Home
News

Tata Sky బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో ఉచితంగా ల్యాండ్‌లైన్ సేవలు!!! కానీ వీటికి మాత్రమే

టాటా స్కై ఇటీవల తన బ్రాడ్‌బ్యాండ్ యొక్క సేవలను అందరికి అందుబాటులోకి తీసుకురావడానికి వినూత్నమైన పద్దతులను అవలంబిస్తున్నది. ఇండియాలో బ్రాడ్‌బ్యాండ్ రంగంలో ఇప్పటికే ఎయిర్‌టెల్ మరియు జియో రెండూ తమ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అప్‌గ్రేడ్ చేశాయి మరియు ఇప్పుడు అవి ప్రతి ప్లాన్‌తో అపరిమిత డేటాను అందిస్తున్నాయి. ఇతర ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్స్ (ISP) లతో పోటీ పడటానికి మరియు మార్కెట్లో తన మనుగడను కాపాడుకోవడానికి టాటా స్కై ఇప్పుడు తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో ల్యాండ్‌లైన్ సేవలను కూడా ఉచితంగా అందిస్తోంది. అయితే బ్రాడ్‌బ్యాండ్ యొక్క కొన్ని ప్లాన్‌లను ఎంచుకున్న వారికి మాత్రమే ల్యాండ్‌లైన్ సేవలను పొందే అవకాశం ఉంది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ల్యాండ్‌లైన్ సేవలు

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ల్యాండ్‌లైన్ సేవలు

టాటా స్కై తన బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు ఇప్పుడు ల్యాండ్‌లైన్ సేవలను అందిస్తోంది. ఇది అన్ని ప్లాన్‌లలో లభిస్తుంది. కానీ ప్రతి ప్లాన్ దీన్ని ఉచితంగా అందించదు. కాబట్టి టాటా స్కై విభిన్న ధరల వద్ద వేరు వేరు చెల్లుబాటులతో బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తుంది. ఇందులో 1 నెల, 3 నెలలు, 6 నెలలు మరియు 12 నెలలు వాలిడిటీతో అపరిమిత ప్లాన్‌లు ఉన్నాయి. కాబట్టి అన్ని 1 నెల మరియు 3 నెలల ప్లాన్‌లతో వినియోగదారులకు ల్యాండ్‌లైన్ యొక్క సేవలు కూడా పొందవచ్చు కాని దాని కోసం వారు తమ ప్లాన్ యొక్క బేస్ ఛార్జీలపై నెలకు 100 రూపాయలు అదనంగా చెల్లించవలసి ఉంటుంది.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ల్యాండ్‌లైన్ సేవలు ఉచితంగా పొందే విధానం

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ల్యాండ్‌లైన్ సేవలు ఉచితంగా పొందే విధానం

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ యొక్క అపరిమిత ప్లాన్‌లలో 6నెలలు మరియు 12 నెలల చెల్లుబాటుతో వచ్చే అన్ని అపరిమిత ప్లాన్‌లను ఎంచుకునే వినియోగదారులకు ఉచితంగా ల్యాండ్‌లైన్ సేవలను అందిస్తుంది. కాబట్టి దీర్ఘకాలిక ప్లాన్‌లను ఎంచుకునే వినియోగదారులకు ల్యాండ్‌లైన్ సర్వీస్ యొక్క ప్రయోజనం ఉచితంగా లభిస్తుంది.

 

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ vs ఎయిర్‌టెల్, జియో బ్రాడ్‌బ్యాండ్

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ vs ఎయిర్‌టెల్, జియో బ్రాడ్‌బ్యాండ్

ఎయిర్‌టెల్ మరియు జియో తమ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో అందించే ప్రయోజనాలతో పోలిస్తే ఇప్పటికీ దీని యొక్క ప్రయోజనాలు సమానంగా లేవు. రెండు కంపెనీలు అందించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో ల్యాండ్‌లైన్ సేవలు ఉచితంగా చేర్చబడనందున మరియు వారి కంటే చౌకైన ధరల వద్ద ప్లాన్‌లను టాటా స్కై కలిగి ఉంది. 1 లేదా 3 నెలల చెల్లుబాటుతో లభించే అపరిమిత ప్లాన్‌ను ఎంచుకుంటే కనుక ల్యాండ్‌లైన్ సేవల కోసం కస్టమర్ రూ.100 అదనపు నెలవారీ అద్దె చెల్లించవలసి ఉంటుంది.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ యొక్క అపరిమిత డేటా ప్లాన్‌లు

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ యొక్క అపరిమిత డేటా ప్లాన్‌లు

టాటా స్కై ఇప్పుడు తన బ్రాడ్‌బ్యాండ్ యొక్క సమర్పణలలో కూడా చాలా మార్పులు చేసింది. ఇందులో మొదటిది ఇప్పుడు భారతదేశంలో తన ‘స్థిర డేటా ప్లాన్'ను అందించడం. అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ సమర్పణల విషయానికొస్తే పెద్ద మార్పులను చేసింది. ఇప్పుడు వినియోగదారులు రెండు నెలల చెల్లుబాటుతో అపరిమిత ప్లాన్లను పొందడానికి కూడా అవసరమైన ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒక ప్లాన్ 850 రూపాయల ధర వద్ద వస్తుంది. ఇది వినియోగదారులకు 100 Mbps ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుంది. మరొక ప్లాన్ రూ.950 ధర వద్ద 150Mbps వేగంతో వస్తుంది. అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు ఇప్పటికీ FUP పరిమితితో వస్తాయి. అన్ని అపరిమిత ప్లాన్‌లు 3.3TB డేటా యొక్క FUP పరిమితితో వస్తాయి. ఆ తర్వాత ఇంటర్నెట్ వేగం 3Mbps‌కు తగ్గించబడుతుంది.

Best Mobiles in India

English summary
Tata Sky Broadband Provide Free Landline Service!! But Only Selective Plans
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X