టాటా స్కై బింగే సర్వీస్ 2021లో యూజర్లకు ఎంతవరకు ఉపయోగకరంగా ఉంది??

|

ఇండియాలో డైరెక్ట్-టు-హోమ్ (DTH) ప్లాట్‌ఫారమ్‌లో విజయవంతమైన వాటిలో టాటా స్కై ఒకటి. ఈ DTH సంస్థ తన యొక్క వినూత్నమైన సేవలతో వినియోగదారులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ ఉంది. అంతేకాకుండా యూజర్ల సౌలభ్యం కోసం ఉపగ్రహ టెలివిజన్ కంటెంట్‌ను వినియోగించడానికి కూడా అవకాశం ఇస్తుంది. కానీ శాటిలైట్ టీవీ శకం నెమ్మదిగా కనుమరుగవుతోంది. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ మంది ప్రజలు వినోద కంటెంట్ వినియోగం కోసం ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫారమ్‌లకు మారుతున్నారు.

సబ్‌స్క్రైబ్

దాదాపు ప్రతి ఛానల్ కంపెనీ కూడా తన సేవలను సోనీ, స్టార్ మరియు మరిన్ని OTT ప్యాకేజీలో చేర్చాలని చూస్తోంది. ఒక OTT ప్లాట్‌ఫారమ్‌కు సబ్‌స్క్రైబ్ చేయడం చాలా మందికి సరసమైనది అయితే కనుక మల్టిపుల్‌కు సబ్‌స్క్రైబ్ చేయడం అనేది పాకెట్ ఫ్రెండ్లీ కాదు. ప్రత్యేకించి అందులో నెట్‌ఫ్లిక్స్ ఉంటే అది చాలా ఖరీదైనది. ఈ విధంగా టాటా స్కై బింగే సర్వీస్ ఈ విషయంలో మీకు గొప్పగా సహాయపడుతుంది. అది ఎలాగో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మీడియాటెక్ డైమెన్సిటీ 2000 ప్రత్యేక చిప్‌ల స్మార్ట్‌ఫోన్‌లు 2022 లో లాంచ్ కానున్నాయి!!మీడియాటెక్ డైమెన్సిటీ 2000 ప్రత్యేక చిప్‌ల స్మార్ట్‌ఫోన్‌లు 2022 లో లాంచ్ కానున్నాయి!!

టాటా స్కై బింగే  సర్వీస్ యొక్క OTT అప్లికేషన్‌ల బండిల్

టాటా స్కై బింగే సర్వీస్ యొక్క OTT అప్లికేషన్‌ల బండిల్

మీరు విభిన్న OTT ప్లాట్‌ఫారమ్‌ల కోసం చెల్లించడం గురించి ఆందోళన చెందుతుంటే కనుక టాటా స్కై ఆ సమస్యను 'టాటా స్కై బింగే' సర్వీసుతో పరిష్కరించింది. ఇది 2019 లో ప్రకటించబడినప్పటికీ ఇప్పుడు మెరుగైన సేవలను అందిస్తూ అభివృద్ధి చెందింది. కంపెనీ నెలకు రూ.249 ప్లాన్‌ను అందించడం ద్వారా ప్రారంభించి తర్వాత నెలకు రూ.299 వరకు పెరిగింది. ప్రారంభంలో ఈ సర్వీస్ చాలా ఆకర్షణీయంగా లేదని గమనించండి. ఎందుకంటే ఇది చాలా తక్కువ ప్లాట్‌ఫారమ్‌ల కంటెంట్‌ను మాత్రమే అందించేది. కానీ 2021 లో టాటా స్కై బింగే సర్వీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోతో సహా 11 విభిన్న OTT ప్లాట్‌ఫారమ్‌ల నుండి కంటెంట్‌ను వినియోగదారులకు అందిస్తుంది.

