Tata Sky బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో అపరిమిత డేటా కొత్త మార్పులు గమనించారా??
బ్రాడ్‌బ్యాండ్ రంగంలోకి కొత్తగా ప్రవేశించిన టాటా స్కై ఇప్పుడు తన బ్రాడ్‌బ్యాండ్ సమర్పణలతో జియోఫైబర్ మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ యొక్క ప్లాన్ లకు గట్టి పోటీని ఇస్తున్నది. జియోఫైబర్ మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కస్టమర్లు వారు ఎంచుకునే ధరతో సంబంధం లేకుండా ఎంచుకున్న ప్రతి ప్లాన్ తో అపరిమిత డేటాను పొందుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని టాటా స్కై కూడా తన వినియోగదారులకు అపరిమిత డేటా ప్రయోజనాలతో కొత్త ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం వినియోగదారులు అతి తక్కువ ధర వద్దనే అధిక డేటా ప్రయోజనాన్ని అనుభవిస్తున్నారు. టాటా స్కై ప్రారంభించిన కొత్త ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టాటా స్కై కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు అపరిమిత డేటా ప్రయోజనాలతో
టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ తన వినియోగదారులకు అపరిమిత డేటాను తక్కువ ధరలోనే బ్రాడ్‌బ్యాండ్ సమర్పణల కింద కొత్త ప్లాన్‌లతో అందిస్తోంది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) పాత ధరల కంటే చౌకైన ధరకే కొత్త ప్లాన్‌లను ఎక్కువ ప్రయోజనాలతో అందిస్తుంది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ మరియు జియోఫైబర్ కంటే కూడా తక్కువ ధరను కలిగి ఉండడమే.

టాటా స్కై కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల ధరల వివరాలు
టాటా స్కై సంస్థ తన బ్రాడ్‌బ్యాండ్ సమర్పణలలో వినియోగదారులకు అపరిమిత ఇంటర్నెట్ డేటాను 1 నెలల వాలిడిటీ కేటగిరీ కింద చాలా టెలికం సర్కిల్‌లలో రెండు ప్లాన్‌లను అందిస్తోంది. ప్రత్యేకంగా అపరిమిత డేటా ప్రయోజనాలతో వస్తున్న రెండు ప్లాన్‌ల యొక్క ధరలు వరుసగా 850 రూపాయలు మరియు 950 రూపాయలు. ఇంతకు ముందు టాటా స్కై ఒక నెల వాలిడిటీ కేటగిరీ కింద చౌకైన ఆఫర్ ప్లాన్ యొక్క 950 రూపాయలు.

టాటా స్కై రూ.950 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రయోజనాలు
టాటా స్కై తన కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల యొక్క ధరలను తగ్గించడమే కాకుండా ఈ ప్లాన్‌లతో అందించే ప్రయోజనాలను కూడా రెట్టింపు చేసింది. ఇంతకు ముందు ప్రజలు రూ.950 నెల వారి అపరిమిత ప్లాన్‌ను కొనుగోలు చేసినప్పుడు వారికి అపరిమిత డేటాను 25 Mbps ఇంటర్నెట్ వేగంతో అందించేది. కానీ ఇప్పుడు అది అపరిమిత డేటాను 150 Mbps వేగంతో అప్‌గ్రేడ్ చేసి అందిస్తున్నది. దానితో పాటు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌కు రూ.100 అదనపు మొత్తం చెల్లించి ల్యాండ్‌లైన్ కనెక్షన్‌ను కూడా పొందవచ్చు.

టాటా స్కై రూ.850 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రయోజనాలు
టాటా స్కై యొక్క కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో నెలకు రూ.850 ధర వద్ద లభించే ప్లాన్ వినియోగదారులకు అపరిమిత డేటాను 100 Mbps వేగంతో అందిస్తుంది. కస్టమర్లు తన బేస్ అద్దె పైన కేవలం 100 రూపాయలు అధికంగా చెల్లించడం ద్వారా ఈ ప్లాన్‌తో ల్యాండ్‌లైన్ కనెక్షన్ ను కూడా పొందవచ్చు. పైన పేర్కొన్న అన్ని ధరల మీద 18% పన్ను అదనంగా ఉంటుంది.

టాటా స్కై లాంగ్ టర్మ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో అప్‌గ్రేడ్
టాటా స్కై తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను దీర్ఘకాలిక ప్రణాళిక విభాగంలో కూడా అప్‌గ్రేడ్ చేసింది. ఇందులో భాగంగా మూడు నెలల చెల్లుబాటు విభాగంలో కొత్తగా కొన్ని ప్లాన్‌లను జోడించింది. కొత్తగా జోడించిన రెండు కొత్త ప్లాన్‌లు రూ.1,797 (50 Mbps వేగం) మరియు రూ.2,400 (100 Mbps వేగం) తో లభిస్తాయి. ఈ రెండు కొత్త ప్లాన్‌లతో వినియోగదారులు ల్యాండ్‌లైన్ కనెక్షన్‌ను కూడా పొందవచ్చు, అయితే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల బేస్ అద్దెపై రూ.100 అదనంగా చెల్లించవలసి ఉంటుంది.


Click it and Unblock the Notifications