Home
News

Tata Sky బ్రాడ్‌బ్యాండ్ లాంగ్-టర్మ్ ప్లాన్‌ల మీద ఊహించని డిస్కౌంట్ ఆఫర్స్...

డిటిహెచ్ రంగంలో అధిక యూజర్ కలిగిన టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ రంగంలోకి కూడా ప్రవేశించిన తరువాత తన యొక్క వినియోగదారులను ఆకట్టుకోవడానికి దీర్ఘకాలిక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల ఎంపిక మీద వినియోగదారులు రూ.2,400 వరకు ఆదా చేసే గొప్ప అవకాశాన్ని అందిస్తున్నది. ఇటీవల టాటా స్కై తన యొక్క బ్రాడ్‌బ్యాండ్ సమర్పణలను అన్నిటిని అప్ డేట్ చేసింది. దీనితో పాటు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) దాని బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో వినియోగదారుల కోసం ల్యాండ్‌లైన్ కనెక్షన్‌ను ఉచితంగా అందిస్తున్నది. టాటా స్కై ఇప్పుడు తన వినియోగదారులకు విభిన్న ప్రయోజనాలతో అనేక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తుంది. వినియోగదారులు దీర్ఘకాలిక ప్లాన్‌లను ఎంచుకున్నప్పుడు అధిక మొత్తంలో చాలా వరకు డబ్బును ఆదా చేయవచ్చు. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టాటా స్కై దీర్ఘకాలిక ప్లాన్‌ల పూర్తి వివరాలు

టాటా స్కై దీర్ఘకాలిక ప్లాన్‌ల పూర్తి వివరాలు

టాటా స్కై తన దీర్ఘకాలిక ప్లాన్‌లను ఎంచుకున్న వినియోగదారులకు ప్రస్తుతం డిస్కౌంట్ అందిస్తుంది. కొత్త బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను పొందాలనుకునే వినియోగదారులు 100 Mbps నుండి 300 Mbps వేగంతో లభించే నాలుగు విభిన్న నెలవారీ ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. ఇందులో 300Mbps వేగంతో లభించే ప్లాన్ విషయానికి వస్తే యూజర్లు దీనిని నెలకు రూ.1,500 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. కానీ దీర్ఘకాలిక చెల్లుబాటుతో ఈ ప్లాన్ యొక్క ధరలో మార్పులు ఉంటాయి. వాస్తవానికి తక్కువ ధరను కలిగి ఉంటాయి. వినియోగదారులు ఈ ప్లాన్‌ను 3 నెలల చెల్లుబాటుకు కొనుగోలు చేసినప్పుడు ధరలో మార్పు ఉండదు. అతను 3 నెలలకు 4,500 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఇది నెలకు 1,500 రూపాయలకు సమానం.

 

టాటా స్కై దీర్ఘకాలిక ప్లాన్‌లతో లభించే డిస్కౌంట్

టాటా స్కై దీర్ఘకాలిక ప్లాన్‌లతో లభించే డిస్కౌంట్

300Mbps వేగంతో లభించే టాటా స్కై యొక్క దీర్ఘకాలిక ప్లాన్‌ను 6 నెలల చెల్లుబాటు కాలంతో ఎంచుకునే వినియోగదారులు ఈ ప్లాన్ కోసం రూ.8,400 చెల్లించవలసి ఉంటుంది. ఇది నెలకు 1,400 రూపాయలకు సమానం. కాబట్టి నెలకు రూ.100 తగ్గింపు లభిస్తుంది. అదే ఈ ప్లాన్‌ను 12 నెలల చెల్లుబాటుకు కొనుగోలు చేస్తే కనుక వినియోగదారులకు రూ.2,400 తగ్గింపు లభిస్తుంది. అంటే ఈ ప్లాన్‌ను 12 నెలల కోసం కొనుగోలు చేసేటప్పుడు వారు మొత్తం రూ.15,600 చెల్లించాలి. సాధారణంగా ఈ ప్లాన్ నెలవారీ ప్రాతిపదికన కొనుగోలు చేస్తే కనుక ఈ ప్లాన్ కోసం వినియోగదారులు 12 నెలల్లో రూ.18,000 చెల్లించాల్సి ఉంటుంది.

టాటా స్కై 150Mbps దీర్ఘకాలిక ప్లాన్‌పై డిస్కౌంట్ ఆఫర్

టాటా స్కై 150Mbps దీర్ఘకాలిక ప్లాన్‌పై డిస్కౌంట్ ఆఫర్

టాటా స్కై నుండి లభించే డిస్కౌంట్ ఆఫర్‌ ఇతర బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో కూడా లభిస్తుంది. టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ నుండి లభించే 150Mbps స్పీడ్ ప్లాన్ నెలకు రూ.950 ధర వద్ద, 3 నెలలకు రూ.2,700 (నెలకు రూ .50 తగ్గింపును ఇస్తుంది), 6 నెలలకు రూ .5,100 (నెలకు రూ .100 తగ్గింపును ఇస్తుంది),చివరిగా 12 నెలల చెల్లుబాటు కాలంతో నెలకు రూ.150 తగ్గింపుతో రూ.9,600 ధర వద్ద లభిస్తుంది.

టాటా స్కై 100Mbps దీర్ఘకాలిక ప్లాన్‌పై డిస్కౌంట్ ఆఫర్

టాటా స్కై 100Mbps దీర్ఘకాలిక ప్లాన్‌పై డిస్కౌంట్ ఆఫర్

100Mbps స్పీడ్‌తో వచ్చే టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ యొక్క బేస్ ప్లాన్ నెలకు రూ.850 ధర వద్ద వస్తుంది. కానీ దీనిని 3 నెలలకు కొనుగోలు చేసినప్పుడు దాని ధర రూ.2,400. అంటే వినియోగదారులు దీని మీద నెలకు రూ.50 తగ్గింపు లభిస్తుంది. అలాగే 6 నెలల చెల్లుబాటు కాలానికి రూ.5,100 ధర వద్ద పొందవచ్చు. అంటే నెలకు రూ.100 తగ్గింపు లభిస్తుంది. చివరిగా 12 నెలల చెల్లుబాటు కాలానికి నెలకు రూ .150 తగ్గింపుతో వినియోగదారులు రూ.8,400 చెల్లించి కొనుగోలు చేయవచ్చు.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ 100Mbps దీర్ఘకాలిక ప్లాన్‌పై డిస్కౌంట్ ఆఫర్

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ 100Mbps దీర్ఘకాలిక ప్లాన్‌పై డిస్కౌంట్ ఆఫర్

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ యొక్క చివరి ప్లాన్ 200 Mbps వేగంతో నెలకు రూ.1,050 ధర వద్ద లభిస్తుంది. దీనిని 3 నెలలకు రూ.3,000 ధర వద్ద పొందవచ్చు అంటే నెలకు రూ.50 తగ్గింపుతో వస్తుంది. కానీ 6 నెలల ప్లాన్ మీద డిస్కౌంట్ నెలకు రూ.125లుగా ఉంటుంది. ఈ చెల్లుబాటు కాలానికి అయ్యే ఖర్చు 5,550 రూపాయలు. చివరగా 12 నెలల చెల్లుబాటు కాలానికి రూ.15,600 ఖర్చు చేయవలసి ఉంటుంది. అంటే నెలకు రూ.200 తగ్గింపు లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Tata Sky Broadband Users Get Unexpected Discount Offers on Long Term Plans
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X