Tata Sky Binge సర్వీసును పొందే సులభమైన మార్గం ఇవే....
ఇండియాలో డిటిహెచ్ సర్వీసులలో ఒకటైన టాటా స్కై ఇటీవలి సంవత్సరాలలో ప్రారంభించిన ప్రసిద్ధ సేవలలో టాటా స్కై బింగే ఒకటి. ఇది సరసమైన ధరల వద్ద అనేక OTT యాప్ ల బండిల్ తో లభిస్తుంది. టాటా స్కై వినియోగదారులు ఎక్కువ మంది ఈ బింగే సేవను ఎంచుకుంటున్నారు. టాటా స్కై యొక్క ఈ సర్వీస్ 10 OTT సబ్స్క్రిప్షన్లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. చందాదారుడు ఈ OTTలను ఒక్కొక్కటిగా ఎంచుకుంటే వారికి రూ.1,000 కన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది.

టాటా స్కై వినియోగదారులు ఈ బింగే సర్వీసును రెండు ఎంపికలలో పొందవచ్చు. టాటా స్కై మొదట ఈ సేవను ప్రవేశపెట్టినప్పుడు చందాదారులు అమెజాన్ ఫైర్ టివి స్టిక్ టాటా స్కై ఎడిషన్‌ను అదనపు ఖర్చు లేకుండా పొందేవారు. ఇప్పుడు ప్రముఖ డిటిహెచ్ కంపెనీకి ఆండ్రాయిడ్ టివి ఆధారిత సెట్-టాప్ బాక్స్ ‘టాటా స్కై బింగే +' బింగే సర్వీసును కూడా కలుపుతుంది. టాటా స్కై బింగే సేవను మీరు ఎలా పొందవచ్చో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టాటా స్కై బింగే సర్వీసును పొందడానికి రెండు ఎంపికలు ఉన్నాయి. ఇందులో మొదటిది స్టాండర్డ్ టాటా స్కై బింగే సేవను ఎంచుకోవడం. టాటా స్కై వినియోగదారులు నెలకు రూ.299 చొప్పున బింగే సర్వీస్ సబ్స్క్రిప్షన్ ను పొందటానికి అనుమతిస్తుంది. ఇంతకుముందు దీని ధర 249 రూపాయలు ఉండేది. కానీ కంపెనీ ఇప్పుడు 10 OTT సబ్స్క్రిప్షన్ లను కలుపుతూ 299 రూపాయల ధర వద్ద లభిస్తుంది.

రెండవ ఎంపికను ఎంచుకునే వారిలో ఇప్పటికీ స్మార్ట్ కాని టీవీని ఉపయోగిస్తున్న వారికి ఉత్తమ ఎంపిక అవుతుంది. టాటా స్కై బింగే + ఆండ్రాయిడ్ టీవీతో రన్ అవుతుంది. ఇది ఆరు నెలల ఉచిత బింగే చందాతో వస్తుంది. ఆరు నెలల తరువాత టాటా స్కై యూజర్లు ప్రతి నెలా రూ.299 ధర వద్ద కొనుగోలు చేయవలసి ఉంటుంది. మీరు OTT సభ్యత్వాలను పొందాలని చూస్తున్నట్లయితే తప్పు చేయకండి. వెంటనే టాటా స్కై యొక్క బింగే సేవను ఎంచుకోండి.

టాటా స్కై బింగే సర్వీస్ అనేది మొత్తం కంటెంట్‌ను ఒకే సేవలోకి తీసుకురావడమే కాకుండా 10 వేర్వేరు యాప్ ల కంటెంట్ ను ఉచితంగా యాక్సిస్ చేయడానికి అనుమతిని ఇస్తుంది. ఈ 10 OTT యాప్ లలో అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియం, ZEE5, సోనీలైవ్, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, SunNXT, క్యూరియాసిటీ స్ట్రీమ్, ఈరోస్ నౌ, షెమరూమీ మరియు హంగామా ప్లే వంటివి ఉన్నాయి. టాటా స్కై బింగే సర్వీస్ పని చేయడానికి మీ యొక్క DTH సబ్స్క్రిప్షన్ యాక్టీవేషన్ లో ఉండాలి.


Click it and Unblock the Notifications








