టాటా స్కై బింగే+ ఆండ్రాయిడ్ STB కొనుగోలుపై ఎన్నడులేని డిస్కౌంట్ ఆఫర్స్!!

|

ఇండియాలోని డైరెక్ట్-టు-హోమ్ (DTH) విభాగంలో అతి పెద్ద యూజర్ బేస్ కలిగిన టాటా స్కై తన యొక్క వినియోగదారులకు వివిధ రకాల STBలను అందిస్తుంది. టాటా స్కై అందించే టాటా స్కై బింగే + ఆండ్రాయిడ్ సెట్-టాప్ బాక్స్ (STB) ని తక్కువ ధర వద్ద అందిస్తోంది. ఈ DTH ఆపరేటర్ తన యొక్క వెబ్‌సైట్‌లో టాటా స్కై బింగే+ ఆండ్రాయిడ్ STBని ప్రత్యేకమైన ధర వద్ద అందిస్తోంది. Binge+ STBని ఆన్‌లైన్‌లో నేరుగా కంపెనీ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేసే వ్యక్తులు రూ. 200 తక్షణ తగ్గింపును పొందవచ్చు. STB యొక్క ప్రస్తుత ధర రూ.2,499. కానీ రూ.200 తగ్గింపు వోచర్‌తో దాని ధర రూ.2299కి తగ్గించబడుతుంది. ఈ తగ్గింపును పొందేందుకు వినియోగదారులు ప్రోమో కోడ్ - TSKY200ని ఎంచుకోవాలి.

 

టాటా స్కై బింగే+ స్పెసిఫికేషన్‌లు

టాటా స్కై బింగే+ స్పెసిఫికేషన్‌లు

టాటా స్కై బింగే+ అనేది ఆండ్రాయిడ్-పవర్డ్ STB. ఇది గూగుల్ వాయిస్ అసిస్టెంట్‌కి మద్దతు ఇస్తుంది. ఇది వినియోగదారులకు కంటెంట్ డిస్కవరీని సులభమైన పనిగా చేస్తుంది. ఆండ్రాయిడ్ STB 4K కంటెంట్‌ను సజావుగా బట్వాడా చేయగలదు మరియు అంతర్నిర్మిత Chromecastతో కూడా వస్తుంది. తద్వారా వినియోగదారులు వారి స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు లేదా ఇతర పరికరాలను నేరుగా వారి టీవీ స్క్రీన్‌లోకి ప్రసారం చేయవచ్చు. శోధనను మరింత సులభతరం చేయడానికి ప్రత్యేక గూగుల్ అసిస్టెంట్ బటన్‌ను కలిగి ఉన్న రిమోట్‌తో STB వస్తుంది.

STB

STB వినియోగదారులను కంటెంట్‌ను రికార్డ్ చేయడానికి మరియు తర్వాత ప్లే చేయడానికి అనుమతిస్తుంది. తద్వారా వారు తమకు ఇష్టమైన ప్రదర్శనలను కోల్పోరు. టాటా స్కై బింగే+ STB యొక్క ముఖ్యాంశాలలో ఒకటి ఇది వినియోగదారులకు ఉచిత టాటా స్కై బింగే సర్వీసును అందిస్తుంది. టాటా స్కై బింగే సర్వీస్ అనేది టాటా స్కై యొక్క ఓవర్-ది-టాప్ (OTT) బండిల్ ప్లాట్‌ఫారమ్. ఇది డిస్నీ+ హాట్‌స్టార్, SonyLIV, Voot Select, ZEE5, Eros Now, Voot Kids, CuriosityStream మరియు మరిన్ని ప్లాట్‌ఫారమ్‌లకు వినియోగదారులకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది.

 

 

టాటా స్కై
 

టాటా స్కై యొక్క కొత్త STBని కొనుగోలు చేసినప్పుడు వినియోగదారులు ఒక నెల టాటా స్కై బింగే సేవను పూర్తిగా ఉచితంగా పొందుతారు. Tata Sky Binge+ STBతో వినియోగదారులు ఒకే బటన్ క్లిక్‌తో OTT మరియు శాటిలైట్ టీవీ కంటెంట్‌ల మధ్య సజావుగా మారవచ్చు. ఇతర కంపెనీల నుండి కూడా ఆండ్రాయిడ్ STBలు అందుబాటులో ఉన్నాయి. కానీ టాటా స్కై బింగే+ ప్రస్తుతం అత్యంత సరసమైనది మరియు ఇది రూ. 200 తగ్గింపుతో వస్తోంది.

