Home
News

Tata Sky Broadband తక్కువ ధర వద్ద అందిస్తున్న ఫిక్సడ్ డేటా ప్లాన్‌లు ఇవే!!!

ప్రముఖ డిటిహెచ్ ఆపరేటర్ టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ రంగంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి తన వినియోగదారులను ఆకట్టుకోవడానికి కొత్త కొత్త ప్లాన్లను తీసుకువస్తున్నది. ఇందులో భాగంగా ఇటీవల తన జాబితాలో కొత్తగా మరికొన్ని బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను జోడించింది. ఈ ప్లాన్లు నిర్ణీత నెలవారీ డేటా పరిమితితో అందుబాటులోకి వస్తాయి. ఈ ప్లాన్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే టాటా స్కై సమర్పణ జాబితాలో ఉత్తమమైన 300 Mbps వేగంతో వస్తుంది. నెలవారీ ఫిక్సడ్ డేటా విభాగంలో టాటా స్కై నుండి ఇతర ప్లాన్లు ఏవీ కూడా ఈ విధమైన వేగంతో రావు. ఇప్పటి వరకు నెలవారీ ఫిక్సడ్ డేటా ప్లాన్‌లను ఎంచుకునే వినియోగదారులకు అందించే గరిష్ట వేగం 100 Mbps మాత్రమే. కాబట్టి టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో నెలవారీ FUP పరిమితితో లభించే ప్లాన్‌ల వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ఫిక్సడ్ డేటా ప్లాన్‌లు 1 నెల చెల్లుబాటుతో

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ఫిక్సడ్ డేటా ప్లాన్‌లు 1 నెల చెల్లుబాటుతో

ప్రజలు టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ యొక్క సేవలను ఎంచుకునే క్రమంలో ఎక్కువ మంది ఫిక్సడ్ డేటా ప్లాన్‌లలో చౌకైన ప్లాన్‌ను ఎంచుకుంటారు. ఈ ప్లాన్ యొక్క ధర 790 రూపాయలు. ఈ ప్లాన్ తన చెల్లుబాటు కాలంలో 50 Mbps వేగంతో మొత్తంగా 150GB డేటాను వినియోగదారులకు అందిస్తుంది. ఈ ప్లాన్ కాకుండా రూ.950, రూ.1,000, రూ.1,050, రూ.1,470 ధరల వద్ద మరో నాలుగు ప్లాన్లు కూడా ఉన్నాయి. ఇందులో రూ.950 నెలవారీ ప్లాన్ 100Mbps వేగంతో 250GB డేటాను, రూ.1000 ధర వద్ద లభించే ప్లాన్ 50 Mbps వేగంతో 500GB డేటాను అందిస్తుంది. కేవలం రూ.50ల తేడాతో ఈ ప్లాన్ 250GB ఎక్కువ డేటాను అందిస్తుంది. చివరి రెండు ప్లాన్‌ల విషయానికి వస్తే రూ.1,050 ప్లాన్ 100Mbps వేగంతో 500GB డేటాను మరియు రూ.1,470 ప్లాన్ 300 Mbps వేగంతో  500GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లు అన్ని కూడా ఉచిత రౌటర్, డేటా రోల్‌ఓవర్ ప్రయోజనం మరియు సురక్షిత కస్టడీతో వస్తాయి. కానీ ఈ ప్లాన్‌లతో ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు వర్తించబడతాయి.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ఫిక్సడ్ డేటా ప్లాన్‌లు 3 నెలల చెల్లుబాటుతో

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ఫిక్సడ్ డేటా ప్లాన్‌లు 3 నెలల చెల్లుబాటుతో