Apple మ్యాక్‌బుక్ ప్రో తయారీలో కొత్త రకం చిప్‌లు & టెక్నాలజీలు!! త్వరలోనే విడుదలApple మ్యాక్‌బుక్ ప్రో తయారీలో కొత్త రకం చిప్‌లు & టెక్నాలజీలు!! త్వరలోనే విడుదల

టాటా స్కై

టాటా స్కై కంపెనీ రూ.249 మరియు రూ.299 ధర వద్ద వచ్చే రెండు విభిన్న ప్లాన్‌లను వినియోగదారులకు అందిస్తుంది. రూ.299 ధర వద్ద లభించే ప్లాన్ ను ఎంచుకుంటే కనుక మీరు ప్రతి ప్లాట్‌ఫారమ్ నుండి లభించే కంటెంట్ ను వినియోగించడానికి అనుమతిని ఇస్తుంది. అయితే మీరు తక్కువ OTT ప్లాట్‌ఫారమ్‌లను చూడాలనుకుంటే మరియు మీ మొబైల్ ఫోన్‌లోనే మొత్తం కంటెంట్‌ని వినియోగించుకోవడానికి ఇష్టపడితే కనుక మీరు కంపెనీ అందించే రూ.149 ప్లాన్ కోసం వెళ్లవచ్చు.

OTT ప్లాట్‌ఫారమ్‌

టాటా స్కై కంపెనీ అందించే OTT ప్లాట్‌ఫారమ్‌లలో డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ZEE5 ప్రీమియం, వోట్ సెలెక్ట్, హంగామా ప్లే వంటివి మరిన్ని ఉన్నాయి. 2021 లో బహుళ ప్లాట్‌ఫారమ్‌ల నుండి నేరుగా మీ టీవీలో OTT కంటెంట్‌ను చూడటానికి రూ.299 ప్లాన్ పొందడం తప్పు కాదు. వాస్తవానికి కంపెనీ మీకు ఎలాంటి ఖర్చు లేకుండా ఫైర్ టీవీ స్టిక్ - టాటా ఎడిషన్‌ని అందిస్తుంది. మీరు చెల్లించాల్సిన మొత్తం కేవలం ప్లాన్ కోసం మాత్రమే ఉంటుంది. సంవత్సరానికి ఈ ప్లాట్‌ఫారమ్‌లలో మూడు నుండి నాలుగు వరకు స్టాండలోన్ సబ్‌స్క్రిప్షన్‌లను కొనుగోలు చేయడం వలన మీరు దాదాపు రూ.3,000 లేదా అంతకంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది మరియు ఇది చాలా ఖరీదైనది. అందువలన టాటా స్కై బింగే సర్వీస్ 2021 లో గతంలో కంటే మరింత అర్ధవంతంగా ఉంటుంది.

టాటా స్కై బింగే సర్వీస్ పొందే విధానం

టాటా స్కై బింగే సర్వీస్ పొందే విధానం

టాటా స్కై బింగే సర్వీసును పొందడానికి రెండు ఎంపికలు ఉన్నాయి. ఇందులో మొదటిది స్టాండర్డ్ టాటా స్కై బింగే సేవను ఎంచుకోవడం. టాటా స్కై వినియోగదారులు నెలకు రూ.299 చొప్పున బింగే సర్వీస్ సబ్స్క్రిప్షన్ ను పొందటానికి అనుమతిస్తుంది. ఇంతకుముందు దీని ధర 249 రూపాయలు ఉండేది. కానీ కంపెనీ ఇప్పుడు 10 OTT సబ్స్క్రిప్షన్ లను కలుపుతూ 299 రూపాయల ధర వద్ద లభిస్తుంది. రెండవ ఎంపికను ఎంచుకునే వారిలో ఇప్పటికీ స్మార్ట్ కాని టీవీని ఉపయోగిస్తున్న వారికి ఉత్తమ ఎంపిక అవుతుంది. టాటా స్కై బింగే + ఆండ్రాయిడ్ టీవీతో రన్ అవుతుంది. ఇది ఆరు నెలల ఉచిత బింగే చందాతో వస్తుంది. ఆరు నెలల తరువాత టాటా స్కై యూజర్లు ప్రతి నెలా రూ.299 ధర వద్ద కొనుగోలు చేయవలసి ఉంటుంది. మీరు OTT సభ్యత్వాలను పొందాలని చూస్తున్నట్లయితే తప్పు చేయకండి. వెంటనే టాటా స్కై యొక్క బింగే సేవను ఎంచుకోండి.

Best Mobiles in India

English summary
Tata Sky Binge Service Really Useful For Users in 2021?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X