టాటా స్కై, డిష్ టివి,D2h ఆపరేటర్ ఛానెళ్లలో "రాధే" కొత్త సినిమా
టాటా స్కై, ఎయిర్‌టెల్ డిజిటల్ టివి, డి 2 హెచ్ మరియు డిష్ టివిలతో సహా దేశంలోని మరిన్ని ప్రముఖ డిటిహెచ్ ఆపరేటర్లు తమ యొక్క వినియోగదారులకు బాలీవుడ్ యొక్క కొత్త సినిమా "రాధే" ను ఇంటి వద్దనే ఉండి చూడటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ సినిమాను చూడటానికి మీరు ZEE5 ప్రీమియం నుండి స్వతంత్ర సభ్యత్వాన్ని కొనుగోలు చేయనవసరం లేదు. టాటా స్కై, డిష్ టివి, డి 2 హెచ్, ఎయిర్‌టెల్ డిజిటల్ టివి నుండి యాక్టివ్ సెట్-టాప్ బాక్స్ (STB) కలిగి ఉంటే యూజర్లు తమ టీవీల్లో నేరుగా ఈ సినిమాను చూసే సౌలభ్యంను పొందవచ్చు. కానీ డిటిహెచ్ ఆపరేటర్లు ఈ సినిమాను వేర్వేరు ఛానెళ్లలో అందిస్తారు. ఈ ఛానెల్ నెంబర్ల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రాధే సినిమాను డిటిహెచ్ ఆపరేటర్లు ప్రసారం చేస్తున్న ఛానల్ నంబర్లు
టాటా స్కై యూజర్లు రాధే సినిమాను 252, 253, 254, మరియు 255 ఛానల్ నంబర్లలో చూడవచ్చు. D2h వినియోగదారులు (స్క్రీన్ 1) లో భాగంగా 917 HD ఛానల్ లో మరియు (స్క్రీన్ 2) లో భాగంగా 199 SD ఛానల్లలో చూడవచ్చు. అలాగే డిష్ టీవీ వినియోగదారులు HD ఛానల్ 302, SD ఛానల్ 303 (స్క్రీన్ 1) మరియు SD ఛానల్ 301 (స్క్రీన్ 2) లలో నావిగేట్ చేయవచ్చు. చివరగా ఎయిర్టెల్ డిజిటల్ టీవీ వినియోగదారులు ఛానల్ నంబర్ 269, 270, 499 మరియు 500 లలో రాధే సినిమాను నావిగేట్ చేయవచ్చు.

ఈ డిటిహెచ్ ఆపరేటర్ యూజర్లు తమ యొక్క ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ కొత్త సినిమాను చూడాలనుకుంటే కనుక వారు నామమాత్రపు ఛార్జీలను చెల్లించాలి. ఇది చలన చిత్రానికి టికెట్ కొనుగోలు చేసినట్లే. కానీ ఈసారి మాత్రమే మీ యొక్క స్క్రీన్ లో సినిమా ప్రసారం అవుతుంది. బ్రాడ్‌కాస్టర్ మీ DTH ఆపరేటర్‌గా ఉంటుంది. మీకు SMS ద్వారా సినిమా చూడగలిగే టైమ్ స్లాట్ కేటాయించబడుతుంది. వేర్వేరు డిటిహెచ్ ఆపరేటర్ల కోసం సినిమాను బుక్ చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఈ సినిమా బుకింగ్‌లో మీకు సహాయం చేయడానికి మీరు సంస్థ యొక్క కస్టమర్ కేర్ బృందానికి కాల్ చేయవచ్చు లేదా అందుబాటులో ఉన్న QR కోడ్‌లను లేదా DTH ఆపరేటర్ యొక్క యాప్/ వెబ్‌సైట్‌ను ఉపయోగించవచ్చు.

యూజర్లు వారి యొక్క స్మార్ట్‌ఫోన్‌లలో డిటిహెచ్ ఆపరేటర్ యొక్క యాప్ ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా లేదా వెబ్‌సైట్‌కు వెళ్లడం సినిమాను బుక్ చేసుకోవచ్చు. అలాగే Zee5 ప్లాట్‌ఫాం యొక్క ప్రీమియం సభ్యత్వాన్ని కొనుగోలు చేయడం ద్వారా కూడా మీరు ZEE5 యొక్క యాప్ లో రాధే సినిమాను చూడవచ్చు. ZEE5 యొక్క ప్రీమియం సభ్యత్వాన్ని 12 నెలలకు గాను 499 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఇది ప్రస్తుతానికి తగ్గింపు ధర మాత్రమే. సాధారణంగా ZEE5 ప్లాట్‌ఫాం యొక్క ప్రీమియం సభ్యత్వం 1,248 రూపాయలకు వస్తుంది. రాధే సినిమా అనేది సల్మాన్ ఖాన్ నటించిన కొత్త సినిమా. ఇది వినోదం మరియు మంచి యాక్షన్ విభాగంలో విడుదలైంది.


Click it and Unblock the Notifications








