Tata Sky Binge సర్వీసులో అదనంగా సోనిలైవ్ OTT కంటెంట్‌కు ఉచిత యాక్సిస్...
ఇండియాలోని డిటిహెచ్ రంగంలో అధికంగా వినియోగదారుల బేస్ ను కలిగి ఉన్న టాటా స్కై తన వినియోగదారుల కోసం పలురకాల సెట్-టాప్ బాక్స్ లను అందిస్తున్నది. టాటా స్కై యొక్క పలురకాల సేవలలో ఒకటైన బింగే సర్వీస్ యొక్క ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫామ్‌లో కొత్తగా సోనీలైవ్ ను కూడా చేర్చింది.

టాటా స్కై బింగే + OTT కంటెంట్
టాటా స్కై మరియు సోనీలైవ్ యొక్క భాగస్వామ్యం కారణంగా టాటా స్కై బింగే చందాదారులు సోనీలైవ్ లైబ్రరీ నుండి 1,000+ గంటల వినోదాత్మక కంటెంట్‌ను పొందవచ్చు. సోనీలైవ్ చందాదారులు లైవ్ స్పోర్ట్స్, టీవీ షోలు మరియు సినిమాలు వంటి ఇతర వినోదాత్మక కంటెంట్లను కూడా చూడటానికి అనుమతిస్తుంది. టాటా స్కై బింగే + సెట్-టాప్ బాక్స్ (STB) ను కొనుగోలు చేసిన చందాదారులకు మాత్రమే బింగే సర్వీస్ అందుబాటులో ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టాటా స్కై బింగే - సోనిలైవ్ OTT కంటెంట్ ఆఫర్స్
టాటా స్కై యొక్క బింగే సర్వీసును పొందిన వినియోగదారులు ఇప్పుడు 9 వేర్వేరు OTT ప్లాట్‌ఫారమ్‌ల నుండి కంటెంట్‌ను చూడడానికి వినియోగదారులకు ఉచిత యాక్సిస్ ను ఇస్తుంది. ఈ 9 ప్లాట్‌ఫారమ్‌లు వరుసగా ZEE5, డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియం, సన్ ఎన్‌ఎక్స్‌టి, ఈరోస్ నౌ, హంగామా ప్లే, వూట్ సెలెక్ట్, షెమరూమీ, వూట్ కిడ్స్, మరియు ఇప్పుడు సోనీలైవ్ వంటి OTT ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి.

టాటా స్కై బింగే + STB మీద ధరల తగ్గింపు
టాటా స్కై బింగే + యొక్క STBని ప్రస్తుత చందాదారులు కేవలం రూ.2,500 చెల్లించి పొందవచ్చు. అలాగే కొత్త చందాదారులు రూ.3,000 ధర వద్ద పొందవచ్చు. ఇటీవల టాటా స్కై సంస్థ తన బింగే + STB యొక్క ధరను రూ.3 వేలకు తగ్గించింది. బింగే+ యొక్క కొత్త STB ని కొనుగోలు చేసేటప్పుడు చందాదారులకి బింగే సర్వీస్ యొక్క 6 నెలల సభ్యత్వంను పూర్తిగా ఉచితంగా అందిస్తుంది.

టాటా స్కై బింగే సర్వీస్ ధరలు & ఉచిత సర్వీసులు
టాటా స్కై బింగే సర్వీస్ నెలకు రూ.299 ధర వద్ద లభిస్తుంది. ఇది అనేక OTT ప్లాట్‌ఫారమ్‌ల నుండి లభించే కంటెంట్‌కు చందాదారులకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క ఉచిత యాక్సిస్ అదనంగా మరొక మూడు నెలలపాటు కూడా ఉంటుంది.


Click it and Unblock the Notifications