Tata Sky Binge: ZEE5 సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తున్న టాటా స్కై బింగే సర్వీస్

|

టాటా స్కై దేశంలో అతిపెద్ద డిటిహెచ్ ఆపరేటర్. డిటిహెచ్ ప్లాట్‌ఫామ్ లో తన స్థానాన్ని మరియు వినియోగదారుల సంఖ్య నిలుపుదల కోసం ఉత్తమమైన సేవలను అందించడం అవసరం. డిటిహెచ్ పరిశ్రమ యొక్క పోటీతత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది మరింత ముఖ్యమైనది. OTT సేవల విషయానికి వస్తే టాటా స్కై ఇప్పుడు ప్రత్యేకమైన టాటా స్కై బింగే సమర్పణను కలిగిఉంది.

టాటా స్కై బింగే సర్వీస్
 

టాటా స్కై బింగే సర్వీస్ ఇతర DTH ఆపరేటర్లు అందిస్తున్న ఆఫర్‌ల నుండి చాలా భిన్నంగా ఉంది. ఇందులో వీరు హైబ్రిడ్ సెట్-టాప్ బాక్స్‌ను అందిస్తారు. ఇప్పుడు టాటా స్కై బింగే సర్వీస్ రూ.249 నెలవారీ అద్దె వద్ద అమెజాన్ ఫైర్ టివి స్టిక్‌ను అందిస్తుంది. దీనిలో చందాదారులు తమకు నచ్చిన OTT కంటెంట్‌ను ఫైర్ టివి స్టిక్‌లో లభించే OTT యాప్ ల ద్వారా చూడటానికి అనుమతిస్తుంది.

టాటా స్కై బంపర్ ఆఫర్!! తక్కువ ధరకు మెట్రో ప్యాక్‌లు

ZEE5

టాటా స్కై బింగే సర్వీసులో భాగంగా చందాదారులు ఈ OTT సర్వీస్ యొక్క కంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ కు కూడా యాక్సిస్ ను పొందుతారు.దీని కోసం వారు అదనంగా ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇందులో ఇది ఈ సర్వీస్ యొక్క అతి పెద్ద ప్రయోజనం. ఇప్పటి వరకు టాటా స్కై బింగే తన పోర్ట్‌ఫోలియోలో ZEE5 ను అందించలేదు కానీ ఈ రోజు నుండి టాటా స్కై ZEE5 ని కూడా అందిస్తోంది.

తక్కువ ధరకే టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు 100Mbps స్పీడ్‌ & అన్‌లిమిటెడ్ డేటా

టాటా స్కై మరియు ZEE5 భాగస్వామ్యం

టాటా స్కై మరియు ZEE5 భాగస్వామ్యం

ఇప్పుడు కొత్తగా టాటా స్కై ZEE5 తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నది. భారతదేశంలో Zee5 అనేది అతిపెద్ద కాన్టెక్ బ్రాండ్. టాటా స్కై బింగేలో ZEE5 యొక్క అదనంపు సౌజన్యంతో చందాదారులకు 12 భాషలలో 1,00,000 గంటలకు పైగా కంటెంట్‌కి యాక్సిస్ పొందవచ్చు. ఇందులో ఒరిజినల్ కంటెంట్ / సినిమాలు ఉంటాయి. వీటిలో బాలీవుడ్ మరియు ప్రాంతీయ సినిమాలు కూడా ఉన్నాయి.

Nokia 55-inch SmartTV: స్మార్ట్ టీవీ విభాగంలోకి నోకియా గ్రాండ్ ఎంట్రీ

ZEE5
 

ZEE5 అనేది భారతదేశం అంతటా విభిన్న వినియోగదారుల కోసం వారి ప్రాంతీయ బాషలలో కంటెంట్‌ను అందించడానికి నిరంతరం కృషి చేస్తోంది. ఈ ప్రయాణంలో భాగంగా టాటా స్కైతో భాగస్వామ్యం అన్ని స్థాయిలలో కంటెంట్‌ను ప్రజలకు అందించడాన్ని మరింత బలపరుస్తుంది. టాటా స్కైతో వారి కొత్త డిజిటల్ చొరవ టాటా స్కై బింగేపై మా భాగస్వామ్యాన్ని విస్తరించడం మాకు సంతోషంగా ఉంది. అని టాటా స్కై ప్రతినిధి తెలిపారు.

ఫ్లిప్‌కార్ట్‌ మొబైల్ బొనాంజా సేల్స్: స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్లే ఆఫర్లు

 ZEE5 సబ్స్క్రిప్షన్

టాటా స్కై బింగే సర్వీస్ ద్వారా మిలియన్ల మంది చందాదారులకు కొత్త వినోద అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ZEE5 సబ్స్క్రిప్షన్ లో ఇప్పటికే 25 ఒరిజినల్ షోలను ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫాం ద్వారా మార్చి 2020 నాటికి ఒరిజినల్ షోల సంఖ్యను 72+ కు పెంచాలనే ఆలోచనలో ఉన్నారు. ఇది ప్రారంభించినప్పటి నుండి ప్లే స్టోర్ నుండి 70 మిలియన్ + డౌన్‌లోడ్‌లను దాటింది. ZEE5 కంటెంట్‌ను ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ & పంజాబీలతో సహా 12 కి పైగా భాషలలో అందిస్తుంది.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో SMS ద్వారా మీ లొకేషన్ ను షేర్ చేయడం ఎలా?

 టాటా స్కై బింగే ఒక ప్రత్యేకమైన సమర్పణ

టాటా స్కై బింగే ఒక ప్రత్యేకమైన సమర్పణ

టాటా స్కై అందిస్తున్న బింగే సర్వీస్ విషయానికి వస్తే ఇది ఒక ప్రత్యేకమైన సమర్పణ. టాటా స్కై కనెక్షన్‌తో పాటు OTT కంటెంట్‌ని యాక్సెస్ చేయాలనుకునే DTH చందాదారులకు టాటా స్కై బింగే సర్వీస్ ఉత్తమంగా ఉంటుంది. ఇప్పుడు టాటా స్కై బింగే సర్వీస్ హైబ్రిడ్ సెట్-టాప్ బాక్స్‌ల నుండి చాలా భిన్నంగా ఉంది. ఎందుకంటే ఇది అమెజాన్ ఫైర్ టివి స్టిక్ యొక్క ప్రత్యేక ఎడిషన్‌తో వస్తుంది. ఈ సర్వీస్ గురించి గమనించవలసిన విషయం ఏమిటంటే ఇది హాట్‌స్టార్, సన్‌ఎన్‌ఎక్స్‌టి, అమెజాన్ ప్రైమ్ వంటి యాప్ లకు మూడు నెలల కాంప్లిమెంటరీ చందాను మరియు VOOT వంటి వాటికి యాక్సిస్ ను అందిస్తుంది. చందాదారులు తమ డిటిహెచ్ కనెక్షన్‌తో ఒటిటి కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి అనుకూలమైన మార్గాన్ని పొందడమే కాకుండా ఉచిత చందాలను కూడా పొందుతారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Tata Sky Binge Service Now Offers ZEE5 Subscription for Free

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X