Tata Sky బింగే సర్వీస్ ఉచితంగా అందించే OTT ప్లాట్‌ఫారమ్‌ల గురించి మీకు తెలియని విషయాలు
ఇండియాలో కరోనా మహమ్మారి యొక్క సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కావాలని ప్రభుత్వలు ప్రార్తిస్తున్నాయి. ఇటువంటి సమయంలో గత సంవత్సరం నుంచి సరసమైన ధరలో లభించే హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లను వినియోగించడం పెరిగింది. వీటిని పొందడంలో గల అనేక కారణాలలో ఓవర్-ది-టాప్ (OTT) కంటెంట్ వినియోగం కూడా ఉంది. 2020 లో మొదట ఈ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి OTT ప్లాట్‌ఫామ్‌కి సభ్యత్వంను పొందిన వినియోగదారులు టన్నుల కొద్ది ఉన్నారు.

కరోనా మహమ్మారి సమయంలో వినియోగదారుల యొక్క వినోద అవసరాలను తీర్చడానికి తాజా మరియు ప్రత్యేకమైన కంటెంట్‌ను కనుగొనడానికి వేర్వేరు ప్లాట్‌ఫారమ్‌ల మధ్య మారడానికి చాలా మంది వినియోగదారులు ఇష్టపడుతూ ఉంటారు. ఏదేమైనా వినియోగదారుడు వేర్వేరు ప్లాట్‌ఫారమ్‌ల సభ్యత్వాలను కొనుగోలు చేయడానికి అధికంగా ఖర్చు అవుతుంది. అయితే వీటన్నిటిని ఒక్కటిగా కొనుగోలు చేస్తే కనుక OTT ప్లాట్‌ఫారమ్‌ల మీద ఖర్చు భారీగా తగ్గుతుంది. బహుళ OTT ప్లాట్‌ఫారమ్‌ల నుండి కంటెంట్‌ను వినియోగించుకునేందుకు వీలుగా టాటా స్కై సంస్థ బింగే సర్వీసును ప్రవేశపెట్టింది. టాటా స్కై బింగే సర్వీస్ భారతదేశంలో చాలా కాలంగా అందుబాటులో ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టాటా స్కై బింగే సర్వీస్ పూర్తి వివరాలు
టాటా స్కై బింగే సర్వీస్ అనేది అమెజాన్ ఫైర్ టివి స్టిక్ - టాటా స్కై ఎడిషన్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంచబడింది. ఫైర్ టీవీ స్టిక్ - టాటా స్కై ఎడిషన్‌ను వినియోగదారులకు అందించడానికి కంపెనీ ఎటువంటి అదనపు ఖర్చులను వసూలు చేయదని గమనించండి. అంతేకాకుండా వినియోగదారులకు ఈ సర్వీసును మొదటి 30 రోజులు ట్రయల్ రూపంలో ఉచితంగా ఉపయోగించడానికి ఇవ్వబడుతుంది. తద్వారా వారు ఈ పరికరంతో వారి అనుభవాన్ని మరియు మొత్తం సర్వీసును పరీక్షించవచ్చు. ఉచిత ట్రయల్‌ను పొందిన తరువాత వినియోగదారుల వద్ద నుంచి నెలకు రూ.299 వసూలు చేయబడుతుంది. కంపెనీ ఎటువంటి సెమీ-వార్షిక లేదా వార్షిక చందా ప్యాకేజీలను అందించదు కాబట్టి మీరు ప్రతి నెలా రూ.299 చెల్లించి ఈ సర్వీసును కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

టాటా స్కై బింగే సర్వీసును సంస్థ ప్రారంభంలో ప్రారంభించినప్పుడు ఇది వినియోగదారులకు నెలకు 249 రూపాయలకు మాత్రమే అందుబాటులో ఉంది. గత ఆగస్టు నెలలో కంపెనీ రూ.50 పెంచడంతో పాటుగా తన ప్లాట్‌ఫామ్‌లో వూట్ సెలెక్ట్ మరియు వూట్ కిడ్స్ నుండి కంటెంట్‌ను ఆఫర్ చేయడానికి వయాకామ్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. టాటా స్కై కస్టమర్ కేర్ బృందంతో సంప్రదించడం ద్వారా వినియోగదారులు తమ ఉచిత ట్రయల్‌ను ఎప్పుడైనా నిలిపివేసే అవకాశం ఉంది.

టాటా స్కై బింగే సర్వీస్ OTT ప్లాట్‌ఫారమ్‌లు
టాటా స్కై బింగే సర్వీస్ కోసం సైన్ అప్ చేసినప్పుడు వినియోగదారులు బహుళ ప్లాట్‌ఫారమ్‌ల నుండి కంటెంట్‌ను పొందుతారు. వీటిలో ZEE5 ప్రీమియం, డిస్నీ + హాట్‌స్టార్ VIP, సోనీలైవ్, హంగమా ప్లే, షెమరూమీ, సన్‌ఎన్‌ఎక్స్‌టి, వూట్ కిడ్స్, వూట్ సెలెక్ట్, ఎరోస్ నౌ మరియు క్యూరియాసిటీ స్ట్రీమ్ వంటివి ఉన్నాయి. వీటితో పాటుగా వినియోగదారులు మొదటి మూడు నెలలు అమెజాన్ ప్రైమ్ వీడియోకు ఉచిత సభ్యత్వాన్ని పొందుతారు. ఏదేమైనా మూడు నెలలు ముగిసిన తరువాత వినియోగదారులు ప్లాట్‌ఫాం నుండి స్ట్రీమింగ్ కంటెంట్‌ను పొందడానికి నెలకు రూ.129 చెల్లించవలసి ఉంటుంది.

టాటా స్కై బింగే సర్వీసులో ఉచితంగా లభించే OTT ప్లాట్‌ఫారమ్‌లన్నింటికీ వ్యక్తిగతంగా సబ్స్క్రిప్షన్ పొందడానికి వినియోగదారు చెల్లించాల్సిన మొత్తం నెలకు రూ.299 కంటే మూడు రెట్లు ఎక్కువ. అంతేకాకుండా వినియోగదారులు వారంలో వారు కోల్పోయిన తమ అభిమాన టెలివిజన్ ఛానెళ్ల యొక్క ఏదైనా కంటెంట్‌ను అదనంగా ఏమీ చెల్లించకుండా చూడవచ్చు. టాటా స్కై బింగే + STBని కలిగి ఉన్న వినియోగదారుడు కూడా టాటా స్కై బింగే సేవను కొనుగోలు చేయవచ్చని గమనించండి. దీనికి వర్తించే నిబంధనలు మరియు షరతులు కూడా ఒకే విధంగా ఉంటాయి. సాధ్యమైనంత ఎక్కువ నాణ్యతతో కంటెంట్‌ను ప్లే చేయడానికి వినియోగదారులకు బలమైన ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం.


Click it and Unblock the Notifications