టాటా స్కైలో ఈ ఛానెల్‌లను కొత్త స్లాట్‌లకు తరలించారు!!! గమనించారా...

|

ఇండియాలోని డైరెక్ట్-టు-హోమ్ (డిటిహెచ్) రంగంలో అతి పెద్ద యూజర్ బేస్ కలిగిన ఆపరేటర్ టాటా స్కై ఇప్పుడు తన ప్లాట్‌ఫామ్‌లోని 20 కి పైగా హిందీ ప్రాంతీయ ఛానెళ్ల ఎలక్ట్రానిక్ ప్రోగ్రామింగ్ గైడ్ (EPG) నెంబర్లను సవరించింది. సెప్టెంబరు నెలలో ఈ ఆపరేటర్ తన ప్లాట్‌ఫామ్‌లోని ఇంగ్లీష్ ఎంటర్టైన్మెంట్ ఛానెళ్లతో పాటు తమిళం, తెలుగు, కన్నడ మరియు బెంగాలీ ప్రాంతీయ ఛానెల్‌ల యొక్క EPG నంబర్లను సవరించారు. టాటా స్కై సవరించిన హిందీ ప్రాంతీయ ఛానెల్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టాటా స్కై సవరించిన హిందీ ప్రాంతీయ ఛానెళ్ల EPG నెంబర్లు
 

టాటా స్కై సవరించిన హిందీ ప్రాంతీయ ఛానెళ్ల EPG నెంబర్లు

టాటా స్కై సవరించిన హిందీ ప్రాంతీయ ఛానెళ్ల వివరాల విషయానికి వస్తే ABP గంగా, న్యూస్18 రాజస్థాన్, న్యూస్18 బీహార్ జార్ఖండ్ వంటి హిందీ ప్రాంతీయ ఛానళ్ల ఇపిజి నంబర్లను డిటిహెచ్ ఆపరేటర్ సవరించారు. ABP గంగా 1108 యొక్క పాత ఇపిజి నుండి 1127 యొక్క కొత్త ఇపిజికి మార్చబడింది. ఇంకా ఆపరేటర్ న్యూస్ 18 రాజస్థాన్‌ యొక్క పాత ఇపిజి 1131 నుండి 1176 యొక్క కొత్త ఇపిజికి సవరించగా, న్యూస్ 18 బీహార్ జార్ఖండ్ పాత ఇపిజి 1105 నుండి 1129 కు సవరించబడింది.

Also Read: Flipkart Big Diwali Sale: స్మార్ట్‌ఫోన్‌లు, టీవీల మీద 80% వరకు డిస్కౌంట్ ఆఫర్స్...

టాటా స్కైలో కొత్త మార్పులు

టాటా స్కైలో కొత్త మార్పులు

న్యూస్ 18 ఉత్తర ప్రదేశ్ ఉత్తరాఖండ్, Zee బీహార్ జార్ఖండ్, ఆస్కార్ మూవీస్ భోజ్‌పురి, భోజ్‌పురి సినిమా, బిగ్ గంగా, దిషుమ్, B4U భోజ్‌పురి, సూర్య భోజ్‌పురి, Zee బిస్కోప్ వంటి ఇతర ఛానెల్స్ ఇపిజి నెంబర్లను టాటాలో స్కైలో ప్రస్తుతం సవరించారు. ఇవే కాకుండా ఫిలాంచి, సాధనా ప్లస్ న్యూస్, కాశీష్ న్యూస్, Zee రాజస్థాన్ న్యూస్, ఫస్ట్ ఇండియా రాజస్థాన్, న్యూస్ 18 మధ్యప్రదేశ్ ఛత్తీస్‌గడ్, ఐబిసి 24, బన్సాల్ న్యూస్, INH 24X 7 వంటి ఛానల్‌లను కొత్త ఇపిజి స్లాట్‌లకు తరలించారు.

టాటా స్కై సవరించనున్న 19 హిందీ ప్రాంతీయ ఛానెళ్లు
 

టాటా స్కై సవరించనున్న 19 హిందీ ప్రాంతీయ ఛానెళ్లు

ఇండియా న్యూస్ UP UK, న్యూస్ స్టేట్ UP ఉత్తరాఖండ్, ఇండియా న్యూస్ రాజస్థాన్ వంటి ఇతర 19 హిందీ ప్రాంతీయ ఛానల్స్ ల యొక్క ఇపిజి నెంబర్ లను సవరించనున్నట్లు టాటా స్కై తన పోర్టల్ లో హైలైట్ చేసింది. Zee ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్, ఇండియా న్యూస్ MP CH, న్యూస్ స్టేట్ MP CG, పత్రిక టివి రాజస్థాన్, స్వరాజ్ ఎక్స్‌ప్రెస్ SMBC యొక్క ఇపిజి నెంబర్లు సవరించనున్నాయి. అదనంగా Zee మధ్యప్రదేశ్ ఛత్తీస్‌గడ్, సాధనా న్యూస్ ఎంపి సిజి, భాస్కర్ న్యూస్, న్యూస్ 18 ఉర్దూ, Zee సలాం మరియు గులిస్తాన్ న్యూస్‌ ఛానెళ్ల ఇపిజి నెంబర్లు కూడా సవరించనున్నాయి. ఇండియా న్యూస్ UP UK ప్రస్తుతమున్న 550 ఇపిజి నుండి 1136 యొక్క కొత్త ఇపిజికి సవరించబడుతుంది. ఇంకా న్యూస్ స్టేట్ యుపి ఉత్తరాఖండ్ ప్రస్తుతమున్న 552 ఇపిజి నుండి కొత్త ఇపిజి 1137 కు సవరించనుంది.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Tata Sky Hindi Regional Channels Revised to New EPG Slots

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X