Tata Sky Binge+ కొత్త ఫీచర్ : 7రోజుల ముందు టీవీషోలను చూడడానికి అనుమతి

|

టాటా స్కై ఇటీవల తన ఆండ్రాయిడ్ టీవీ ఆధారిత సెట్-టాప్ బాక్స్‌ టాటా స్కై బింగే +ను విడుదల చేసింది. బింగే + ప్రారంభించటానికి ముందు టాటా స్కై అమెజాన్ ఇండియా సహకారంతో కేవలం బింగే సేవలను మాత్రమే అందించేది.

టాటా స్కై బింగే+
 

టాటా స్కై బింగే సర్వీసులో భాగంగా వినియోగదారులు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అమెజాన్ ఫైర్ టివి స్టిక్ టాటా స్కై ఎడిషన్‌ను ఉచితంగా అందుకుంటున్నారు. అలాగే నెలకు కేవలం 249 రూపాయలతో హాట్స్టార్, SunNXT, ZEE5, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి OTT సేవలకు ప్రీమియంను అందిస్తుంది.

అమెరికాను అధిగమించిన ఇండియా..... ఓ లుక్ వేయండి

బింగే + సెట్-టాప్ బాక్స్

ఏదేమైనా టాటా స్కై బింగే మరియు బింగే + సెట్-టాప్ బాక్స్ రెండింటి యొక్క ప్రధాన హైలైట్ DTH ఆపరేటర్ అందిస్తున్న క్యాచ్-అప్ సర్వీస్. టాటా స్కై ఈ రెండు సేవలతో లైవ్ టివి ఛానెల్‌లను అందించడం లేదు. బదులుగా వినియోగదారులు లైవ్ టివి ఛానెల్స్ మరియు వీడియో-ఆన్-డిమాండ్ (VoD) యొక్క క్యాచ్-అప్ టీవీని చూడవచ్చు. టాటా స్కై బింగే + ఆండ్రాయిడ్ టివి సెట్-టాప్ బాక్స్ ప్రస్తుతం 5,999 రూపాయలకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

RS.10ల టాక్ టైమ్ ప్లాన్‌లను తిరిగి తీసుకువచ్చిన ఎయిర్‌టెల్ కాకపోతే....

టాటా స్కై క్యాచ్-అప్ సర్వీస్

టాటా స్కై క్యాచ్-అప్ సర్వీస్

టాటా స్కై - అమెజాన్ ఫైర్ టివి స్టిక్ యొక్క ఎడిషన్‌ను దాని అమితమైన సర్వీసును ఎంచుకునే వినియోగదారులకు అందిస్తోంది. ఆండ్రాయిడ్ టీవీ ఆధారిత టాటా స్కై బింగే + సెట్-టాప్ బాక్స్ యొక్క ధర ప్రస్తుతం 5,999 రూపాయలు. బింగే + STB మరియు అమెజాన్ ఫైర్ టివి స్టిక్ టాటా స్కై యొక్క సొంత యాప్ లతో ప్రీలోడ్ చేయబడి ఉంటాయి.

వీడియో-ఆన్-డిమాండ్
 

వీడియో-ఆన్-డిమాండ్

సాధారణంగా ఈ యాప్ లైవ్ టీవీ ఛానెల్‌లతో సహా గత ఏడు రోజులుగా ప్రసారం అయిన టీవీ షోలను చూడటానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఇంకా వినియోగదారులు వీడియో-ఆన్-డిమాండ్ (VoD) కంటెంట్‌ను కూడా చూడవచ్చు. టాటా స్కై యాప్ నుండే కంటెంట్‌ను చూడటానికి వినియోగదారులు వారి డిటిహెచ్ కనెక్షన్‌ను నెలవారీ రీఛార్జ్ చేసుకోవాలి. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ విషయంలో కూడా ఇదే పరిస్థితి. క్యాచ్-అప్ టీవీ ఛానెల్‌లు DTH కనెక్షన్‌లో వినియోగదారులు ఎంపిక చేసిన ఛానెల్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

వోడాఫోన్ రూ.269 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు....

Binge + STB యాక్సెస్

టాటా స్కై యొక్క మొబైల్ యాప్ మరియు డెస్క్‌టాప్‌లోని వాచ్ వెర్షన్ అదనపు ఖర్చు లేకుండా VoD కంటెంట్‌తో పాటు 400 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లను అందిస్తుంది. Binge + STB వినియోగదారులకు అదనపు ఖర్చు లేకుండా రూ.249 విలువైన ఒక నెల బింగే సర్వీసును ఉచితంగా అందిస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్‌ఎన్‌ఎక్స్‌టి, Zee5, హాట్‌స్టార్ వంటి యాప్ లతో బింగే + ముందే ఇన్‌స్టాల్ చేయబడి వస్తుంది. టాటా స్కై బింగే రూ.249 వద్ద అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ప్రీమియం OTT యాప్‌లకు మూడు నెలల పాటు యాక్సెస్ ను మరియు సన్‌ఎన్‌ఎక్స్‌టి, Zee5, ఈరోస్ నౌ తదితర యాప్ లకు యాక్సెస్ ను అందిస్తుంది.

టెక్ పరిశ్రమలో CEOగా రాణిస్తున్న 10 మంది భారతీయులు

టాటా స్కై బింగే + STB

టాటా స్కై బింగే + STB లేదా టాటా స్కై బింగే విషయానికి వస్తే ఏమి కొనాలనే దానిపై మీకు గందరగోళం ఉంటే మీరు టాటా స్కై బింగే + ను రూ.5,999 ధరతో ఎంచుకోవచ్చు. ఫైర్ టీవీ స్టిక్ టాటా స్కైకి తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేకుండా వినియోగదారులు తమతోనే ఉంచుకోవడానికి సెట్-టాప్ బాక్స్‌ను పొందుతారు.

2020లో ధర తగ్గింపును పొందిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

బింగే సర్వీసు

అదనంగా టాటా స్కై బింగే + అదనపు ఖర్చు లేకుండా ఒక నెల బింగే సర్వీసును ఉచితంగా అందిస్తుంది.ఆ పైన టాటా స్కై బింగే + OTT కంటెంట్ మరియు శాటిలైట్ టివి రెండింటినీ ఒకటిగా మిళితం చేసి అందిస్తుంది కాబట్టి ఇది వేర్వేరు HDMI ఇన్‌పుట్‌లలోకి మారడం మరియు రెండు వేర్వేరు రిమోట్‌ల ద్వారా కంటెంట్‌ను యాక్సెస్ చేయడం వంటి అవాంతరాలను తొలగిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Tata Sky Binge+ Set-Top Box Comes With 7 Days Catch-up Shows Service

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X