Dish SMRT Hub & Tata Sky Binge+ సెట్-టాప్-బాక్స్‌ల మధ్య తేడా...

|

ప్రస్తుత కాలంలో హై స్పీడ్ ఇంటర్నెట్ వాడకం ఎక్కువ అవుతున్నది. ఈ హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది ఇప్పుడు చాలా సరసమైన ధరలలో కూడా దొరుకుతున్నది. హై స్పీడ్ ఇంటర్నెట్ ద్వారా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ఇతర OTT యాప్ లకు ఆదరణ బాగా పెరుగుతోంది. వాస్తవానికి గేమ్స్ మీద ఆసక్తి ఉన్న వారు హాట్‌స్టార్ యాప్ ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రస్తుత కాలంలో ఇది బాగా ప్రాచుర్యం పొందింది.

DTH ఆపరేటర్లు
 

DTH ఆపరేటర్లు

DTH ఆపరేటర్లు ఉత్తమమైన సాటిలైట్ టీవీ మరియు OTT యాప్ లను కోరుకునే వినియోగదారులను మరింతగా ఆకర్షించడానికి ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు. టాటా స్కై, డిష్ టీవీ, ఎయిర్‌టెల్ సంస్థలు అన్ని ఆండ్రాయిడ్ టీవీతో నడిచే సెట్-టాప్-బాక్స్‌లను విడుదల చేశాయి. ఇప్పుడు టాటా స్కై బింగే + మరియు డిష్ SMRT హబ్‌ సెట్-టాప్-బాక్స్‌లలో ఏది ఉత్తమ ప్రయోజనాలను అందిస్తోందో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

నేటి చంద్రగ్రహణంను ఆన్‌లైన్‌లో చూడాలని ఉందా?

ధరల మధ్య తేడా

ధరల మధ్య తేడా

టాటా స్కై బింగే + ప్రైస్

ఇండియాలోని DTH ఆపరేటర్లలో మొదటి స్థానంలో ఉన్న టాటా స్కై చాలా రకాల సెట్ టాప్ బాక్స్‌లను అందిస్తున్నప్పటికీ కొత్తగా ఇప్పుడు టాటా స్కై బింగే +ను విడుదల చేసింది. కంపెనీ యొక్క వెబ్‌సైట్ నుండి చందాదారులు దీనిని రూ.5,999 ధర వద్ద పొందవచ్చు. కంపెనీ ఇప్పటికే ఉన్న వినియోగదారులకు ఈ సెట్-టాప్-బాక్స్‌ను అందించడం లేదు.

Realme 5i : క్వాడ్ కెమెరా సెటప్‌తో రిలీజ్... ధరకు సమానమైన ఆఫర్లు

డిష్ SMRT హబ్‌ ప్రైస్

డిష్ SMRT హబ్‌ ప్రైస్

డిష్ టీవీ యొక్క డిష్ SMRT హబ్ సెట్-టాప్-బాక్స్‌ను కొత్త చందాదారులు రూ.3,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అలాగే ఇప్పటికే ఉన్న డిష్ టీవీ చందాదారులైతే దీనిని 1,500 రూపాయల తగ్గింపు ధరతో పొందవచ్చు. అంటే దీనిని రూ.2,499ల ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

చక్కగా బ్రేక్ ఫాస్ట్ తయారుచేస్తున్న రోబోట్...

OTT యాప్ లు మరియు సబ్స్క్రిప్షన్
 

OTT యాప్ లు మరియు సబ్స్క్రిప్షన్

టాటా స్కై

టాటా స్కై సెట్-టాప్-బాక్స్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులు సాటిలైట్ టీవీ కనెక్షన్‌తో పాటు ఛానల్ ప్యాక్‌లను కూడా ఎన్నుకోవాలి. టాటా స్కై ఆపరేటర్ Binge+ సర్వీస్ యొక్క ఒక నెల సభ్యత్వాన్ని ఉచితంగా కూడా అందిస్తోంది. ఒక నెల ట్రయల్ తరువాత హాట్స్టార్, Zee 5, SunNXT, ఈరోస్ నౌ వంటి మరెన్నో కంటెంట్ల యాక్సెస్ కోసం వినియోగదారులు నెలకు రూ.249 చెల్లించాలి. బింగే + యాప్ ను ఉపయోగించి లైవ్ టీవీ స్ట్రీమింగ్ మరియు 7 రోజుల వరకు క్యాచ్-అప్ టీవీ ఫీచర్ కూడా ఉంది.

వాట్సాప్‌లో ఈ పనులు చేస్తున్నారా? ఇక జైలుకు వెళ్ళాక తప్పదు...

డిష్ SMRT హబ్ OTT యాప్ లు

డిష్ SMRT హబ్ OTT యాప్ లు

డిష్ SMRT హబ్ విషయంలో మీరు ఎంచుకున్న సాటిలైట్ టీవీ ఛానెల్‌లకు మాత్రమే మీకు యాక్సిస్ లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ZEE5, హాట్‌స్టార్ వంటి వాటికీ మీరు ప్రత్యేక సభ్యత్వాన్ని ఉచితంగా పొందవచ్చు. డిష్ టీవీ యొక్క సెట్-టాప్-బాక్స్ గురించి అంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది నెట్‌ఫ్లిక్స్ కు మద్దతు ఇవ్వదు.

CES 2020: మిడి-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం 5G-ఎనేబుల్డ్ SoC చిప్‌లను ప్రకటించిన మీడియాటెక్

సెట్-టాప్-బాక్స్‌ల ఫీచర్స్

సెట్-టాప్-బాక్స్‌ల ఫీచర్స్

ఈ సెట్-టాప్-బాక్స్‌ల యొక్క ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ ల విషయానికి వస్తే ఇవి 2GB RAM మరియు 8GB స్టోరేజ్ ల మద్దతుతో వస్తుంది. ఇవి ఆండ్రాయిడ్ SOC ని కలిగి ఉన్నందున ఇందులో అంతర్నిర్మిత ChromeCast మరియు గూగుల్ అసిస్టెంట్ మద్దతును కూడా పొందుతారు. అంతేకాకుండా ఇందులో USB థంబ్ డ్రైవ్ లేదా HDD ని కూడా కనెక్ట్ చేయవచ్చు. దాని కోసం ఇందులో రెండు USB 2.0 పోర్ట్‌లు కూడా ఉన్నాయి. ఇతర కనెక్టివిటీ ఎంపికలలో HDMI 2.0 పోర్ట్, మిక్సర్ అవుట్పుట్ మరియు SPDIF పోర్ట్ ఉన్నాయి. ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం Wi-Fi మరియు ఈథర్నెట్ మద్దతు రెండూ ఉన్నాయి. చివరగా సెట్-టాప్-బాక్స్‌లలో బ్లూటూత్ మద్దతు కూడా ఉంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Tata Sky Binge+ vs Dish SMRT Hub: Price, OTT Apps, Specifications and more

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X