Tata Sky యూజర్లకు IPL 2020 మ్యాచ్‌లను చూడడానికి గొప్ప ఆఫర్!!!
ఇండియాలోని అతిపెద్ద డైరెక్ట్-టు-హోమ్ (డిటిహెచ్) ఆపరేటర్లలో ఒకటైన టాటా స్కై ఇప్పుడు తన వినియోగదారులకు మరొక గొప్ప అవకాశాన్ని అందిస్తున్నది. ఇండియాలో క్రికెట్టుకు గల ఆదరణను దృష్టిలో పెట్టుకొని డ్రీమ్ 11 IPL 2020 మ్యాచ్లను చూడడానికి వీలుగా వాటిని ప్రసారం చేసే స్టార్ట్ స్పోర్ట్స్ ఛానెల్‌ల సభ్యత్వాన్ని కేవలం రూ.25 చెల్లించి ఎంచుకోవడానికి వినియోగదారులకు సరళమైన మార్గాన్ని అందిస్తున్నది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టాటా స్కై డ్రీమ్11 IPL 2020 ప్యాక్స్
టాటా స్కై మై అకౌంట్ వెబ్ పోర్టల్ విభాగంలో క్రికెట్ మ్యాచ్ లను ప్రసారం చేసే అంకితమైన క్రికెట్ ఛానల్స్ స్టార్ స్పోర్ట్స్ 1 మరియు స్టార్ స్పోర్ట్స్ 1 హిందీతో సహా ఎంపిక చేసిన స్టార్ స్పోర్ట్స్ ఛానెళ్లను ఎంచుకునే గొప్ప అవకాశాన్ని అందిస్తున్నది. ప్రస్తుతం దుబాయిలో కొనసాగుతున్న డ్రీమ్ 11 IPL 2020 క్రికెట్ మ్యాచ్ లు సెప్టెంబర్ 19, 2020 న మొదలయ్యాయి. ఆఖరి ఫైనల్ మ్యాచ్ నవంబర్ 10 న జరగనుంది. ఐపిఎల్ యొక్క 2020 సీజన్ ఎడిషన్‌లో ఎనిమిది జట్లు పాల్గొని మొత్తంగా 60 మ్యాచ్‌లు ఆడనున్నాయి.

IPL 2020 క్రికెట్ మ్యాచ్ లను ప్రసారం చేస్తున్న ఛానెల్‌లు
క్రికెట్ ఛానల్స్ విభాగంలో ప్రస్తుతం స్టార్ స్పోర్ట్స్ 1 హిందీతో పాటు తమిళం, కన్నడ మరియు తెలుగు వంటి భాషలతో స్టార్ స్పోర్ట్స్ 1 ప్రాంతీయ ఫీడ్‌లతో సహా ఏడు ఛానెల్‌లను నిర్వహిస్తోంది. ఇవే కాకుండా అంకితమైన విభాగంలో స్టార్ స్పోర్ట్స్ 1 యొక్క హై డెఫినిషన్ (హెచ్‌డి) ఫీడ్‌లను స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డి మరియు స్టార్ట్ స్పోర్ట్స్ 1 హిందీ హెచ్‌డి వంటివి కూడా జాబితా చేయబడ్డాయి.

టాటా స్కై - స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌ల ధరల వివరాలు
స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డి, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ హెచ్‌డి, స్టార్ స్పోర్ట్స్ 1 కన్నడ, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు ఛానెళ్లను నెలకు రూ.22.42 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అయితే స్టార్ స్పోర్ట్స్ 1 తమిళం ఛానెల్ ను మాత్రం ప్రస్తుతం ఒక నెలకు రూ.20.06 ధర వద్ద అందిస్తున్నది. వినియోగదారులు స్టార్ స్పోర్ట్స్ 1 ఛానెల్‌ని ఎంచుకోవచ్చు లేదా ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్న అన్ని టాటా స్కై ప్యాక్‌లు మరియు ఛానెల్‌లను అన్వేషించి ఎంచుకోవచ్చు.

టాటా స్కై క్రికెట్ ఛానెల్‌లు మొబైల్ యాప్‌లో
ప్రస్తుతం ios మరియు ఆండ్రాయిడ్‌లో లభ్యమయ్యే టాటా స్కై మొబైల్ యాప్‌కు డిటిహెచ్ ఆపరేటర్ క్రికెట్ ఛానల్స్ విభాగాన్ని కూడా అందిస్తున్నది. టాటా స్కై మొబైల్ యాప్‌లో వినియోగదారులు ఏడు స్టార్ స్పోర్ట్స్ 1 ఛానెల్‌లను నేరుగా వీక్షించడానికి మరియు సభ్యత్వాన్ని పొందడానికి మేనేజ్ ప్యాక్స్ విభాగాన్ని ఎంచుకోవచ్చు. ఇంకా టాటా స్కై మొబైల్ యాప్‌లో మేనేజ్ ప్యాక్ విభాగం కింద ఉన్న వినియోగదారులు టాటా స్కై ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్న అన్ని ప్యాక్‌లను అన్వేషించవచ్చు మరియు నచ్చిన వాటిని కూడా ఎంచుకోవచ్చు.


Click it and Unblock the Notifications








