Home
News

Tata Sky Rs.500 ధర లోపు అందిస్తున్న ఉత్తమమైన DTH ప్యాక్‌లు ఇవే!!!

ఇండియాలోని డిటిహెచ్ రంగంలో అధిక మంది వినియోగదారులను కలిగిన ప్రముఖ డిటిహెచ్ ఆపరేటర్ టాటా స్కై తన వినియోగదారులు అన్ని రకాల విభాగాలలో ఎంచుకోవడానికి అనేక డిటిహెచ్ ప్యాక్‌లను అందిస్తున్నది. దేశంలో అందరూ ఒకే రకంగా ఉండరు కావున ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండేలా డిటిహెచ్ సేవలను అందిస్తున్నది. వివిధ ప్రాంతాలలో వివిధ భాషలలో లభించే అనేక ఛానెల్ ప్యాక్‌లలో SD మరియు HD ఛానెల్‌ల కలయికతో వినియోగదారులు తమ అభిమాన కంటెంట్‌ను గొప్ప నాణ్యతతో వినియోగదారులకు తక్కువ ధర వద్దనే అందిస్తున్నది. రూ.500 ధర లోపు టాటా స్కై అందించే ఉత్తమమైన ఛానల్ ప్యాక్‌ల జాబితాను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టాటా స్కై రూ.500 లోపు బెస్ట్ డిటిహెచ్ ప్యాక్‌లు

టాటా స్కై రూ.500 లోపు బెస్ట్ డిటిహెచ్ ప్యాక్‌లు

500 రూపాయల ధర లోపు లభించే టాటా స్కై యొక్క మొదటి డిటిహెచ్ ప్యాక్ ‘మరాఠీ హిందీ ఫ్యామిలీ కిడ్స్ స్పోర్ట్స్ HD' ప్యాక్. ఈ ప్యాక్  నెలకు రూ.478.30 ధర వద్ద కస్టమర్‌లకు HD మరియు SD ఛానెల్‌ల మిశ్రమంతో తీసుకువస్తున్నది. ఖచ్చితంగా చెప్పాలంటే కొన్ని FTA ఛానెల్‌లతో పాటు 41 హెచ్‌డి ఛానెల్‌లు, 50 ఎస్‌డి ఛానెల్‌లను ఇందులో అందిస్తుంది. HD ఛానెల్‌లలో ఉత్తమమైన హిందీ మరియు మరాఠీ ఛానెల్‌లను పొందుతారు. సినిమాలు మరియు క్రీడల కోసం మీరు HD లో కొన్ని ఉత్తమ ఛానెల్‌లను పొందుతారు. ఇందులో పిల్లల కోసం ఎక్కువ ఛానెల్‌లు ఉన్నాయి.

టాటా స్కై తెలుగు ఫ్యామిలీ కిడ్స్ స్పోర్ట్స్ HD ప్యాక్‌ వివరాలు

టాటా స్కై తెలుగు ఫ్యామిలీ కిడ్స్ స్పోర్ట్స్ HD ప్యాక్‌ వివరాలు

టాటా స్కై తక్కువ ధరలో అందిస్తున్న రెండవ ప్లాన్‌ విషయానికి వస్తే ‘తెలుగు ఫ్యామిలీ కిడ్స్ స్పోర్ట్స్ హెచ్‌డీ' ప్యాక్‌ను నెలకు రూ.441.96 ధర వద్ద అందిస్తున్నది. ఇది ఎక్కువగా మ్యూజిక్, గేమ్స్ , సినిమాలు, కిడ్స్ మరియు లైఫ్ స్టైల్ ఛానెల్‌లను అందిస్తుంది. ఇందులో మొత్తంగా 31 హెచ్‌డి, 50 ఎస్‌డి ఛానెల్‌లు ఉన్నాయి. ఈ ప్యాక్‌లో తెలుగు ప్రాంతీయ ఛానెల్‌లు అధికంగా ఉన్నాయి.

టాటా స్కై తెలుగు మలయాళ బేసిక్ HD ప్యాక్‌ వివరాలు

టాటా స్కై తెలుగు మలయాళ బేసిక్ HD ప్యాక్‌ వివరాలు

తెలుగు ఛానెల్‌లతో పాటుగా మలయాళ ఛానెల్‌లను కోరుకునే వారికి ఈ ప్యాక్ సరిగ్గా సరిపోతుంది. ‘తెలుగు మలయాళ బేసిక్ హెచ్‌డీ' ప్యాక్ నెలకు రూ.343.49 ధర వద్ద వస్తుంది. ఈ ఛానల్ ప్యాక్ మొత్తంగా 19 హెచ్‌డి ఛానెల్‌లను మరియు 43 ఎస్‌డి ఛానెల్‌లతో వస్తుంది. మీరు సంగీతం ఛానెల్‌లతో పాటు అనేక తెలుగు మరియు మలయాళ ప్రాంతీయ ఛానెల్‌లను మరియు హిందీ ఛానెల్‌ను పుష్కలంగా పొందుతారు. HD స్పోర్ట్స్ ఛానెల్స్ కూడా ఉన్నాయి.

టాటా స్కై తెలుగు బేసిక్ HD ప్యాక్‌ వివరాలు

టాటా స్కై తెలుగు బేసిక్ HD ప్యాక్‌ వివరాలు

రూ.500 ధర లోపు టాటా స్కై అందించే ఛానల్ ప్యాక్‌ల జాబితాలో అతి తక్కువ ధరను కలిగి ఉండేది ‘తెలుగు బేసిక్ హెచ్‌డి' ప్యాక్. ఇది తెలుగు ప్రాంతీయ ఛానెళ్లను అధికంగా కలిగి ఉంటుంది. వీటితో పాటుగా హిందీ సినిమాలు, వార్తలు మరియు ఎంటర్టైన్మెంట్ ఛానెల్‌లు కూడా ఉన్నాయి. ప్రజలకు జ్ఞానం మరియు జీవనశైలి మార్గాలను అందించే ఛానెల్‌లు కూడా లభిస్తాయి. ఈ ఛానల్ ప్యాక్ యొక్క ధర నెలకు రూ.208.98. ఇది మొత్తంగా 15SD ఛానెళ్లతో పాటు 11HD ఛానెల్‌లను అందిస్తుంది.

టాటా స్కై కన్నడ ఫ్యామిలీ కిడ్స్ స్పోర్ట్స్ HD ప్యాక్‌ వివరాలు

టాటా స్కై కన్నడ ఫ్యామిలీ కిడ్స్ స్పోర్ట్స్ HD ప్యాక్‌ వివరాలు

టాటా స్కై యొక్క ‘కన్నడ ఫ్యామిలీ కిడ్స్ స్పోర్ట్స్ హెచ్‌డీ' ప్యాక్ నెలకు రూ.409.51 ధర వద్ద లభిస్తుంది. ఈ ఛానల్ ప్యాక్ అధికంగా కన్నడ ప్రాంతీయ ఛానెళ్లను అందిస్తుంది. దీనితో పాటుగా హిందీ ఛానెల్‌లను కూడా అధికంగా అందిస్తుంది. సినిమాలు, వార్తలు, వినోదం, కిడ్స్, గేమ్స్ వంటి ఇంగ్లీష్ ఛానెల్‌లు కూడా లభిస్తాయి. ఈ ప్యాక్ మొత్తంగా 28 హెచ్‌డి ఛానెల్‌లు, 45 ఎస్‌డి ఛానెల్‌లను అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Tata Sky DTH Plans Under Rs. 500: Here are Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X