Tata Sky Broadband నుంచి అదిరిపోయే గొప్ప ప్లాన్‌లు!!!
ఇండియాలోని డిటిహెచ్ రంగంలో మొదటి స్థానంలో ఉన్న టాటా స్కై లిమిటెడ్ సంస్థ దాని అనుబంధ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో కూడా హవా కొనసాగిస్తున్నది. ఇప్పుడు సంస్థ కొత్తగా ఒక నెలకు 500GB డేటా పరిమితితో 300 Mbps స్పీడ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. భారతదేశంలోని అనేక నగరాల్లో పాన్ ఇండియా సర్వీస్ ప్రొవైడర్ గా 300Mbps అపరిమిత ప్లాన్ ను మే చివరలో మొదటిసారిగా ప్రవేశపెట్టింది. అపరిమిత 300Mbps ప్లాన్ నెలకు రూ.1900 ధర వద్ద కలిగి ఉంది. దేశవ్యాప్తంగా "ఎంచుకున్న ప్రాంతాలలో" ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుందని ఆపరేటర్ హైలైట్ చేసింది. 300 Mbps "ఫిక్స్‌డ్ జిబి" కొత్త ప్లాన్ అపరిమిత ప్లాన్ కంటే తక్కువ ధరను కలిగి ఉంటుంది. భారతదేశం అంతటా ఎంచుకున్న నగరాల్లో అందుబాటులోకి వచ్చే ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ 300Mbps ఫిక్సడ్ GB ప్లాన్ పూర్తి వివరాలు
టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ కొత్తగా అందిస్తున్న 300Mbps ఫిక్స్‌డ్ జిబి ప్లాన్ యూజర్లకు ఒక నెలకు 500GB పరిమిత డేటాను 300 Mbps వేగంతో బ్రౌజ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. వినియోగదారుడు డేటా పరిమితిని చేరుకున్న తర్వాత డేటా యొక్క వేగం 3Mbps కు తగ్గించబడుతుంది.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ఫిక్స్‌డ్ జిబి ప్లాన్ ధరల వివరాలు
టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ యొక్క 300Mbps ఫిక్స్‌డ్ జిబి ప్లాన్ నెలవారీ, త్రైమాసిక, సెమీ వార్షిక మరియు ఒక సంవత్సరం చందా ప్రాతిపదికన అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. ఆపరేటర్ ఫిక్స్‌డ్ జిబి ప్లాన్‌లను కొనుగోలు చేసిన వినియోగదారులందరికీ ఉచిత రౌటర్‌తో పాటు డేటా రోల్‌ఓవర్ ఎంపికను కూడా అదనంగా అందిస్తుంది. ఫిక్స్‌డ్ జిబి త్రైమాసిక, సెమీ వార్షిక మరియు వార్షిక ప్యాక్‌లకు సభ్యత్వం పొందిన వినియోగదారులకు ఇన్స్టాలేషన్ చార్జీలు ఉచితంగా ఇవ్వబడతాయి. టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ కొత్త 300Mbps ఫిక్స్‌డ్ జిబి ప్లాన్ ప్రస్తుతం బెంగళూరు, చెన్నై, గ్రేటర్ నోయిడా, గుర్గావ్, ముంబై, న్యూ ఢిల్లీ, పింప్రి చిన్చ్వాడ్, పూణే మరియు థానేలలోని వినియోగదారులకు అందుబాటులో ఉంది.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ అపరిమిత ప్లాన్‌ల వివరాలు
టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ఇండియాలో ఎంపిక చేసిన నగరాల్లో నెలకు 1900 రూపాయల ధర వద్ద అపరిమిత 300Mbps ప్లాన్‌ను అందిస్తున్నది. ఈ ప్లాన్ మొత్తం చెల్లుబాటు కాలంలో 3300GB డేటా పరిమితిని చేరుకున్న తరువాత వినియోగదారులు బ్రోసింగ్ వేగం 300 Mbps వేగం నుంచి 3 Mbps కు తగ్గించబడుతుంది.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ అపరిమిత ప్లాన్‌ల ధరల వివరాలు
టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ప్రస్తుతం నాలుగు అపరిమిత ప్లాన్‌లను అందిస్తుంది. వీటిలో 300Mbps ప్లాన్‌తో పాటు భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో రూ.950 నుంచి రూ.1900 ధర లోపు లభించే కొన్ని ప్లాన్లు ఉన్నాయి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో రూ.790 నుండి 1470 రూపాయల ధర మధ్య ఐదు ఫిక్సడ్ జిబి ప్లాన్‌లను ఆపరేటర్ అందిస్తుంది.


Click it and Unblock the Notifications








