Home
News

Tata Sky క్రొత్త ఛానల్ ప్యాక్‌ల ధరలు ఇవే....

DTH పరిశ్రమలో గల ఆపరేటర్లలో టాటా స్కై, డిష్ టివి వంటివి ప్రసిద్ధి చెందినవి. అన్ని డిటిహెచ్ ఆపరేటర్లలో టాటా స్కై గత సంవత్సరంలో మెరుగ్గా కొత్త కొత్త ప్రణాళికలను ప్రారంభించి ఎక్కువ మంది చందాదారులను పొందింది.

 DTH ఆపరేటర్‌

ప్రస్తుతం దేశంలోని డిటిహెచ్ పరిశ్రమలో మొదటి స్థానంలో ఉన్న DTH ఆపరేటర్‌ టాటా స్కై. దేశంలో ఇప్పుడు ట్రాయ్ కొత్తగా డిటిహెచ్ నిబంధనలను అమలు చేసిన తరువాత కూడా ఇది అలాగే ఉంటుందా? అనే విషయాలు ఆసక్తిని రేపుతున్నాయి. ట్రాయ్ యొక్క కొత్త నిబంధనలు మార్చి 1 నుండి అమలు చేయబడతాయి.

 

 

డిటిహెచ్ కొత్త నియమాలు

డిటిహెచ్ కొత్త నియమాలు

కొత్త నియమాలు డిటిహెచ్ పరిశ్రమ దాని సేవల యొక్క ధరలు ఎలా నిర్ణయించాలో వంటి కొన్ని భారీ మార్పులను తీసుకువస్తున్నాయి. ఈ కొత్త నియమాలు అమలు అయిన తరువాత టాటా స్కై యొక్క డిటిహెచ్ కనెక్షన్‌ మరింత ఆకర్షణీయంగా ఉండబోతున్నది. కొత్త ప్యాక్ల యొక్క ధరలు మరియు వాటి సేవల వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

పాత ఛానల్ ప్యాక్‌ల ఎంపిక

పాత ఛానల్ ప్యాక్‌ల ఎంపిక

టాటా స్కై ప్రస్తుతం తన చందాదారులకు చాలా రకాల ఛానల్ ప్యాక్‌లను అందిస్తోంది. ఈ ప్యాక్‌లలో ధరల ఆధారంగా వివిధ రకాల ఛానల్ ప్యాక్‌లు, వాటి యొక్క శైలులు మరియు ఇతర పారామితులు ఉన్నాయి. అయితే రాబోయే రోజుల్లో ట్రాయ్ తీసుకువచ్చే కొత్త నియమాలు ఈ ఛానెల్ ప్యాక్‌ల యొక్క ధరలను అధిక మొత్తంలో మారుస్తాయి. ప్రస్తుతం టాటా స్కై రోస్టర్‌లో చాలా ఛానల్ ప్యాక్‌ల యొక్క ధరలు రూ.19 లతో ఉన్నాయి. ప్రేక్షకులకు అందుబాటులో ఉన్న కొన్ని ప్రముఖ ఛానెల్‌ల ధరలు రూ.19 గా ఉందని గమనించాలి.

 

 

క్రొత్త ఛానల్ ప్యాక్‌ల ఎంపిక

క్రొత్త ఛానల్ ప్యాక్‌ల ఎంపిక

కొత్త నిబంధనల అమలు తరువాత ఛానెల్ ప్యాక్‌లో చేర్చగల ఒక్కొక్క ఛానెల్ యొక్క గరిష్ట ధర రూ.12కు మించి ఉండకూడదు. అంటే ఒక ప్యాక్‌లో ఏదైనా ఛానెల్‌ను చేర్చాలంటే రూ.12 కన్నా ఎక్కువ ధర ఉండకూడదు. అంటే ఇప్పుడు ఉన్న దాని కంటే సుమారు రూ.7 ఒకొక్క ఛానెల్‌ మీద తగ్గుతున్నది. ఇది చౌకైన ప్యాక్‌లను ఎంచుకోవడానికి అవకాశం కల్పిస్తున్నది. అలాగే చందాదారులు చాలా ఛానెల్ ప్యాక్‌ల కోసం చౌకైన ఎంపికలను కనుగొనే అవకాశం ఉంది.

 

 

 

మల్టీ టీవీ చందాదారులకు చౌక ధరలు

మల్టీ టీవీ చందాదారులకు చౌక ధరలు

ఒకే పేరుతో రెండు కనెక్షన్లు పొందిన టాటా స్కై చందాదారులను టాటా స్కై యొక్క మల్టీ టీవీ చందాదారులుగా పరిగణిస్తారు. ప్రస్తుతం వీరు రెండు కనెక్షన్ల కోసం విడిగా చెల్లించాలి. అయితే మార్చి 1 న రాబోతున్న కొత్త నేషనల్ టారిఫ్ ఆర్డర్ 2.0 ప్రకారం మల్టీ టివి చందాదారులు రెండవ కనెక్షన్‌లో 40% NCF కంటే ఎక్కువ చెల్లించవలసిన అవసరం లేదు. టాటా స్కై మల్టీ టీవీ చందాదారులు ఇప్పుడు రెట్టింపు మొత్తాన్ని చెల్లిస్తున్నందున ఇది వారికి గొప్ప శుభవార్త అవుతుంది. కానీ కొత్త నిబంధనలతో రెండవ కనెక్షన్ మరియు దాని ఎన్‌సిఎఫ్ ధర 60% తగ్గుతుంది.

 

 

నెట్‌వర్క్ సామర్థ్య ప్రయోజనం

నెట్‌వర్క్ సామర్థ్య ప్రయోజనం

కొత్త నిబంధనలలో మరో మార్పు కూడా ఉంది. ఇది టాటా స్కై కనెక్షన్ మాత్రమే కాకుండా అన్ని డిటిహెచ్ కనెక్షన్లు కూడా చౌకగా మారుతాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం చందాదారులు బేస్ NCF రూ.130 ధర వద్ద 100 SD ఛానెళ్లను ఆనందిస్తున్నారు. ఈ 100 ఛానెళ్లలో 25 ఛానెళ్లను దూరదర్శన్ ఛానెల్లను కలిగి ఉండడం మరొక బాధాకరమైన విషయం. కానీ కొత్త నిబంధనలతో చందాదారులు ఒకే ఛానల్ ప్యాక్‌లో రూ.120 ధర వద్ద 200 ఛానెళ్లను పొందవచ్చు. ఇది మాత్రమే కాకుండా దూరదర్శన్ ఛానెళ్ల ఎక్కువ ఆక్రమనకు అవకాశం లేదు అంటే చందాదారులకు మొత్తం 200 ఛానెళ్లకు యాక్సిస్ లభిస్తుంది.

 

 

Best Mobiles in India

English summary
Tata Sky New Channel Pack Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X