Home
News

టాటా స్కై రొమాన్స్ ఛానెల్‌తో సరికొత్త ప్రయోగం!! ధరలు, కంటెంట్ వివరాలు ఇవిగో

భారతదేశంలోని డైరెక్ట్-టు-హోమ్ (DTH) ఆపరేటర్లలో ఒకటైన టాటా స్కై తన యొక్క వినియోగదారుల బేస్ ను పెంచుకోవడం కోసం తన ప్లాట్‌ఫారమ్‌లో ఇప్పుడు 'టాటా స్కై రొమాన్స్' అనే కొత్త ఛానెల్‌ని జోడించింది. ఈ ఛానెల్ అనేక భాషలలోని వివిధ పరిశ్రమల నుండి కంటెంట్‌ను అందించడానికి ఉద్దేశించబడింది. టాటా స్కై రొమాన్స్ అనేది ఒక రకమైన సర్వీస్. ఇది వినియోగదారులకు బాలీవుడ్, హాలీవుడ్ మరియు టెలివిజన్ నుండి అద్భుతమైన కంటెంట్‌ను అందిస్తుంది. ఈ కంటెంట్‌లలో నేటి మరియు పాత కాలపు మంచి ఫ్యాషన్ రొమాంటిక్‌ల కోసం రూపొందించబడ్డాయి. ఈ కొత్త ఛానల్ సర్వీసును ప్రోత్సహించడానికి టాటా స్కై ఇప్పుడు సనా మక్బుల్ మరియు షహీర్ షేక్‌ వంటి షోలను క్యాంపైన్ లో భాగంగా ప్రచారం చేసింది.

టాటా స్కై రొమాన్స్ ఛానల్ ధరల వివరాలు

టాటా స్కై రొమాన్స్ ఛానల్ ధరల వివరాలు

టాటా స్కై రొమాన్స్ యొక్క కొత్త ఛానల్ వినియోగదారులకు రోజుకు రూ.2 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త సర్వీసులో ఎటువంటి ప్రకటనలు లేకుండా కంటెంట్‌ను చూడడానికి అనుమతిస్తుంది. అలాగే వినియోగదారులు టాటా స్కై మొబైల్ యాప్‌తో కూడా ప్రయాణం సమయంలో ఎక్కడ ఉన్న కూడా కంటెంట్‌ను చూడడానికి అనుమతిస్తుంది. టాటా స్కై భారతదేశంలోని వినియోగదారులకు తన యొక్క కొత్త టాటా స్కై రొమాన్స్ ఛానల్ ద్వారా ఇతర దేశాల నుండి రొమాంటిక్ కంటెంట్‌ని వారి స్వంత భాషలో చూడగలిగే సర్వీసును అందించాలని కోరుకుంది.

టాటా స్కై చీఫ్

టాటా స్కై చీఫ్ కమర్షియల్ అండ్ కంటెంట్ ఆఫీసర్ పల్లవి పూరి మాట్లాడుతూ ఈ సర్వీస్ ఎలాంటి ప్రకటనలు లేకుండా హిందీలో హాలీవుడ్ మరియు బాలీవుడ్‌లో రొమాంటిక్ జానర్‌లో కొన్ని ఉత్తమ శీర్షికలను అందజేస్తుందని తెలిపారు. వినోదం విషయానికి వస్తే భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన జానర్‌లలో రొమాన్స్ ఒకటని పూరీ పేర్కొన్నాడు. అలాగే JOP నెట్‌వర్క్ డైరెక్టర్ ఉర్వీ అగర్వాల్ మాట్లాడుతూ టాటా స్కై రొమాన్స్‌తో బాలీవుడ్ మరియు హాలీవుడ్ నుండి ప్రత్యేకమైన రొమాంటిక్ చిత్రాలను ప్లాట్‌ఫారమ్‌పైకి తీసుకురావడం కోసం టాటా స్కైతో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

టాటా స్కై రొమాన్స్

టాటా స్కై రొమాన్స్ ఇప్పుడు DTH ఆపరేటర్ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉంది. ఇది ఛానెల్ నంబర్ 113లో చూడవచ్చు మరియు టాటా స్కై మొబైల్ అప్లికేషన్‌లో కూడా ఇది అందుబాటులో ఉంటుంది. వారి సబ్‌స్క్రిప్షన్ ప్యాక్ యొక్క ఈ ఛానెల్‌ని చేర్చడానికి టాటా స్కై సబ్‌స్క్రైబర్‌లు 080 61999933కి మిస్డ్ కాల్ ఇవ్వగలరు. టాటా స్కై రొమాన్స్ బాలీవుడ్ మరియు హాలీవుడ్ రెండింటి నుండి జబ్ వుయ్ మెట్, ది గుడ్ గర్ల్ వంటి అత్యంత ప్రజాదరణ పొందిన కొన్ని టైటిల్‌లను వినియోగదారులను అలరించడానికి అందిస్తుంది.

