Home
News

Tata Sky హిట్స్ వాల్యూ-యాడెడ్ సర్వీస్: ప్రత్యేక హాలీవుడ్ షోల కోసం

టాటా స్కై తాజాగా తన వాల్యూ-ఆధారిత సేవలను టాటా స్కై హిట్స్ జాబితాలో చేర్చడంతో తన మనుగడను విస్తరిస్తూనే ఉంది. దేశంలోని ప్రముఖ డిటిహెచ్ ఆపరేటర్ నేడు 'హిట్స్' వాల్యూ-యాడెడ్ సర్వీస్ (VAS) ను ప్రకటించారు. ఇందులో భాగంగా 1980 మరియు 1990 ల మధ్య అత్యంత ప్రాచుర్యం పొందిన హాలీవుడ్ టెలివిజన్ కంటెంట్ ను ప్రసారం చేయనున్నాయి.

టాటా స్కై హిట్స్

టాటా స్కై హిట్స్

టాటా స్కై హిట్స్ ఇప్పటికే చందాదారులకీ నెలకు 75 రూపాయల ధర వద్ద లభిస్తుంది. ఏదేమైనా టాటా స్కై వినియోగదారులు వారి చందా ఛార్జీలు వర్తించే మొదటి పది రోజులు ఉచితంగా పొందవచ్చు. టాటా స్కై సీనియర్స్, టాటా స్కై ఇబాదత్, టాటా స్కై తెలుగు సినిమా, టాటా స్కై ఆరాధన, టాటా స్కై ఫ్యామిలీ హెల్త్, టాటా స్కై థియేటర్ వంటి తదితర సేవల్లో టాటా స్కై కొత్త VAS కూడా ఇప్పుడు చేరింది. టాటా స్కై యొక్క VAS గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

టాటా స్కై హిట్స్ వాల్యూ-యాడెడ్ సర్వీస్

టాటా స్కై హిట్స్ వాల్యూ-యాడెడ్ సర్వీస్

టాటా స్కై హిట్స్ 1980 మరియు 1990 ల మధ్య కాలంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మరియు ఐకానిక్ అవార్డులను గెలుచుకున్న హాలీవుడ్ టెలివిజన్ కంటెంట్‌ను ప్రసారం చేస్తుంది. హిట్స్‌లో లభించే కంటెంట్ మరొక ఏ టెలివిజన్ ఛానెల్‌లోనూ ప్రసారం చేయబడదని ఈ డిటిహెచ్ ఆపరేటర్ తెలిపింది. టాటా స్కై హిట్స్‌లో ప్రత్యేకంగా లభించే కొన్ని ముఖ్య శీర్షికలలో బేవాచ్, చార్లీ ఏంజిల్స్, చార్మ్డ్, మయామి వైస్, లా అండ్ ఆర్డర్: స్పెషల్ విక్టిమ్స్ యూనిట్, త్రీస్ కంపెనీ, మర్డర్, షీ రాట్, నైట్ రైడర్, సబ్రినా ది టీనేజ్ విచ్, ది లూసీ షో వంటివి చాలా ఉన్నాయి.

HD సర్వీస్

HD సర్వీస్

టాటా స్కై హిట్స్ అనేది ఒక HD సర్వీస్. ఇది హాలీవుడ్ లోని విజయవంతమైన టీవీ సిరీస్‌లను కూడా ప్రసారం చేస్తుంది. వినియోగదారులు మొబైల్ యాప్‌లో కూడా టాటా స్కై హిట్స్ సర్వీసును పొందవచ్చు. టాటా స్కై తన చందాదారుల కోసం ప్రత్యేకంగా క్లాస్ కంటెంట్‌ను ఉత్తమంగా తీసుకురావడానికి సింగపూర్‌లోని రివైండ్ నెట్‌వర్క్‌లతో భాగస్వామ్యం కలిగి ఉంది.

 

 

టాటా స్కై కంటెంట్

టాటా స్కై కంటెంట్

"టాటా స్కై చందాదారుల యొక్క వివిధ రకాల కంటెంట్ అవసరాలను తీర్చడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తున్నది. టాటా స్కై హిట్స్‌ చందాదారులు తమ అభిమాన హాలీవుడ్ షోలను చూడడానికి ప్రత్యేకమైన వేదికగా ఉంటుంది. టాటా స్కై హిట్స్ సబ్-టైటిల్స్ తో క్యూరేట్ చేయబడిన హాలీవుడ్ షోల యొక్క విభిన్న కలగలుపు అసాధారణమైనది. దీనిని టీవీ లేదా OTT యాప్ లలో కూడా చూడవచ్చు. ఇటువంటి లభ్యత మరెక్కడా అందుబాటులో లేని ప్రత్యేకమైన షోలను ప్రేక్షకులకు అందిస్తుంది అని టాటా స్కై చీఫ్ కమర్షియల్ అండ్ కంటెంట్ ఆఫీసర్ పల్లవి పూరి తెలిపారు.

ఇతర టాటా స్కై వాల్యూ-యాడెడ్ సర్వీసులు

ఇతర టాటా స్కై వాల్యూ-యాడెడ్ సర్వీసులు

ప్రస్తుతం ఈ విభాగంలో అగ్రగామిగా ఉన్న ఎయిర్‌టెల్ డిజిటల్ టివిని ఎదురుకోవడానికి టాటా స్కై తన వాల్యూ-యాడెడ్ సర్వీస్ జాబితాను నిరంతరం మెరుగుపరుస్తుంది. టాటా స్కై వరల్డ్ స్క్రీన్ హెచ్‌డి, టాటా స్కై మరాఠీ సినిమా, టాటా స్కై బ్యూటీ, టాటా స్కై క్లాసిక్ సినిమా, టాటా స్కై యాక్టింగ్ అడ్డా, టాటా స్కై పంజాబ్ దే రాంగ్, టాటా స్కై బంగ్లా సినిమా, టాటా స్కై బాలీవుడ్ ప్రీమియర్, టాటా స్కై డాన్స్ స్టూడియో, టాటా స్కై మ్యూజిక్ +, టాటా స్కై క్లాస్‌రూమ్, టాటా స్కై కామెడీ, టాటా స్కై ఫిట్‌నెస్, టాటా స్కై స్మార్ట్ మేనేజర్, టాటా స్కై జావేద్ అక్తర్, టాటా స్కై వేదిక్ మాథ్స్ , టాటా స్కై స్మార్ట్ గేమ్స్, టాటా స్కై మ్యూజిక్, టాటా స్కై ఫన్ లెర్న్, టాటా స్కై ఇంగ్లీష్, టాటా స్కై దర్శన్, టాటా స్కై ఫుడ్, టాటా స్కై సీనియర్స్, టాటా స్కై ఇబాదత్, టాటా స్కై ఆరాధన, టాటా స్కై భోజ్‌పురి సినిమా, టాటా స్కై తెలుగు సినిమా మరియు టాటా స్కై తమిళ సినిమా వంటివి ఈ విభాగంలో ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Tata Sky Hits Value-Added Service Launched: Here are The Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X