టాటా స్కై బింగే మొబైల్ ఓన్లీలో ప్లాన్‌

టాటా స్కై బింగే మొబైల్ ఓన్లీలో ప్లాన్‌

టాటా స్కై తన యొక్క మొబైల్ వినియోగదారుల కోసం మాత్రమే రూ.149 ప్లాన్‌ను విడుదల చేసింది. ఇక్కడ మీరు గమనించవలసిన మొదటి విషయం ఏమిటంటే మీరు టాటా స్కై బింగే + సెట్-టాప్ బాక్స్ (STB) లేదా అమెజాన్ ఫైర్ టివి స్టిక్ టాటా స్కై ఎడిషన్‌ను కలిగి ఉన్న చందాదారుడు కాకపోతే మీరు సంస్థ అందించే ఈ అతి పెద్ద సర్వీసును యాక్సెస్ చేయలేరు. రూ.149 ప్లాన్ ను కొనుగోలు చేసిన వినియోగదారుడు 3 మొబైల్ స్క్రీన్లలో బింగే సర్వీస్ యొక్క కంటెంట్ ను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. అయితే రూ.299 ప్లాన్ యొక్క వినియోగదారులు ఒక టీవీ స్క్రీన్ లేదా 3 మొబైల్ స్క్రీన్లలో కంటెంట్ను వినియోగించుకోవడానికి అనుమతిస్తుంది. టాటా స్కై అందించే రెండు ప్లాన్ల మధ్య మరిన్ని ఎక్కువ తేడాలు ఉన్నాయి. రూ.299 ప్లాన్ వినియోగదారులకు 10 కి పైగా ప్లాట్‌ఫాంల నుండి OTT కంటెంట్‌ను వినియోగించుకునే వీలు కల్పిస్తుంది. అయితే రూ.149 ప్లాన్‌తో యూజర్లు కేవలం 7 ప్లాట్‌ఫామ్‌ల నుంచి కంటెంట్‌ను వినియోగించుకునేందుకు పరిమితం అవుతారు.

టాటా స్కై బింగే సర్వీస్ పొందే విధానం

టాటా స్కై బింగే సర్వీస్ పొందే విధానం

టాటా స్కై బింగే సర్వీసును పొందడానికి రెండు ఎంపికలు ఉన్నాయి. ఇందులో మొదటిది స్టాండర్డ్ టాటా స్కై బింగే సేవను ఎంచుకోవడం. టాటా స్కై వినియోగదారులు నెలకు రూ.299 చొప్పున బింగే సర్వీస్ సబ్స్క్రిప్షన్ ను పొందటానికి అనుమతిస్తుంది. ఇంతకుముందు దీని ధర 249 రూపాయలు ఉండేది. కానీ కంపెనీ ఇప్పుడు 10 OTT సబ్స్క్రిప్షన్ లను కలుపుతూ 299 రూపాయల ధర వద్ద లభిస్తుంది. రెండవ ఎంపికను ఎంచుకునే వారిలో ఇప్పటికీ స్మార్ట్ కాని టీవీని ఉపయోగిస్తున్న వారికి ఉత్తమ ఎంపిక అవుతుంది. టాటా స్కై బింగే + ఆండ్రాయిడ్ టీవీతో రన్ అవుతుంది. ఇది ఆరు నెలల ఉచిత బింగే చందాతో వస్తుంది. ఆరు నెలల తరువాత టాటా స్కై యూజర్లు ప్రతి నెలా రూ.299 ధర వద్ద కొనుగోలు చేయవలసి ఉంటుంది. మీరు OTT సభ్యత్వాలను పొందాలని చూస్తున్నట్లయితే తప్పు చేయకండి. వెంటనే టాటా స్కై యొక్క బింగే సేవను ఎంచుకోండి. టాటా స్కై బింగే సర్వీస్ అనేది మొత్తం కంటెంట్‌ను ఒకే సేవలోకి తీసుకురావడమే కాకుండా 10 వేర్వేరు యాప్ ల కంటెంట్ ను ఉచితంగా యాక్సిస్ చేయడానికి అనుమతిని ఇస్తుంది. ఈ 10 OTT యాప్ లలో అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియం, ZEE5, సోనీలైవ్, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, SunNXT, క్యూరియాసిటీ స్ట్రీమ్, ఈరోస్ నౌ, షెమరూమీ మరియు హంగామా ప్లే వంటివి ఉన్నాయి. టాటా స్కై బింగే సర్వీస్ పని చేయడానికి మీ యొక్క DTH సబ్స్క్రిప్షన్ యాక్టీవేషన్ లో ఉండాలి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Tata Sky Binge+ STB Now Available at Special Discount Price: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X