిజన్ తెరపై వేర్వేరు డివైస్ల కోసం వెళ్లి ఎక్కువ ఖర్చు చేయడానికి బదులుగా అన్ని ఒకే దానిలో జోడించాలనుకోవడం ఉత్తమమం. మీరు ప్రతిదాన్ని యాక్సెస్ చేయగల ఒకే రిమోట్ కలిగి ఉండటం మంచిది కదూ. టాటా స్కై బింగే + సెట్-టాప్ బాక్స్ వీటన్నిటిని అమలులోకి తెస్తుంది. టాటా స్కై బింగే + సెట్-టాప్ బాక్స్‌కు అనుకూలంగా పనిచేస్తున్నది కూడా దాని ధర. భవిష్యత్తులో ఏ OTT సేవలను ఉపయోగించకూడదని మీకు ఖచ్చితంగా తెలిస్తే మాత్రమే మీరు సెట్-టాప్ బాక్స్ యొక్క HD వేరియంట్ కోసం వెళ్ళాలి. ఈ సందర్భంలో మీరు బింగే + తో పోల్చితే మీ కొనుగోలులో రూ.1,000 ఆదా చేస్తారు.


Click it and Unblock the Notifications