మూడు నెలల చెల్లుబాటుతో లభించే టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ యొక్క ఫిక్సడ్ డేటా ప్లాన్‌లలో మొదటిది రూ.2,250 ధర వద్ద లభించే ప్లాన్. ఇది ప్రతి నెల 50Mbps వేగంతో 150GB డేటాను అందిస్తుంది. రెండవది రూ.2,700 ధర వద్ద లభించే ప్లాన్ 100 Mbps వేగంతో నెలకు 250GB డేటాను అందిస్తుంది. రూ.2,850 ధర వద్ద లభించే మరొక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కూడా ఉంది. ఇది ప్రతి నెలా 50 Mbps  వేగంతో 500GB డేటాను అందిస్తుంది. కాబట్టి ప్రతి నెలా ఎక్కువ మొత్తంలో డేటాను కోరుకునేవారికి ఇది సరైనదిగా ఉంటుంది. చివరగా రూ.3,000 మరియు రూ.4,200 ధర వద్ద లభించే రెండు ప్లాన్‌లు ఒకే మొత్తంలో నెలవారీ డేటాను అందిస్తున్నాయి. ఇందులో మొదటి ప్లాన్ నెలకు 500GB డేటాను 100 Mbps వేగంతో మరియు రూ.4,200 ప్లాన్ 300 Mbps వేగంతో నెలకు 500GB డేటాను అందిస్తుంది.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ఫిక్సడ్ డేటా ప్లాన్‌లు 6 నెలల చెల్లుబాటుతో

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ఫిక్సడ్ డేటా ప్లాన్‌లు 6 నెలల చెల్లుబాటుతో

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ఫిక్సడ్ డేటా ప్లాన్‌లలో 6నెలలు మరియు ఒక సంవత్సరం చెల్లుబాటు కాలంతో ఎంచుకునే వినియోగదారులకు సంస్థ తగ్గింపును కూడా ఇస్తుంది. ఆరు నెలల ప్లాన్‌ల మీద 10% తగ్గింపును మరియు వార్షిక ప్లాన్‌ల మీద 15% తగ్గింపును అందిస్తుంది. 6 నెలల చెల్లుబాటు కాలంలో  రూ.4,050 ధర వద్ద లభించే ప్లాన్ 50 Mbps వేగంతో 150GB నెలవారీ డేటాను, రూ.4,860 ధర వద్ద లభించే ప్లాన్ 100 Mbps వేగంతో 250GB నెలవారీ డేటాను, రూ.5,130 ధర వద్ద లభించే ప్లాన్ 50 Mbps వేగంతో 500GB నెలవారీ డేటాను, రూ.5,400 ధర వద్ద లభించే ప్లాన్ 500GB నెలవారీ డేటాను 100 Mbps వేగంతో మరియు రూ.7,560 ధర వద్ద లభించే ప్లాన్ 300 Mbps వేగంతో 500GB నెలవారీ డేటాను అందిస్తుంది.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ఫిక్సడ్ డేటా ప్లాన్‌లు ఒక సంవత్సరం చెల్లుబాటుతో

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ఫిక్సడ్ డేటా ప్లాన్‌లు ఒక సంవత్సరం చెల్లుబాటుతో

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ అందిస్తున్న ఫిక్సడ్ డేటా ప్లాన్‌లు ఐదు కూడా ఒక సంవత్సరం చెల్లుబాటు కాలానికి లభించే వాటి యొక్క ధరలు మరియు డేటా యొక్క వివరాలు వరుసగా- రూ.7,650 (50 Mbps వేగంతో 150GB నెలవారీ డేటా), రూ.9,180 (100 Mbps వేగంతో 250 GB నెలవారీ డేటా), రూ .9,690 (50 Mbps వేగంతో 500GB నెలవారీ డేటా), రూ.10,200 (100 Mbps వేగంతో 500GB నెలవారీ డేటా), మరియు రూ.14,280 (100 Mbps వేగంతో 500GB నెలవారీ డేటా) ప్రయోజనాలను పొందవచ్చు.


More from GizBot

Best Mobiles in India

English summary
Tata Sky Introduce New Broadband Plans with Lowest Price at Rs 790
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X