టాటా స్కైలో ఇంగ్లీష్ మూవీ ఛానెల్‌లను కొత్త EPG స్లాట్‌లకు తరలించారు!!!

|

భారతదేశంలో అతిపెద్ద డైరెక్ట్-టు-హోమ్ (డిటిహెచ్) ఆపరేటర్ గా ఉన్న టాటా స్కై తన యొక్క ప్లాట్‌ఫామ్‌లో ఇప్పుడు 18 ఇంగ్లీష్ మూవీ ఛానెళ్ల ఎలక్ట్రానిక్ ప్రోగ్రామింగ్ గైడ్ (EPG) నంబర్లను కొత్త స్లాట్‌లకు సవరించింది. సెప్టెంబరు ఆరంభంలో కూడా ఈ ఆపరేటర్ తన ప్లాట్‌ఫామ్‌లోని తమిళ, తెలుగు, హిందీ ప్రాంతీయ వివిధ ఛానెల్‌ల ఇపిజి నంబర్లను సవరించారు. టాటా స్కై తన వెబ్ పోర్టల్‌లో మరో 13 ఛానెల్‌లకు EPG పునర్విమర్శలను కలిగి ఉంటుందని హైలైట్ చేసింది. EPG పునర్విమర్శలను కలిగి ఉన్న 18 ఇంగ్లీష్ మూవీ ఛానెల్‌ల వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టాటా స్కై సవరించిన 18 ఇంగ్లీష్ మూవీ ఛానెళ్ల EPG నంబర్ల వివరాలు
 

టాటా స్కై సవరించిన 18 ఇంగ్లీష్ మూవీ ఛానెళ్ల EPG నంబర్ల వివరాలు

భారతదేశంలో అతిపెద్ద డిటిహెచ్ ఆపరేటర్ టాటా స్కై ఇటీవల స్టార్ మూవీస్, సోనీ పిక్స్, HBO మరియు మూవీస్ నౌ ఛానెల్‌లతో పాటుగా మరో 18 ఇంగ్లీష్ మూవీ ఛానెల్‌ల యొక్క EPG స్లాట్‌లను సవరించింది. స్టార్ మూవీస్ యొక్క పాత EPG 355 నెంబర్ నుండి 403 యొక్క కొత్త EPGకి సవరించబడింది. సోనీ పిక్స్ 407 యొక్క కొత్త EPG స్లాట్కు తరలించబడింది. అదేవిధంగా HBO మరియు మూవీస్ నౌ ఛానల్లు దాని పాత EPG నెంబర్లు 364 మరియు 377 నుండి వరుసగా 410 మరియు 421 యొక్క కొత్త EPG కు సవరించబడ్డాయి.

Also Read: Google Photos లోని మొత్తం డేటాను PC / ల్యాప్‌టాప్ లో డౌన్‌లోడ్ చేయడం ఎలా?

టాటా స్కై EPG నెంబర్ల సవరణలు

టాటా స్కై EPG నెంబర్ల సవరణలు

టాటా స్కై డిటిహెచ్ ఆపరేటర్ WB, & ఫ్లిక్స్, MNX, రోమెడీ నౌతో పాటు స్టార్ మూవీస్ హెచ్‌డి, సోనీ పిక్స్ హెచ్‌డి, HBO హెచ్‌డి మరియు మూవీస్ నౌ హెచ్‌డి యొక్క ఇతర ఇంగ్లీష్ మూవీ ఛానెల్‌ల EPG నెంబర్లను కూడా టాటా స్కై సవరించింది. ఇంకా స్టార్ మూవీస్ సెలెక్ట్ HD, MN + HD, MNX HD, & ప్రైవ్ HD మరియు రోమెడీ నౌ HD కూడా దాని EPG నెంబర్ లను సవరించినట్లు హైలైట్ చేసింది.

టాటా స్కైలో 13 కిడ్స్ ఛానెల్‌ల EPG స్లాట్‌ల సవరణ
 

టాటా స్కైలో 13 కిడ్స్ ఛానెల్‌ల EPG స్లాట్‌ల సవరణ

టాటా స్కై డిటిహెచ్ ఆపరేటర్ కార్టూన్ నెట్‌వర్క్, డిస్నీ, మార్వెల్ హెచ్‌క్యూ ఛానెల్‌లతో సహా మరో 13 కిడ్స్ ఛానెల్‌లను కూడా కొత్త ఇపిజి స్లాట్‌లకు తరలించనున్నట్లు డిటిహెచ్ ఆపరేటర్ తన యొక్క వెబ్ సైట్ లో తెలిపింది. కార్టూన్ నెట్‌వర్క్ ప్రస్తుతమున్న 666 యొక్క EPG నెంబర్ వద్ద లభిస్తున్నది. దీనిని 667 యొక్క కొత్త EPG కి సవరించబడుతున్నది. అలాగే డిస్నీ ఛానల్ 658 కొత్త EPG స్లాట్‌కు తరలించబడనున్నది. టాటా స్కై వినియోగదారులు ప్రస్తుతం డిస్నీని 659 EPG స్లాట్ వద్ద యాక్సెస్ చేస్తున్నారు. ఇంకా మార్వెల్ HQ దాని ప్రస్తుత EPG 657 నుండి 655 యొక్క కొత్త EPG స్లాట్‌కు తరలించబడుతుంది. హంగమా టివి, కార్టూన్ నెట్‌వర్క్ హెచ్‌డి +, బేబీ టివి హెచ్‌డి, నిక్ జూనియర్, డిస్నీ జూనియర్ వంటి ఇతర కిడ్స్ ఛానెల్‌లు కూడా కొత్త EPG స్లాట్‌లకు తరలించనున్నాయి. సోనీ యాయ్, కుషి టివి, చుట్టి టివి, చింటు టివి మరియు కొచు టివిలు కూడా ఇపిజి నంబర్ రివిజన్‌లను కలిగి ఉంటాయని టాటా స్కై తెలిపింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Tata Sky English Movie Channels Revised to New EPG Slots

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X