Home
News

Tata Sky యూజర్లకు రూ.99లకే సెక్యూరిటీ కెమెరా సర్వీస్!! మిస్ చేసుకోకండి

దేశంలోని నంబర్ వన్ డైరెక్ట్-టు-హోమ్ (డిటిహెచ్) ఆపరేటర్ అయిన టాటా స్కై త్వరలోనే తన యొక్క వినియోగదారులకు నెలకు రూ.99 ధర వద్దనే సెక్యూరిటీ కెమెరా సర్వీసును అందించనుంది. ఈ సంస్థ ఇప్పటికే తన యొక్క వెబ్‌సైట్‌లో కొత్త సెక్యూరిటీ కెమెరా ఉత్పత్తికి సంబందించిన జాబితాను విడుదల చేసింది. అయితే టాటా స్కై యొక్క ప్రస్తుత వినియోగదారులకు మాత్రమే ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది.

వెబ్‌సైట్‌లో

వెబ్‌సైట్‌లో ఉత్పత్తి గురించి తెలిపిన క్లుప్త సమాచారం ప్రకారం వినియోగదారులు దానిని కొనుగోలు చేసినప్పుడు సర్వీసుకు ఎంత ఖర్చవుతుంది మరియు వారు సంస్థ నుండి ఎలాంటి సేవలను పొందుతారు వంటి వివరాలను తెలుసుకోవాలి అని ముచ్చట పడుతున్నారా? అయితే ఆ వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

టాటా స్కై సెక్యూరిటీ కెమెరా ఫీచర్స్

టాటా స్కై సెక్యూరిటీ కెమెరా ఫీచర్స్

టాటా స్కై 8x డిజిటల్ జూమ్ సామర్ధ్యంతో వినియోగదారులకు 1080p FHD రిజల్యూషన్ సెక్యూరిటీ కెమెరాను అందించనుంది. ఈ కెమెరా 111 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్‌తో వస్తుంది. రాత్రి మెరుగైన రికార్డింగ్ కోసం కెమెరా నైట్ విజన్ మద్దతుతో వస్తుంది. ఇది IR కట్ ఫిల్టర్, F2.0 ఎపర్చరు వంటి నాలుగు పరారుణ LED లను కలిగి ఉంటుంది. అలాగే చీకటిగా ఉన్నప్పుడు వినియోగదారులు 30 అడుగుల వరకు దృశ్యమానతను పొందుతారు.

 

స్మార్ట్ కెమెరా

ఇది స్మార్ట్ కెమెరా మరియు స్మార్ట్ డిటెక్షన్ వంటి తెలివైన ఫీచర్లతో వస్తుంది. వినియోగదారులు వారి అవసరాలు మరియు సౌలభ్యం ప్రకారం సున్నితత్వాన్ని మార్చవచ్చు మరియు జోన్ గుర్తింపును అనుకూలీకరించవచ్చు. ఇది కస్టమర్ చేతిలో ఉన్న అన్ని నియంత్రణలను ఉపయోగించుకొని తమకు సంబందించిన ఏ సంఘటన గురించి అయిన సులభంగా తెలుసుకోవచ్చు.

టాటా స్కై

టాటా స్కై అందించే సెక్యూరిటీ కెమెరా ముందుగా ఎంచుకున్న జోన్‌లో కెమెరా ద్వారా శబ్దం లేదా కదలికను కనుగొనబడినప్పుడు 12-సెకన్ల పాటు వీడియోను స్వయంచాలకంగా రికార్డ్ చేసే ఫీచర్ ను కలిగి ఉంటుంది. ఇది 7 రోజుల వరకు క్లౌడ్‌లో స్టోర్ చేయబడుతుంది. తద్వారా మీరు ఇచ్చిన సమయ వ్యవధిలో మీకు కావలసినప్పుడు దాన్ని యాక్సెస్ చేయవచ్చు. టాటా స్కై సెక్యూర్ యాప్ ద్వారా వినియోగదారులు క్లౌడ్ స్టోరేజ్ ను సులభంగా యాక్సెస్ చేయగలరు.

టాటా స్కై సెక్యూరిటీ కెమెరా

టాటా స్కై సెక్యూరిటీ కెమెరా 32GB వరకు స్టోర్ చేసే SD కార్డ్ మద్దతుతో మాత్రమే లభిస్తుంది. అయితే ఇది కస్టమర్ కోసం కొనుగోలులో చేర్చబడలేదు. టాటా స్కై సెక్యూరిటీ కెమెరాను కోరుకునే ఏ యూజర్ అయినా ఇన్‌స్టాలేషన్ ఫీజుతో కలుపుకొని ఒకేసారి తిరిగి చెల్లించని రూ.999 చెల్లించాలి. అంతేకాకుండా కెమెరా యొక్క అన్ని ఫీచర్లను యాక్సెస్ చేయడానికి వినియోగదారు నెలకు రూ.99 చెల్లించాల్సి ఉంటుంది. ఇది బ్యాటరీతో పనిచేయదు కాబట్టి ఇది పనిచేయడానికి అన్ని సమయాల్లో విద్యుత్ సరఫరా అవసరం ఉంటుంది.

Best Mobiles in India

English summary
Tata Sky Offers Security Camera Service For Just Rs.99 Per Month
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X