Tata Sky యూజర్లకు గ్రేట్ న్యూస్!!! ఫ్రీ OTT కంటెంట్లలో మరొకటి చేరిక...

|

ఇండియాలో లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి వివిధ రకాల OTT కంటెంట్ వినియోగం గణనీయంగా పెరిగింది. అందరు ఇంటి వద్ద ఉన్నందు వలన కొత్త సినిమాలను మరియు వెబ్ సిరీస్ లను చూడడానికి OTT యాప్ లను వినియోగిస్తున్నారు. భారతదేశంలోని డిటిహెచ్ రంగంలో టాటా స్కై ఆపరేటర్ అధిక సంఖ్యలో వినియోగదారులను కలిగి ఉంది.

టాటా స్కై బింగే + సెట్-టాప్ బాక్స్
 

టాటా స్కై బింగే + సెట్-టాప్ బాక్స్

టాటా స్కై ఉత్తమమైన OTT కంటెంట్‌ను తన వినియోగదారులకు ఉచితంగా అందిస్తూ మరింత ఎక్కువ మందిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నది. టాటా స్కై బింగే + యొక్క ఆండ్రాయిడ్ టీవీ సెట్-టాప్ బాక్స్ ద్వారా వినియోగదారులు తమ టీవీలను స్మార్ట్ టీవీలుగా మార్చడానికి అనుమతిస్తుంది. దీని సాయంతో కావలసిన ఆండ్రాయిడ్ యాప్ లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా వీలు కల్పిస్తోంది. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు ZEE5 వంటి OTT యాప్ లను డౌన్‌లోడ్ చేసుకొని వాటి యొక్క కంటెంట్ ను ఉచితంగా చూడడానికి వీలుగా ఉంటుంది.

టాటా స్కై బింగే OTT కంటెంట్

టాటా స్కై బింగే OTT కంటెంట్

టాటా స్కై తన వినియోగదారులకు అతుకులు లేని OTT కంటెంట్ అనుభవాన్ని తీసుకురావడానికి ZEE5 తో భాగస్వామ్యం కలిగి ఉంది. ZEE5 భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన OTT కంటెంట్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటి. ఇప్పుడు ఇది టాటా స్కై బింగే + సెట్-టాప్ బాక్స్‌తో ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టాటా స్కై బింగే + బాక్స్‌తో ఉచితంగా ZEE5 యాక్సిస్

టాటా స్కై బింగే + బాక్స్‌తో ఉచితంగా ZEE5 యాక్సిస్

టాటా స్కై బింగే + ఆండ్రాయిడ్ టీవీ సెట్-టాప్ బాక్స్ ను కొనుగోలు చేసిన వారికి అమితమైన సేవలను అందిస్తుంది. దీని నెలవారీ చందాను రూ.249 ధర వద్ద పొందవచ్చు. బింగే సేవలతో పాటుగా అనేక బండిల్డ్ OTT ప్లాట్‌ఫామ్‌ల చందాను ఒకేసారి అదనంగా పొందవచ్చు. ఈ అదనపు సేవలు మెరుగ్గా ఉన్నప్పటికీ ఇప్పటివరకు టాటా స్కై ZEE5 సభ్యత్వాన్ని అందించలేదు. కానీ కొత్తగా Zee5 తో కుదిరిన భాగస్వామ్యంతో ఇప్పుడు దీనిని ఉచితంగా అందిస్తుంది.

టాటా స్కై బింగే + సెట్-టాప్ బాక్స్ ధరల వివరాలు
 

టాటా స్కై బింగే + సెట్-టాప్ బాక్స్ ధరల వివరాలు

టాటా స్కై యూజర్లు ఇప్పుడు రూ.3,999 ధరతో బింగే + సెట్-టాప్ బాక్స్‌ను కొనుగోలు చేసినప్పుడు డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియం, SUNNEXT, ఈరోస్ నౌ, హంగామా ప్లే, షెమరూమీ,OTT లతో పాటుగా ఇప్పుడు ZEE5లకు కూడా ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోకు కూడా మూడు నెలల యాక్సెస్ ను అందిస్తుంది.

ZEE5 OTT కంటెంట్

ZEE5 OTT కంటెంట్

భారతదేశంలో ప్రముఖ OTT కంటెంట్ ప్రొవైడర్లలో ఒకటైన ZEE5 అన్ని రకాల భాషలలో లభిస్తుంది. ఇది ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ మరియు పంజాబీ భాషలతో కలుపుకొని మొత్తంగా 12 భాషల్లో కంటెంట్‌ను అందిస్తుంది. ZEE5 ఇప్పటికే ఎయిర్‌టెల్ మరియు రిలయన్స్ జియో వంటి ఇతర సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇప్పుడు టాటా స్కైతో కూడా ZEE5 భాగస్వామ్యం చేసుకోవడంతో టాటా స్కై యూజర్లు కూడా దీనికి ఉచిత యాక్సిస్ లభిస్తుంది.

టాటా స్కై బింగే + సెట్-టాప్ బాక్స్  ఫీచర్స్

టాటా స్కై బింగే + సెట్-టాప్ బాక్స్ ఫీచర్స్

టాటా స్కై బింగే + సెట్-టాప్ బాక్స్ చాలా అధునాతన ఫీచర్లతో వస్తుంది. ఇది అంతర్నిర్మిత Chromecast ఫీచర్ ను కలిగి ఉంది. కాబట్టి మీరు మీ స్మార్ట్‌ఫోన్ మరియు ల్యాప్‌టాప్‌ను కూడా మీ టీవీతో మరింత సులభంగా జత చేయవచ్చు మరియు మీకు కావలసిన వీడియోను ప్లే చేయవచ్చు. అలాగే ప్లే స్టోర్‌లో ఉన్న 5000+ కంటే ఎక్కువ యాప్ లను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు వీటిని సెట్-టాప్ బాక్స్ సహాయంతో యాక్సెస్ కూడా చేయవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Tata Sky Binge+ Set-Top Box Brings ZEE5 Premium Subscription Access at Free of Cast

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X