టాటా స్కై బింగే + STB కొత్త కనెక్షన్ ఆఫర్లు

టాటా స్కై బింగే + STB కొత్త కనెక్షన్ ఆఫర్లు

టాటా స్కై యొక్క కొత్త బింగే + కనెక్షన్‌ను పొందిన వారికి ఆరు నెలల టాటా స్కై బింగే సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తోంది. ఇదే కాకుండా అందుబాటులో ఉన్న ఆఫర్లలో టాటా స్కై బింగేతో పాటు మూడు నెలల అమెజాన్ ప్రైమ్ చందాను కూడా ఉచితంగా పొందవచ్చు. ఆ తర్వాత నెలవారీ ధర రూ.129 నుండి మొదలవుతుంది. టాటా స్కై టాటా స్కై బింగే ధరను ఇటీవల రూ .249 నుండి రూ .299 కు పెంచింది. ఇది డిస్నీ + హాట్‌స్టార్, ZEE5, SunNXT, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, హంగమా ప్లే, ఈరోస్ నౌ మరియు షెమరూమీ యొక్క ప్రీమియం సభ్యత్వాలకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది.

టాటా స్కై తెలుగు బేసిక్ HD ప్యాక్‌ వివరాలు

టాటా స్కై తెలుగు బేసిక్ HD ప్యాక్‌ వివరాలు

రూ.500 ధర లోపు టాటా స్కై అందించే ఛానల్ ప్యాక్‌ల జాబితాలో అతి తక్కువ ధరను కలిగి ఉండేది ‘తెలుగు బేసిక్ హెచ్‌డి' ప్యాక్. ఇది తెలుగు ప్రాంతీయ ఛానెళ్లను అధికంగా కలిగి ఉంటుంది. వీటితో పాటుగా హిందీ సినిమాలు, వార్తలు మరియు ఎంటర్టైన్మెంట్ ఛానెల్‌లు కూడా ఉన్నాయి. ప్రజలకు జ్ఞానం మరియు జీవనశైలి మార్గాలను అందించే ఛానెల్‌లు కూడా లభిస్తాయి. ఈ ఛానల్ ప్యాక్ యొక్క ధర నెలకు రూ.208.98. ఇది మొత్తంగా 15SD ఛానెళ్లతో పాటు 11HD ఛానెల్‌లను అందిస్తుంది.

టాటా స్కై తెలుగు ఫ్యామిలీ కిడ్స్ స్పోర్ట్స్ HD ప్యాక్‌ వివరాలు

టాటా స్కై తెలుగు ఫ్యామిలీ కిడ్స్ స్పోర్ట్స్ HD ప్యాక్‌ వివరాలు

టాటా స్కై తక్కువ ధరలో అందిస్తున్న రెండవ ప్లాన్‌ విషయానికి వస్తే ‘తెలుగు ఫ్యామిలీ కిడ్స్ స్పోర్ట్స్ హెచ్‌డీ' ప్యాక్‌ను నెలకు రూ.441.96 ధర వద్ద అందిస్తున్నది. ఇది ఎక్కువగా మ్యూజిక్, గేమ్స్ , సినిమాలు, కిడ్స్ మరియు లైఫ్ స్టైల్ ఛానెల్‌లను అందిస్తుంది. ఇందులో మొత్తంగా 31 హెచ్‌డి, 50 ఎస్‌డి ఛానెల్‌లు ఉన్నాయి. ఈ ప్యాక్‌లో తెలుగు ప్రాంతీయ ఛానెల్‌లు అధికంగా ఉన్నాయి. తెలుగు ఛానెల్‌లతో పాటుగా మలయాళ ఛానెల్‌లను కోరుకునే వారికి ఈ ప్యాక్ సరిగ్గా సరిపోతుంది. ‘తెలుగు మలయాళ బేసిక్ హెచ్‌డీ' ప్యాక్ నెలకు రూ.343.49 ధర వద్ద వస్తుంది. ఈ ఛానల్ ప్యాక్ మొత్తంగా 19 హెచ్‌డి ఛానెల్‌లను మరియు 43 ఎస్‌డి ఛానెల్‌లతో వస్తుంది. మీరు సంగీతం ఛానెల్‌లతో పాటు అనేక తెలుగు మరియు మలయాళ ప్రాంతీయ ఛానెల్‌లను మరియు హిందీ ఛానెల్‌ను పుష్కలంగా పొందుతారు. HD స్పోర్ట్స్ ఛానెల్స్ కూడా ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Tata Sky Launches 'Romance Channel' on its Platform! Here are The Prices and Content Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X