టాటా స్కై బింగే + సెట్-టాప్ బాక్స్ ఫ్రీగా అందిస్తున్న ఆఫర్స్ ఏమిటో తెలుసా?
ప్రముఖ డిటిహెచ్ ఆపరేటర్ ఇప్పుడు తాజాగా తన కొత్త టాటా స్కై బింగే + అనే ఆండ్రాయిడ్ టివి సెట్-టాప్ బాక్స్‌ను విడుదల చేసింది. టాటా స్కై బింగే + రూ.5,999 ధరను కలిగి ఉంది. ఇప్పుడు కొత్త కస్టమర్లు దీనిని టాటా స్కై యొక్క వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇతర డిటిహెచ్ ఆపరేటర్ల నుండి వస్తున్న ఇతర ఆండ్రాయిడ్ టివి ఎస్‌టిబిలతో పోలిస్తే టాటా స్కై బింగే + యొక్క ధర కాస్త ఎక్కువగానే ఉంది.

టాటా స్కై బింగే +
ఎయిర్‌టెల్ యొక్క ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ మరియు డిష్ SMRT Hub సెట్-టాప్ బాక్స్‌లు ప్రస్తుతం 3,999 రూపాయల ధర వద్ద లభిస్తున్నాయి. ఇతర ఆండ్రాయిడ్ టీవీ సెట్-టాప్ బాక్స్‌ల మాదిరిగానే టాటా స్కై బింగే + కూడా తన వినియోగదారులు శాటిలైట్ టీవీ మరియు OTT కంటెంట్లను రెండింటినీ చూడటానికి అనుమతిస్తుంది.

టాటా స్కై బింగే + సరికొత్త ఆండ్రాయిడ్ టీవీ 9.0 పై ప్లాట్‌ఫామ్‌తో రన్ అవుతున్నది. అలాగే ఇది హాట్‌స్టార్, Zee5, SunNXT వంటి OTT యాప్ లను ముందుగానే ప్రీఇన్‌స్టాల్ చేయబడి వస్తుంది. కొత్త కస్టమర్ల కోసం టాటా స్కై ఒక నెల బింగే సర్వీసును కూడా ఉచితంగా అందిస్తోంది. సాధారణంగా బింగే సర్వీసు కోసం రూ.249లు ఖర్చవుతుంది కానీ దీనిని ఉచితంగా అందిస్తున్నది. టాటా స్కై బింగే హాట్స్టార్, మూడు నెలల అమెజాన్ ప్రైమ్, SunNXT, Zee5 వంటి మరిన్ని ప్రీమియం OTT సర్వీసులకు యాక్సిస్ ను అందిస్తుంది.

టాటా స్కై బింగే + సెట్-టాప్ బాక్స్ ఫీచర్స్
ప్రస్తుతానికి టాటా స్కై బింగే + సెట్-టాప్ బాక్స్ యొక్క పూర్తి హార్డ్‌వేర్ వివరాలు అందుబాటులో లేవు. అయితే సెట్-టాప్ బాక్స్ ఇప్పటికే కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో 5,999 రూపాయల ధర వద్ద కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. అందుబాటులో ఉన్న కొన్ని వివరాల ప్రకారం బింగే+ బాక్స్ ఆండ్రాయిడ్ TV 9.0 పై సాఫ్ట్‌వేర్‌తో రన్ అవుతున్నది. దీనికి వస్తున్న రిమోట్ అంతర్నిర్మిత గూగుల్ అసిస్టెంట్ మద్దతును కలిగి ఉంది. టాటా స్కై బింగే + వినియోగదారులు OTT యాప్ ల నుండి కంటెంట్‌ను చూడటానికి ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయవచ్చు. అదనంగా వారు లైవ్ టీవీ ఛానెల్‌లను చూడటానికి స్టాండర్డ్ శాటిలైట్ టీవీ సర్వీసుకు మారవచ్చు.

స్పెసిఫికేషన్స్
ఇది ఆండ్రాయిడ్ TV సర్టిఫికేట్ బాక్స్ కాబట్టి వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుండి 5000 కంటే ఎక్కువ యాప్ లను మరియు గేమ్ లను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ బాక్స్ 2GB RAM మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంది. టాటా స్కై గత ఏడు రోజులుగా సరికొత్త STB తో టివి సేవలను కూడా అందిస్తోంది. ప్రీఇన్‌స్టాల్ చేసిన టాటా స్కై బింగే యాప్ నుండి అన్ని సేవలను చూడవచ్చు. వినియోగదారులు OTT యాప్ ల నుండి లైవ్ టీవీ ఛానెల్‌లను కూడా చూడవచ్చు. ఉదాహరణకు హాట్స్టార్ యొక్క ప్లాట్‌ఫామ్‌లో స్టార్ మా, ఏసియానెట్, స్టార్ స్పోర్ట్స్ వంటి లైవ్ టివి ఛానెల్‌లను చూడటానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

టాటా స్కై బింగే + ఆఫర్స్
మే 2019 లో అమెజాన్ ఇండియా సహకారంతో టాటా స్కై బింగే సర్వీసును ప్రకటించారు. టాటా స్కై బింగే సర్వీసులో భాగంగా వినియోగదారులు హాట్స్టార్, ఈరోస్ నౌ, హంగమా ప్లే, SunNXT, అమెజాన్ ప్రైమ్ వంటి ప్రీమియం OTT చందాలతో పాటు అమెజాన్ ఫైర్ టివి స్టిక్ టాటా స్కై ఎడిషన్‌ను మరియు ZEE5 చందాను మూడు నెలలపాటు ఉచితంగా పొందవచ్చు. ఈ OTT సబ్స్క్రిప్షన్ లన్నింటికీ వ్యక్తిగతంగా నెలకు 700 రూపాయలు ఖర్చవుతాయి. కాని టాటా స్కై బింగే వాటిని నెలకు కేవలం 249 రూపాయలకు అందిస్తున్నది.


Click it and Unblock the Notifications








