టాటా స్కై యూజర్లకి అలర్ట్, ఛానల్ ప్యాక్స్ ధరలు మారాయి
మీరు టాటా స్కై వాడుతున్నారా.. అయితే కంపెనీ మీకు అలర్ట్ మెసేజ్ జారీ చేసింది. దీంతో పాటు కంపెనీ శుభవార్తను కూడా అందించింది. కంపెనీ పలు ఛానళ్ల ధరను సవరించింది. దాదాపు 25 రీజినల్ ఛానల్ ప్యాక్స్ ధరల్లో మ
మీరు టాటా స్కై వాడుతున్నారా.. అయితే కంపెనీ మీకు అలర్ట్ మెసేజ్ జారీ చేసింది. దీంతో పాటు కంపెనీ శుభవార్తను కూడా అందించింది. కంపెనీ పలు ఛానళ్ల ధరను సవరించింది. దాదాపు 25 రీజినల్ ఛానల్ ప్యాక్స్ ధరల్లో మార్పులు చేర్పులు చేసింది. ధర సవరించిన ప్యాక్స్‌లో గుజరాతీ, హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ లాంగ్వేజ్‌లకు చెందిన పలు ప్యాక్స్ ఉన్నాయి. ఛానల్ ప్యాక్స్ ధర సవరింపుతో కొన్నింటి ధర పెరిగింది.

అలాగే మరికొన్నింటి ధర తగ్గింది. హెచ్‌డీ, ఎస్‌డీ సెట్ టాప్ బాక్స్ ధర తగ్గించిన నేపథ్యంలో కంపెనీ చానల్ ప్యాక్స్ ధర సవరింపు ప్రాధాన్యత సంతరించుకుంది. టాటా స్కై వెబ్‌సైట్ ప్రకారం.. గుజరాతీ రీజినల్ ప్యాక్ ధర రూ.7 నుంచి రూ.8.49కు పెరిగింది. తమిళ్ ఫ్యామిలీ స్పోర్ట్స్ ప్యాక్ ధర రూ.267 నుంచి రూ.254.27కు క్షీణించింది. తెలుగు ఫ్యామిలీ స్పోర్ట్స్ ప్యాక్ ధర రూ.285 నుంచి రూ.282ను తగ్గింది.

అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ఉచితం
ఇటీవల కొత్త సబ్‌స్క్రైబర్లను ఆకట్టుకునేందుకు టాటా స్కై ప్రయత్నిస్తోంది.ఇందులో భాగంగాలనే పలు మార్పులు చేర్పులు చేస్తోంది. కొద్ది రోజుల క్రితం అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ఉచితంగా ఆఫర్ చేస్తూ టాటా బింజ్ సర్వీస్ ప్రారంభించింది. దాంతో పాటు ఇటీవల హెచ్‌డీ, ఎస్‌డీ సెట్-టాప్ బాక్సుల ధరల్ని టాటా స్కై తగ్గించింది.

ప్లాన్స్ ధరల్లో మార్పులు
ఇప్పుడు ప్లాన్స్ ధరల్లో మార్పులు చేసింది. మారిన ప్లాన్స్‌లో తెలుగు ఫ్యామిలీ స్పోర్ట్స్, తమిళ్ ఫ్యామిలీ స్పోర్ట్స్, కన్నడ ఫ్యామిలీ స్పోర్ట్స్, గుజరాతీ రీజనల్, హిందీ స్టార్టర్ హెచ్‌డీ లాంటి ప్యాక్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్యాక్స్ ధరల్ని మార్చింది. వీటిలో చాలావరకు ప్యాక్స్ ధరలు తగ్గాయి. గతంలో తెలుగు ఫ్యామిలీ స్పోర్ట్స్ ప్యాక్ ధర రూ.285 ఉండేది. ప్రస్తుతం ఈ ప్యాక్ ధర రూ.282గా ఉంది

