Home
News

Tata Sky Binge+ సెట్-టాప్ బాక్స్ మీద RS.1,000 తగ్గింపు

టాటా స్కై ఇప్పుడు తన ఆండ్రాయిడ్ టీవీ బింగే + సెట్-టాప్ బాక్స్ కోసం అప్‌గ్రేడ్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. టాటా స్కై, ఎయిర్‌టెల్ డిజిటల్ టివి మరియు డిష్ టివి వంటివి గత నెలలో ఆండ్రాయిడ్ టివి ఆధారిత ఎస్‌టిబిని వినియోగదారులకు అందించాయి.

 టాటా స్కై

అప్పుడు టాటా స్కై తన వినియోగదారుల కోసం ఎటువంటి అప్‌గ్రేడ్ ఆఫర్‌ను ప్రవేశపెట్టలేదు. జనవరి 31 న ప్రవేశపెట్టిన కొత్త అప్‌గ్రేడ్ ఆఫర్‌లో భాగంగా SD లేదా HD కనెక్షన్ ఉన్న టాటా స్కై యూజర్లు ఇప్పుడు టాటా స్కై బింగే + ను రూ.1000ల తగ్గింపుతో కేవలం రూ.4,999 ధర వద్ద పొందవచ్చు.

 

 

టాటా స్కై బింగే + అప్‌గ్రేడ్ ఆఫర్

టాటా స్కై బింగే + అప్‌గ్రేడ్ ఆఫర్

ప్రీమియం డిటిహెచ్ ఆపరేటర్ కావడంతో టాటా స్కై వినియోగదారులను బింగే + సెట్-టాప్ బాక్స్‌లో అప్‌గ్రేడ్ ఆఫర్‌లను పొందటానికి అనుమతించలేదు. అయితే టాటా స్కై చందాదారులు చాలా మంది అప్‌గ్రేడ్ ఆఫర్ లేకపోవడంపై నిరాశ వ్యక్తం చేయడంతో మొత్తానికి అప్‌గ్రేడ్ ను ఇప్పుడు తీసుకువచ్చింది. ప్రస్తుతం ఉన్న టాటా స్కై స్టాండర్డ్ డెఫినిషన్ (ఎస్‌డి) మరియు హై డెఫినిషన్ (హెచ్‌డి) సెట్-టాప్ బాక్స్ యూజర్లు బింగే + ఎస్‌టిబిని రూ .4,999 వద్ద పొందవచ్చు. ఇది కొత్త కనెక్షన్ యొక్క రూ.5,999 ధర కన్నా రూ.1,000 తక్కువగా ఉంది.

 

 

క్యాష్‌బ్యాక్ ఆఫర్

క్యాష్‌బ్యాక్ ఆఫర్

అయితే ఇందులో గమనించవలసిన ముఖ్యమైన విషయం రూ.1,000ల తగ్గింపు తక్షణ డిస్కౌంట్‌గా ఇవ్వబడదు. బదులుగా టాటా స్కై దానిని క్యాష్‌బ్యాక్ మొత్తంగా క్రెడిట్ చేస్తుంది. వాస్తవానికి ప్రస్తుత టాటా స్కై యూజర్లు బింగే + STBని రూ.5,999 కు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనిని ఇన్‌స్టాలేషన్ చేసిన 24 గంటల తర్వాత రూ.1,000లు క్యాష్‌బ్యాక్ రూపంలో యూజర్ యొక్క అకౌంట్ లో జమచేయబడుతుంది. ఈ మొత్తాన్ని నెలవారీ ఛానల్ ప్యాక్ బిల్లులను చెల్లించడానికి ఉపయోగించవచ్చు.

 

 

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ మరియు డిష్ టీవీ అప్‌గ్రేడ్ ఆఫర్‌లు

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ మరియు డిష్ టీవీ అప్‌గ్రేడ్ ఆఫర్‌లు

ఎయిర్‌టెల్ డిజిటల్ టివి తన ఆండ్రాయిడ్ టివి ఆధారిత ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ను ప్రస్తుతం ఉన్న SD, HD STB బాక్స్ వినియోగదారుల కోసం కేవలం 2,249 రూపాయలకు అందిస్తోంది. మరోవైపు డిష్ టివి కూడా అప్‌గ్రేడ్ ఆఫర్‌ను అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుత యూజర్లు డిష్ SMRT Hubను కేవలం రూ.2,499 ధర వద్ద పొందవచ్చు.

ధరల పోలికలు

ధరల పోలికలు

టాటా స్కై తన ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్ ఆఫర్‌తో తన చందాదారులకు గొప్ప అవకాశాలను అందిస్తున్నది. క్యాష్‌బ్యాక్ ఆఫర్ కింద ఆండ్రాయిడ్ ఎస్‌టిబిను ప్రభావవంతమైన రూ .4,999 ధరకే తీసుకువస్తుంది. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ 3,999 రూపాయలకు లభిస్తుంది. అలాగే డిష్ SMRT Hub సెట్-టాప్ బాక్స్ కూడా రూ .2,499 కు లభిస్తుంది.

 

 

ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ మరియు డిష్ SMRT Hub రెండూ కొత్త కస్టమర్లకు రూ.3,999 ధరకే లభిస్తాయి. టాటా స్కై బింగే + బాక్స్ కొత్త వినియోగదారులకు రూ.5,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అలాగే ఇది 249 రూపాయల విలువైన ఒక నెల బింగే చందాను ఉచితంగా అందిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Tata Sky Binge+ Set-Top Box Rs.1000 Cashback Offer: Check Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X