DTH మార్కెట్ వాటాలో ఇతరులను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో టాటా స్కై!!

|

ఇండియాలోని డిటిహెచ్ రంగంలోని ఆపరేటర్లలో ఒకటైన టాటా స్కై 32.58% మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. Q1 FY21 ను టాటా స్కై 32.09% వాటాతో ముగించింది. 2020 సెప్టెంబర్ చివరినాటికి 32.58% మార్కెట్ వాటాను కలిగి ఉంది. దేశంలో రెండవ అతిపెద్ద డిటిహెచ్ ఆపరేటర్ స్థానంలో డిష్ టివి కొనసాగుతోంది. అయితే టాటా స్కై మాదిరిగా కాకుండా డిష్ టీవీ తన మార్కెట్ వాటాను ఈసారి కోల్పోయింది. మిగిలిన రెండు సర్వీసు ప్రొవైడర్లు ఎయిర్టెల్ డిజిటల్ టివి మరియు సన్ డైరెక్ట్ కూడా తమ మార్కెట్ వాటాను స్వల్పంగా పెంచుకున్నాయి. అలాగే డిటిహెచ్ చందాదారుల సంఖ్య జూన్ 2020 లో ఉన్న 70.58 మిలియన్ల నుండి సెప్టెంబర్ 2020 నాటికి 70.70 మిలియన్లకు పెరిగింది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

టాటా స్కై Q1 FY21 రిజిస్టర్ గ్రోత్

టాటా స్కై Q1 FY21 రిజిస్టర్ గ్రోత్

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) డిటిహెచ్ రంగం యొక్క 2020 సెప్టెంబర్ 30 త్రైమాసిక డేటా నివేదికను విడుదల చేసింది. ఈ త్రైమాసికంలో టాటా స్కై తన మార్కెట్ వాటాను 32.58 శాతానికి పెరిగింది. మరోవైపు డిష్ టివి మార్కెట్ వాటాను స్వల్పంగా కోల్పోయి 27% వాటాతో సరిపడింది. అలాగే ఎయిర్‌టెల్ డిజిటల్ టివి 24.59% మరియు సన్ డైరెక్ట్ 15.83% వాటాతో మూడవ మరియు నాల్గవ స్థానంలో కొనసాగుతున్నాయి.

డిటిహెచ్ ఆపరేటర్ల మార్కెట్ వాటా

డిటిహెచ్ ఆపరేటర్ల మార్కెట్ వాటా

డిష్ టివి డిటిహెచ్ ఆపరేటర్ మార్కెట్ వాటాను రెండు వంతులు కోల్పోవడంతో సంస్థకు కొద్దిగా ఆందోళన కలిగించే అంశం. ఇతర డిటిహెచ్ ఆపరేటర్లు తమ మార్కెట్ వాటాను స్వల్పంగా పెంచుకున్నారు. అయితే అగ్రశ్రేణి డిటిహెచ్ ఆపరేటర్ అయిన డిష్ టివి విషయంలో నిరంతరం టాటా స్కై మరియు ఎయిర్‌టెల్ డిజిటల్ టివిలకు వాటాను కోల్పోతోంది. డిష్ టీవీ మార్కెట్ వాటా తగ్గడానికి కారణం కూడా ముందు తెలుసుకోవాలి.

బింగే + ఆండ్రాయిడ్ టివి సెట్-టాప్ బాక్స్‌
 

టాటా స్కై తన బింగే + ఆండ్రాయిడ్ టివి సెట్-టాప్ బాక్స్‌ను కేవలం రూ .2,999 ధర వద్ద ఆరు నెలల టాటా స్కై బింగే చందాతో ఉచితంగా అందిస్తుంది. కొత్త కస్టమర్లకు కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అలాగే డిష్ టీవీ విషయంలో డిష్ SMRT Hub ఆండ్రాయిడ్ టివి ఆధారిత హైబ్రిడ్ సెట్-టాప్ బాక్స్ ను కొత్త వినియోగదారులకు రూ.3,999 వద్ద మరియు HD లేదా SD సెట్-టాప్ బాక్స్ నుండి అప్‌గ్రేడ్ అవుతున్న ప్రస్తుత వినియోగదారులకు రూ.2,499 వద్ద లభిస్తుంది. టాటా స్కై చందాదారులను అధికంగా పెంచుకునే కారణాలలో టాటా స్కై బింగే మరియు ప్రీమియం OTT చందాలను ఒకే ప్యాకేజీలో కలిపి నెలకు కేవలం 299 రూపాయల ధర వద్ద అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Tata Sky Market Share Increased in Q1 FY21: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X