టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ 1Gbps ప్లాన్ ఎందుకు ప్రత్యేకంగా ఉందొ తెలుసా??

|

ఇండియాలో బ్రాడ్‌బ్యాండ్ రంగంలో మంచి గుర్తింపును పొందిన టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ తన యొక్క కస్టమర్లకు చాలా మంచి ఇంటర్నెట్ ప్లాన్‌లను అందిస్తుంది. 1 Gbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్న కస్టమర్లు తప్పనిసరిగా టాటా స్కై అందించే ప్రత్యేక ఆఫర్‌ల గురించి తెలుసుకోవలసి ఉంటుంది. టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ తన వినియోగదారులకు తన స్థోమతకు మించి గొప్ప ప్రయోజనాలను అందిస్తున్నది. టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ స్థిరమైన మరియు నాణ్యమైన సేవలను అందించడంలో ప్రసిద్ధి చెందింది. ఏదేమైనా కంపెనీ నుండి 1 Gbps ప్లాన్‌కు తిరిగి వస్తోంది. దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ 1 Gbps ప్లాన్ పూర్తి వివరాలు

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ 1 Gbps ప్లాన్ పూర్తి వివరాలు

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ తన వినియోగదారులకు నెలకు రూ.3,600 ధర వద్ద కొత్తగా 1Gbps ప్లాన్‌ను అందిస్తుంది. ఇది భారతదేశంలో అత్యంత సరసమైన గిగాబిట్-స్పీడ్ ప్లాన్‌లలో ఒకటి. వినియోగదారులకు అధిక వేగాన్ని అందించడానికి కంపెనీ ఫైబర్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. టాటా స్కై యొక్క బ్రాడ్‌బ్యాండ్ సేవలు దేశంలోని ప్రతి ప్రాంతంలోనూ లేవని గమనించండి. కాబట్టి మీరు కంపెనీ నుండి ప్లాన్‌లను కొనుగోలు చేయలేకపోవచ్చు.

Vi, Airtel, Jio కొత్త మార్పులతో ఎంత వరకు ప్రయోజనాన్ని పొందాయో తెలుసా!!Vi, Airtel, Jio కొత్త మార్పులతో ఎంత వరకు ప్రయోజనాన్ని పొందాయో తెలుసా!!

టాటా స్కై
 

సంబంధం లేకుండా మీరు టాటా స్కై నుండి 1 Gbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఇది మీకు మంచి ఎంపిక కావడానికి మరిన్ని కారణాలు చాలానే ఉన్నాయి. ఇది నెలకు 3.3TB లేదా 3,300GB ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP) డేటా ప్రయోజనంను వినియోగదారులకు అందిస్తుంది. Wi-Fi లో వినియోగదారులు 450 Mbps స్పీడ్‌ని పొందుతారని మరియు LAN కేబుల్‌తో 900 Mbps స్పీడ్‌ని అందుకుంటుందని కంపెనీ పేర్కొంది. ఎండ్ డివైస్ 5GHz నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేయగలదు మరియు యూజర్ డ్యూయల్-బ్యాండ్ కనెక్టివిటీతో వచ్చే రూటర్ కలిగి ఉంటే అతడు/ఆమె 1 Gbps స్పీడ్ పొందగలరు.

ఆపిల్ వాచ్ సిరీస్ 7 & ఆపిల్ ఐప్యాడ్ విడుదలయ్యాయి!! ధరలు, ఫీచర్స్ ఇవిగోఆపిల్ వాచ్ సిరీస్ 7 & ఆపిల్ ఐప్యాడ్ విడుదలయ్యాయి!! ధరలు, ఫీచర్స్ ఇవిగో

1 Gbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

టాటా స్కై యొక్క 1 Gbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ పొందిన వినియోగదారులకు ల్యాండ్‌లైన్ కనెక్షన్‌ను ఉచితంగా కూడా అందిస్తుంది. కానీ సేవలను వినియోగించడం కోసం వినియోగదారులు మూడవ పార్టీ నుండి టెలిఫోన్‌ను కొనుగోలు చేయాలి. కంపెనీ వినియోగదారులకు కేవలం ల్యాండ్ లైన్ కనెక్షన్ మాత్రమే అందిస్తుంది. వినియోగదారులు ఒక నెలపాటు కొనుగోలు చేసినప్పటికీ ప్లాన్‌ని కొనుగోలు చేయడానికి ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్‌ని చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే కనెక్షన్ యొక్క ఇన్‌స్టాలేషన్ కోసం కంపెనీ ఎటువంటి ఛార్జ్ చేయదు. వినియోగదారులు ఏకరీతి అప్‌లోడ్ మరియు డౌన్‌లోడ్ వేగాన్ని పొందుతారు. టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు 99.9% అప్‌టైమ్ మరియు అత్యంత సురక్షితమైన నెట్‌వర్క్‌ను వాగ్దానం చేస్తుంది. డ్యూయల్-బ్యాండ్ రౌటర్ కూడా టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ద్వారా అదనపు ఖర్చు లేకుండా అందించబడుతుంది.

JioFiber

పోల్చి చూసుకుంటే కనుక టాటా స్కై నుండి వచ్చిన ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ JioFiber మరియు Airtel Xstream Fiber తమ కస్టమర్లకు అందించే దానికంటే చాలా చౌకగా ఉంటుంది. ఎయిర్‌టెల్ మరియు జియో రెండూ తమ 1 Gbps ప్లాన్‌ను రూ.3,999 నుంచి అందిస్తున్నాయి. అయితే ఎయిర్‌టెల్ మరియు జియో యొక్క ప్లాన్‌లు ఎందుకు మెరుగ్గా ఉన్నాయో అనేదానికి ఒక ప్రధాన వ్యత్యాసం ఉంది మరియు అది వినియోగదారులకు లభించే అదనపు ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాలు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Tata Sky Broadband 1Gbps New Plan Is Very special!! Do You Know Why?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X