సెట్-టాప్ బాక్స్‌ల ధరలను మళ్ళి తగ్గించిన టాటా స్కై

|

టాటా స్కై ఇప్పుడు తన HD సెట్-టాప్ బాక్స్ యొక్క ధరను మళ్ళి తగ్గించింది. గత ఆరు నుండి ఎనిమిది నెలల్లో సెట్-టాప్ బాక్స్ ధరలను తగ్గించడం ఇది ఐదవ సారి. ట్రాయ్ టారిఫ్ పాలన ఏప్రిల్ 1 2019లో పూర్తిగా అమలులోకి వచ్చిన వెంటనే టాటా స్కై తన సెట్-టాప్ బాక్స్‌ల యొక్క ధరల మీద రూ.400 తగ్గించింది.

సెట్-టాప్ బాక్స్

తరువాత పరిశ్రమలో పోటీని తట్టుకోవడానికి ధరలను మరింత తగ్గించారు. గత ఏడాది అక్టోబర్‌లో డిటిహెచ్ ఆపరేటర్ ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టారు. అందులో భాగంగా హెచ్‌డి సెట్-టాప్ బాక్స్ కేవలం 1,199 రూపాయలకు మాత్రమే అందించింది. టాటా స్కై ఇప్పుడు తన హెచ్‌డి సెట్-టాప్ బాక్స్ యొక్క ధరను మళ్లీ తగ్గించింది.

స్పెషల్ ఆఫర్

స్పెషల్ ఆఫర్

ఇది ఇప్పుడు 'స్పెషల్ ఆఫర్'లో భాగంగా కేవలం 1,399 రూపాయలకు మాత్రమే లభిస్తుంది. ఈ ఆఫర్ ఎంతకాలం ఉంటుందో కంపెనీ వెల్లడించనప్పటికీ ఈ ఆఫర్ పరిమిత కాలం వరకు కొన్ని వారాల వరకు మాత్రమే అమలులో ఉంటుంది అని తెలుస్తోంది. మరిన్ని వివరాల కోసం ముందుకు చదవండి.

 

 

రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌లను వాడేవారికి గొప్ప శుభవార్త!!!!రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌లను వాడేవారికి గొప్ప శుభవార్త!!!!

కొత్త యూజర్లకు టాటా స్కై HD సెట్-టాప్ బాక్స్ ధర రూ.1,399

కొత్త యూజర్లకు టాటా స్కై HD సెట్-టాప్ బాక్స్ ధర రూ.1,399

డిటిహెచ్ రంగంలో 31.61% మార్కెట్ వాటాతో టాటా స్కై ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద డిటిహెచ్ ఆపరేటర్ గా ఉంది. టాటా స్కై ప్రస్తుతం ఆఫర్‌లో భాగంగా తక్కువ ధర వద్ద సెట్-టాప్ బాక్స్‌లను వినియోగదారులకు అందిస్తున్నది. అయితే ఈ పరిస్థితి SD మరియు HD STB లకు మాత్రమే వర్తిస్తుంది. ఇటీవల ప్రారంభించిన టాటా స్కై బింగే + ఆండ్రాయిడ్ టివి ఎస్‌టిబి ధర రూ.5,999 లుగా ఉండి ప్రత్యర్థి ఆపరేటర్ల నుండి అదే ఆండ్రాయిడ్ టివి బాక్స్‌లతో పోలిస్తే తక్కువ ధరతో ఉంది.

 

 

ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గాడ్జెట్స్ డేస్ 2020 సేల్స్.... ఆఫర్స్ చూడ తరమా....ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గాడ్జెట్స్ డేస్ 2020 సేల్స్.... ఆఫర్స్ చూడ తరమా....

స్పెషల్ ఆఫర్ ఛార్జీలు

స్పెషల్ ఆఫర్ ఛార్జీలు

టాటా స్కై ప్రస్తుతం అందిస్తున్న సరికొత్త ‘స్పెషల్ ఆఫర్'లో భాగంగా HD సెట్-టాప్ బాక్స్ ను కేవలం రూ.1,399 వద్ద పొందవచ్చు. ఇదే ధర వద్ద SD సెట్-టాప్ బాక్స్ ను కూడా పొందవచ్చు. HD కనెక్షన్ల సంఖ్యను మరింతగా పెంచడానికి ఈ చర్యను తీసుకున్నట్లు టాటా స్కై తెలిపింది. ఇవి కేవలం కనెక్షన్ ఛార్జీలు మాత్రమే. కొత్త కనెక్షన్ల కోసం అదనపు ఇన్‌స్టాలేషన్ మరియు ఇంజనీర్ విజిట్ ఛార్జీలు ఉంటాయని గమనించండి. SD కనెక్షన్ నుండి HD కనెక్షన్ కు అప్‌గ్రేడ్ అవ్వడానికి ఛార్జీలు రూ.1,199 గా ఉన్నాయి.

