Home
News

Tata Sky Broadband అపరిమిత డేటా ప్లాన్‌ల ప్రియులకు షాకింగ్ న్యూస్

బ్రాడ్‌బ్యాండ్ రంగంలోకి కొంతకాలం కిందట టాటా స్కై ప్రవేశించింది. 2015 లో స్థాపించబడిన టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ డిటిహెచ్ సర్వీస్ వలె ఇప్పుడు భారతదేశంలోని 22 నగరాలకు విస్తరించింది. టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్‌ను ప్రజలు ఇష్టపడటానికి గల కారణం వారు అందిస్తున్న అద్భుతమైన ప్లాన్లు మిగిలిన వారితో పోలిస్తే ఖరీదైనవి కాకపోవడం.

టాటా స్కై డేటా ప్లాన్

ముఖ్యంగా ఇది అందిస్తున్న అపరిమిత డేటా ప్లాన్ మరింత ప్రత్యేకంగా ఉన్నాయి. టాటా స్కై రూ.900 ప్రారంభ ధర వద్ద 25 Mbps వేగంతో అపరిమిత డేటాను ఒక నెల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఈ ప్లాన్‌తో వచ్చే ప్రత్యేక ఆఫర్‌లు ఏవీ లేవు. అలాగే దీనిపై అదనంగా 18% GST ఉంటుంది అని మరచిపోకండి. అదేవిధంగా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కూడా అపరిమిత డేటా ప్లాన్‌లపై 3.3 TB ఎఫ్‌యుపి పరిమితిని కలిగి ఉంది.

 

 

 

 

FUP పరిమితితో అపరిమిత ప్లాన్‌లు

FUP పరిమితితో అపరిమిత ప్లాన్‌లు

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ఇప్పటి నుండి తన అపరిమిత డేటా ప్లాన్‌లపై FUP పరిమితులను ఉంచబోతోంది. ఈ విషయాన్ని కంపెనీ ఇటీవలే తన వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసింది. అపరిమిత డేటా ప్లాన్‌లు త్వరలో నెలకు 1500GB FUP పరిమితితో వస్తాయి. దీని తర్వాత డేటా యొక్క వేగం తగ్గించబడుతుంది. 1500GB FUP పరిమితిని చేరుకున్న తరువాత మిగిలిన రోజులలో దాని యొక్క డేటా వేగం 2 Mbps కి పడిపోతుంది. ఈ పరిమితి దాని అపరిమిత డేటా ప్లాన్‌లన్నింటిపై అమలు కానుంది.

ఈ నిర్ణయం వెనుక గల నిర్దిష్ట కారణాలు

ఈ నిర్ణయం వెనుక గల నిర్దిష్ట కారణాలు

ప్రస్తుత పరిస్థితుల కారణంగా చాలా మంది ఇంటి వద్ద నుండి పని చేయడం వల్ల ప్రజలలో ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగింది. ఇంటర్నెట్ సదుపాయాలపై లోడ్ చాలా భారీగా ఉంది. దానిని ఎదుర్కోవటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ పరిమితి తరువాత సంస్థ యొక్క బ్యాండ్‌విడ్త్ యొక్క ఒత్తిడి నుండి కొంత ఉపశమనం పొందుతుందని భావిస్తున్నారు. ఇందులో గమనించదగ్గ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆంక్షలు ఉన్నప్పటికీ టాటా స్కై దాని ప్లాన్ ల యొక్క ధరలలో మాత్రం ఎటువంటి మార్పులను తీసుకురాలేదు.

 

 

బ్రాడ్‌బ్యాండ్‌

కొంతమంది వినియోగదారులకు ఇప్పుడు ఇది కొద్దిగా ఖరీదైనదిగా అనిపించవచ్చు. బ్రాడ్‌బ్యాండ్‌తో పాటు ల్యాండ్‌లైన్ సేవను కూడా కోరుకునే వినియోగదారుల కోసం టాటా స్కై వారు వినియోగదారులకు ల్యాండ్‌లైన్‌ను అందించబోతున్నారు. ఇది వారికి అపరిమిత కాల్ సదుపాయాలను ఇవ్వబోతున్నారని సూచించింది. టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ డిమాండ్ పరిమితుల తర్వాత ఎలా మారుతుందో చూడటం ఆసక్తికరంగా మారింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Tata Sky Broadband Unlimited Plans Now Comes With 1500GB FUP Limit
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X