Tata Sky బ్రాడ్‌బ్యాండ్ 500 Mbps ప్లాన్ ప్రయోజనాల మీద ఓ లుక్ వేయండి
ఇండియాలో బ్రాడ్‌బ్యాండ్ రంగంలో టాటా స్కై గత కొన్ని సంవత్సరాలుగా తన వ్యాపారాన్ని దూకుడుగా పెంచుతోంది. టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ఇప్పుడు కస్టమర్ కోరుకునే అన్ని రకాల ప్లాన్ లను అందిస్తుంది. 50 Mbps కంటే తక్కువ వేగం నుండి 1Gbps వరకు స్పీడ్ తో లభించే సూపర్-హై-స్పీడ్ ప్లాన్ కూడా తన సమర్పణలో ఉంది. టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ మొత్తంగా ఏడు వేర్వేరు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లను అందిస్తుంది. అత్యంత ఖరీదైన ప్లాన్ లలో ఒకటైన 500 Mbps ప్లాన్ అత్యధిక వేగంతో అపరిమిత డేటాను అందిస్తుంది. అంతేకాకుండా ఇది అధిక OTT ప్రయోజనాలను కూడా అందిస్తుంది. వీటి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

500 Mbps స్పీడ్ టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ధరల వివరాలు
టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ 500 Mbps ప్లాన్ ఒక నెల చెల్లుబాటుతో రూ.2,300 ధర వద్ద లభిస్తుంది. అయితే ఇది 3, 6, మరియు 12 నెలల ఎంపికలో కూడా లభిస్తుంది. 3 నెలల చెల్లుబాటుకు రూ.6,900 (నెలకు రూ .2,300) ధర వద్ద పొందవచ్చు. 3 నెలలకు ఎంచుకున్నప్పుడు ఎటువంటి డిస్కౌంట్ లభించదు.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ 500 Mbps లాంగ్ టర్మ్ ప్లాన్ ధరలు
6 నెలల చెల్లుబాటుకు రూ.12,900 (నెలకు రూ .2,150) ధర వద్ద పొందవచ్చు. ఇది 6 నెలలకు కలుపుకొని నెలకు 150 రూపాయలు ఆదా చేయడంలో మీకు సహాయపడుతుంది. అంటే మొత్తం రూ.900 తగ్గింపుతో లభిస్తుంది. అయితే 12 నెలల చెల్లుబాటుకు రూ.24,600 (నెలకు రూ .2,050) ఖర్చు అవుతుంది. అంటే మీరు ప్రతి నెలా రూ.250 తగ్గింపు పొందవచ్చు. అంటే మొత్తం చెల్లుబాటులో రూ.3,000 వరకు తగ్గింపును పొందవచ్చు.

500 Mbps స్పీడ్ టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రయోజనాలు
500 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో ల్యాండ్‌లైన్ కనెక్షన్‌ను ఉచితంగా స్వీకరించడానికి వినియోగదారులకు అనుమతి ఉంటుంది. ఈ ప్లాన్ అపరిమిత డేటాతో వస్తుంది. ఇక్కడ వినియోగదారులకు (FUP) పరిమితిలో 3.3TB లేదా 3,300GB డేటా లభిస్తుంది. FUP డేటాను వినియోగించిన తరువాత వినియోగదారులు 3 Mbps వేగంతో అపరిమిత డేటాను యాక్సిస్ చేయవచ్చు. దీనిని ఎంచుకున్న వారికి ఇన్స్టాలేషన్ చార్జీలు ఉచితంగా లభిస్తాయి. అలాగే ఉచిత రౌటర్ డ్యూయల్-బ్యాండ్ ONT + Wi-Fi రౌటర్‌ను స్వీకరించడానికి వినియోగదారులు అర్హులు అవుతారు. JioFiber యొక్క 500 Mbps ప్లాన్ నెలవారీ ప్రాతిపదికన దీని కంటే ఖరీదైనది.


Click it and Unblock the Notifications