 

 

Gaganyaan మిషన్ లో హ్యూమనాయిడ్ రోబో.... ఇస్రో సంచలన నిర్ణయంGaganyaan మిషన్ లో హ్యూమనాయిడ్ రోబో.... ఇస్రో సంచలన నిర్ణయం

ఇతర సెట్-టాప్ బాక్స్‌ల ధరలు

ఇతర సెట్-టాప్ బాక్స్‌ల ధరలు

టాటా స్కై యొక్క బింగే +, టాటా స్కై 4K మరియు టాటా స్కై + HD వంటి ఇతర సెట్-టాప్ బాక్స్‌లు వరుసగా రూ.5,999, రూ.6,400 మరియు రూ.9,300 ధరలతో ప్రస్తుతం కొనుగోలు చేయవచ్చు. టాటా స్కై తన ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ ధరను తగ్గించి ఉంటే కొత్త వినియోగదారులకు ఇది చాలా బాగుండేది. కానీ వాటి యొక్క ధరలను మాత్రం తగ్గించలేదు.

 

బ్రహ్మాండమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో ఒప్పో F15 మొదటి సేల్స్బ్రహ్మాండమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో ఒప్పో F15 మొదటి సేల్స్

ఇతర డిటిహెచ్ ఆపరేటర్ల సెట్-టాప్ బాక్స్ ధరలతో పోలికలు

ఇతర డిటిహెచ్ ఆపరేటర్ల సెట్-టాప్ బాక్స్ ధరలతో పోలికలు

డిష్ టివి & డి 2 హెచ్

టాటా స్కై ప్రస్తుతం డిటిహెచ్ పరిశ్రమలో చౌకైన సెట్-టాప్ బాక్స్‌లను కలిగి ఉంది. టాటా స్కై యొక్క SD మరియు HD వేరియంట్ల ధరలు ఇప్పుడు రూ.1,399 వద్ద ఉండగా ఇతర డిటిహెచ్ ఆపరేటర్ల సెట్-టాప్ బాక్స్ ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో రెండవ అతిపెద్ద డిటిహెచ్ ఆపరేటర్‌గా ఉన్న డిష్ టివి యొక్క సెట్-టాప్ బాక్స్ లలో DishNXT HD STB ధర రూ.1,590 కాగా, DishNXT SD బాక్స్‌ యొక్క ధర రూ.1,490గా ఉన్నది. టాటా స్కై మాదిరిగా కాకుండా డిష్ టీవీ కొత్త కనెక్షన్లతో ఒక నెల ఛానల్ ప్యాక్‌ను ఉచితంగా అందిస్తుంది. డి 2 హెచ్ STB లలో హెచ్‌డి సెట్-టాప్ బాక్స్‌ ధర రూ.1,699, బేసిక్ SD బాక్స్‌ ధర రూ.1,599, హెచ్‌డి RF సెట్-టాప్ బాక్స్‌ యొక్క ధర రూ.1,799 గా మార్కెట్ లో లభిస్తుంది.

 

 

 

ఆపిల్ వాచ్‌లో డెలిట్ చేసిన యాప్‌లను తిరిగి ఇన్‌స్టాల్ చేయడం ఎలా?ఆపిల్ వాచ్‌లో డెలిట్ చేసిన యాప్‌లను తిరిగి ఇన్‌స్టాల్ చేయడం ఎలా?

 

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ కనెక్షన్ విషయానికి వస్తే ఇందులో SD సెట్-టాప్ బాక్స్ కనెక్షన్‌ యొక్క ధర రూ.1,100 అలాగే HD కనెక్షన్‌ కోసం రూ.1,300 లుగా వసూలు చేస్తోంది. ఇన్‌స్టాలేషన్ మరియు ఇంజనీర్ విజిట్ ఛార్జీలుగా అదనంగా రూ.450లు వర్తిస్తాయి. కొత్త ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ కనెక్షన్‌తో ఒక నెల ఛానల్ ప్యాక్‌ను ఉచితంగా అందిస్తుంది.

 

 

బడ్జెట్ ధరలో హువాయి 5G స్మార్ట్‌ఫోన్‌లు... త్వరలోనే అందుబాటులోకిబడ్జెట్ ధరలో హువాయి 5G స్మార్ట్‌ఫోన్‌లు... త్వరలోనే అందుబాటులోకి

సన్ డైరెక్ట్

సన్ డైరెక్ట్

చివరగా సన్ డైరెక్ట్ యొక్క సెట్-టాప్ బాక్స్లలో SD+ బాక్స్‌ను 1,799 రూపాయలకు, HD+ బాక్స్‌ను 1,999 రూపాయలకు అందిస్తున్నది. సన్ డైరెక్ట్ కేవలం దక్షిణ భారత రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందినప్పటికీ వినియోగదారుల నుండి ప్రీమియం మొత్తాన్ని వసూలు చేస్తోంది.

Best Mobiles in India

English summary
Tata Sky HD Set-Top Box Receives Price Cut Again

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X