Home
News

Tata Sky ‘Festive Offer’: ఈ 3 STB ల మీద డిస్కౌంట్ ఆఫర్స్!!కొద్ది రోజులు మాత్రమే..

ఇండియాలో అధిక యూజర్ బేస్ కలిగిన డైరెక్ట్-టు-హోమ్ (డిటిహెచ్) ఆపరేటర్లను కలిగిన టాటా స్కై తన యొక్క వినియోగదారుల కోసం వివిధ రకాల ఫీచర్లతో అనేక సెట్-టాప్ బాక్స్‌లను (STB) అందిస్తుంది. ఇందులో ఆండ్రాయిడ్- శక్తితో నడిచే విభాగంలో 'టాటా స్కై బింగే +' బాక్స్‌ను మరియు సాదా విభాగంలో SD, HD, HD 4K, మరియు టాటా స్కై + HD STB ను అందుబాటులో అందిస్తున్నది. వీటిలో SD ఎస్‌టిబి చౌకైనది కాగా HD 4K STB అత్యంత ఖరీదైనదిగా ఉంది.

టాటా స్కై

టాటా స్కై కొత్త STBని కొనడం గురించి మీరు ఆలోచిస్తున్నట్లయితే ఇప్పుడు దానిని కొనడానికి మంచి సమయం. డిటిహెచ్ ఆపరేటర్ తన ఎస్‌టిబిలను ‘పండుగ ఆఫర్' కింద తక్కువ రేటుకు అందిస్తున్నది. ఈ ఆఫర్లలో భాగంగా మూడు ఎస్‌టిబిలను ప్రస్తుతం ఆన్‌లైన్‌లో డిస్కౌంట్ ధరలతో కొనుగోలు చేయవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టాటా స్కై బింగే + STB తగ్గింపు ధరలు

టాటా స్కై బింగే + STB తగ్గింపు ధరలు

టాటా స్కై సంస్థ ఇప్పుడు మొత్తంగా తన యొక్క మూడు STB ల ధరలను తగ్గించింది. ఇందులో మొదటిది టాటా స్కై బింగే + STB. సాధారణంగా టాటా స్కై బింగే + STB రూ.2,499 రిటైల్ ధర వద్ద లభిస్తుంది. కానీ ప్రస్తుతం వినియోగదారులు దీనిని 2,299 రూపాయల తక్కువ ధర వద్ద పొందడానికి అవకాశం లభిస్తుంది. అంటే మొత్తంగా రూ.200 తగ్గింపు లభిస్తుంది. వినియోగదారులు ఈ తగ్గింపును ‘TSKY200' కోడ్‌తో పొందవచ్చు.

టాటా స్కై బింగే + STB బండిల్ ఆఫర్స్

టాటా స్కై బింగే + STB బండిల్ ఆఫర్స్

టాటా స్కై బింగే + STB వినియోగదారులు ఏదైనా ప్రయాణంలో ఉన్నప్పుడు తమకు ఇష్టమైన ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రసారం చేసే అవకాశాన్ని అందిస్తుంది. అదే సమయంలో వినియోగదారులు ఆండ్రాయిడ్ టీవీ నుండి రిమోట్ ద్వారా శాటిలైట్ టీవీకి చాలా తేలికగా మరియు శీఘ్రంగా మారడంతో ఉపగ్రహ టీవీ కంటెంట్‌ను ప్రసారం చేయవచ్చు. అంతేకాకుండా టాటా స్కై బింగే + STB వినియోగదారులకు నెలకు రూ.299 చొప్పున అందుబాటులో ఉన్న బండిల్ చేసిన OTT సర్వీస్ అయిన టాటా స్కై బింగే సర్వీసుకు వినియోగదారులు ఒక నెల ఉచిత చందా పొందుతారు. దీనికి తోడు టాటా స్కై బింగే + ఎస్‌టిబిని విజయవంతంగా కొనుగోలు చేసి యాక్టీవ్ చేసిన తర్వాత వినియోగదారులు అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క మూడు నెలల సభ్యత్వాన్ని ఉచితంగా పొందుతారు.

టాటా స్కై HD STB తగ్గింపు ధరలు

టాటా స్కై HD STB తగ్గింపు ధరలు

టాటా స్కై తగ్గింపు ప్రకటించిన STBలలో రెండవది టాటా స్కై హెచ్‌డి STB. సాధారణంగా ఇది రూ.1,499 రిటైల్ ధర వద్ద లభిస్తుంది. అయితే ఇప్పుడు ‘TSKY150' అనే కోడ్ వాడకంతో దీన్ని ప్రస్తుతం రూ.1,249 తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. అంటే దీని మీద రూ.150 తగ్గింపు లభిస్తుంది. టాటా స్కై హెచ్‌డి ఎస్‌టిబి డాల్బీ డిజిటల్ సరౌండ్ సౌండ్ మద్దతుతో యూజర్లు తమ అభిమాన కంటెంట్‌ను హెచ్‌డి క్వాలిటీలో చూడటానికి అనుమతిస్తుంది.

టాటా స్కై+ HD STB తగ్గింపు ధరలు

టాటా స్కై+ HD STB తగ్గింపు ధరలు

టాటా స్కై చివరగా డిస్కౌంట్‌లో అందిస్తున్న మూడవ STB టాటా స్కై + హెచ్‌డి. సాధారణంగా ఇది రూ.4,999 కు రిటైల్ ధర వద్ద లభిస్తుంది. అయితే ‘TSKY400' కోడ్‌ సహాయంతో దీనిని రూ.4,599 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. అంటే ఎస్‌టిబిపై మొత్తంగా రూ.400 వరకు తగ్గింపు లభిస్తుంది.

టాటా స్కై + హెచ్‌డి STB 625 గంటల లైవ్ టివి కంటెంట్‌ను రికార్డ్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. వీటితో పాటు వినియోగదారులు తమ అభిమాన సిరీస్‌ను STB తో స్టాండ్-బై మోడ్‌లో రికార్డ్ చేయవచ్చు. టాటా స్కై + HD STB తో యూజర్లు లైవ్ టీవీ కంటెంట్‌ను పాజ్ చేయవచ్చు, పునప్రారంభించవచ్చు మరియు రివైండ్ చేయవచ్చు. STB యొక్క ఉత్తమ ఫీచర్లలో ఒకటి వినియోగదారులు ఒకేసారి 3 షోలను రికార్డ్ చేయవచ్చు.

 

Best Mobiles in India

English summary
Tata Sky ‘Festive Offer’: 3 Set-Top Boxes Prices Slashed For Limited Period Time
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X