ప్రస్తుతం టాటా స్కై తెలుగు రీజనల్ ఛానెల్ ప్యాక్ ధరలు
తెలుగు ఫ్యామిలీ స్పోర్ట్స్ ప్యాక్- రూ.282
తెలుగు ఫ్యామిలీ స్పోర్ట్స్ హెచ్‌డీ ప్యాక్- రూ.434
తెలుగు ఫ్యామిలీ కిడ్స్ స్పోర్ట్స్ ప్యాక్- రూ.297.65
తెలుగు ఫ్యామిలీ కిడ్స్ స్పోర్ట్స్ హెచ్‌డీ ప్యాక్- రూ.449.87
తెలుగు ప్రీమియం స్పోర్ట్స్ ఇంగ్లీష్ ప్యాక్- రూ. 443.20
తమిళ్ తెలుగు బేసిక్ ప్యాక్- రూ.237.75
తెలుగు, కన్నడ బేసిక్ ప్యాక్ రూ.235.82

ఏదైనా ప్యాక్ సబ్‌స్క్రైబ్ చేసుకున్నట్టైతే
యూజర్లు ఇందులో ఏదైనా ప్యాక్ సబ్‌స్క్రైబ్ చేసుకున్నట్టైతే మారిన ధరలకే ప్లాన్ తీసుకోవచ్చు. ఇక బ్రాడ్‌క్యాస్టర్ ప్యాక్స్‌ని రూ.49 నుంచి అందిస్తోంది టాటా స్కై. ఒక్క టాటా స్కై మాత్రమే కాదు ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ, డీ2హెచ్, డిష్ టీవీ లాంటి కంపెనీలు కూడా సబ్‌స్క్రైబర్లను పెంచుకునేందుకు సరికొత్త ఆఫర్లతో వస్తున్నాయి.
ఒక నెల ఉచిత సేవలు,
ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం యాన్వల్ ఫ్లెక్సి ప్లాన్ రూపంలో ఒక నెల ఉచిత సేవలు అందిస్తూ న్యూస్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అంటే మీరు 12 నెలలకు డబ్బులు చెల్లిస్తే.. 1 నెల బిల్లు మొత్తాన్ని కంపెనీ మీ అకౌంట్‌లో ఉచితంగా జమ చేస్తుంది.

నెలవారీ బిల్లుకు 12 రెట్లు
టాటా స్కై ఫ్లెక్సి యాన్వల్ ప్లాన్ విషయానికి వస్తే యూజర్లు నెలవారీ బిల్లుకు 12 రెట్లు అధిక మొత్తాన్ని వారి అకౌంట్‌లో కలిగి ఉండాలి. అప్పుడు ఫ్లెక్సి ప్లాన్ పొందొచ్చు. ఉదాహరణకు మీ నెలవారీ బిల్లు రూ.200 అనుకుంటే.. మీ అకౌంట్‌లో రూ.2,400 బ్యాలెన్స్ కలిగి ఉండాలి. అప్పుడు టాటా స్కై యాన్వుల్ ఫ్లెక్సి ప్లాన్ సదుపాయాలు లభిస్తాయి. నెలవారీ బిల్లుకు 12 రెట్లు యూజర్లు వారి అకౌంట్‌లో రూ.2,400 బ్యాలెన్స్ కలిగి ఉంటే కంపెనీ వారి అకౌంట్‌లో రూ.200 జమచేస్తుంది.
బ్యాలన్స్ వివరాలు,
ప్లాన్లను ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. అయితే బ్యాలెన్స్ మాత్రం 12 నెలలకు పైనే ఉండేలా చూసుకోవాలి. ప్లాన్‌ను సవరించేటప్పుడు నెలవారీ బిల్లు రూ.300 అయితే.. అప్పుడు మీ అకౌంట్‌లో రూ.3,600 ఉండేలా చూసుకోవాలి. అప్పుడే యాన్వల్ ఫ్లెక్సి ప్లాన్ ప్రయోజనాలు లభిస్తాయి. బోనస్ అమౌంట్ ప్లాన్ చివరి రోజు అకౌంట్లో జమవుతుంది.


Click it and Unblock the Notifications