జియో గిగా‌ఫైబర్‌కు పోటీగా Tata Sky బ్రాడ్‌బ్యాండ్

జియో గిగా‌ఫైబర్‌కు పోటీగా Tata Sky బ్రాడ్‌బ్యాండ్

By Gizbot Bureau
|

బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసెస్ విభాగంలోకి జియో అడగుపెట్టబోతోన్న నేపథ్యంలో మార్కెట్ మరింత హీటెక్కింది. జియో గిగా‌ఫైబర్‌‌కు పోటీగా ప్రముఖ డీటీహెచ్ ప్రొవైడర్ టాటా స్కై తన బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసును ప్రారంభించింది. ప్రస్తుతానికి ఈ సర్వీస్ 12 నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. త్వరలోనే మరిన్ని నగరాలకు విస్తరించే అవకాశం ఉంది.

పోటాపోటీగా ఆఫర్లు..

పోటాపోటీగా ఆఫర్లు..

జియో గిగాఫైబర్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభమైన నేపథ్యంలో కస్టమర్స్ తమ నుంచి చేజారిపోకుండా ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్ వంటి సంస్థలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో పోటాపోటీగా ఆఫర్లను లాంచ్ చేస్తూ వస్తున్నాయి. టాటా స్కై లాంచ్ చేసిన బ్రాడ్‌బ్యాండ్ సేవలు ప్రస్తుతానికి ముంబై, థాణే, ఢిల్లీ, గజియాబాద్, గుర్గావ్, నోయిడా, పూణే, భూపాల్, చెన్నై, బెంగుళూరు, అహ్మదాబాద్, మీరా భాయందర్ నగరాల్లో అందుబాటులో ఉంటాయి.

 

 

వివిధ రకాల ప్యాకేజీల్లో...

వివిధ రకాల ప్యాకేజీల్లో...

వినియోగదారులు టాటా స్కై అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వటం ద్వారా బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునే వీలుంటుంది. ఒక నెల, మూడు నెలలు, ఐదు నెలలు, తొమ్మిది నెలలు, పన్నెండు నెలలు ఇలా వివిధ రకాల ప్యాకేజీల్లో ఈ సర్వీసును టాటా స్కై అందుబాటులో ఉంచింది.

ఒక నెల ప్యాకేజీని తీసుకునే వారికి...
 

ఒక నెల ప్యాకేజీని తీసుకునే వారికి...

ఇందులో ఒక నెల ప్యాకేజీని తీసుకునే వారికి 5 ఎంబీపీఎస్ (రూ.999), 10 ఎంబీపీఎస్ (రూ.1150), 30 ఎంబీపీఎస్ (రూ.1500), 50 ఎంబీపీఎస్ (రూ.1800), 100 ఎంబీపీఎస్ (రూ.2500) ప్యాకేజీల్లో అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్స్ అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు అతనం 60జీబి, 125జీబి డేటా ప్లాన్‌లను కూడా టాటా స్కై ప్రొవైడ్ చేస్తోంది. వీటిలో 60జీబి డేటా ప్లాన్ ధర రూ.999గానూ, 125జీబి డేటా ప్లాన్ ధర రూ.1250గాను ఉంది. టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకోవాలనుకునే యూజర్లు ఇన్‌స్టాలేషన్ ఛార్జ్ నిమిత్తం రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా వారికి వై-ఫై రౌటర్ ఉచితంగా లభిస్తుంది.

మూడు నెలలు, ఐదు నెలలు...

మూడు నెలలు, ఐదు నెలలు...

టాటాస్కై బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌కు సంబంధించి మూడు నెలల ప్యాకేజీని తీసుకునేవారికి 5 ఎంబీపీఎస్ (రూ.2,997), 10 ఎంబీపీఎస్ (రూ.3450), 30 ఎంబీపీఎస్ (రూ.4500), 50 ఎంబీపీఎస్ (రూ.5400), 100 ఎంబీపీఎస్ (రూ.7500) వేగంతో అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్స్ అందుబాటులో ఉంటాయి. ఐదు నెలల ప్యాకేజీని తీసుకునే వారికి 5 ఎంబీపీఎస్ (రూ.4,995), 10 ఎంబీపీఎస్ (రూ.5750), 30 ఎంబీపీఎస్ (రూ.7500), 50 ఎంబీపీఎస్ (రూ.9000), 100 ఎంబీపీఎస్ (రూ.12500) ప్యాకేజీల్లో ప్లాన్స్ అందుబాటులో ఉంటాయి.

 

 

తొమ్మిది నెలలు, 12 నెలలు..

తొమ్మిది నెలలు, 12 నెలలు..

తొమ్మిది నెలల డేటా ప్యాకేజీని తీసుకునే వారికి 5 ఎంబీపీఎస్ (రూ.8,991), 10 ఎంబీపీఎస్ (రూ.10350), 30 ఎంబీపీఎస్ (రూ.13500), 50 ఎంబీపీఎస్ (రూ.16200), 100 ఎంబీపీఎస్ (రూ.22500) ప్యాకేజీల్లో ప్లాన్స్ అందుబాటులో ఉంటాయి. 12 నెలల ప్యాకేజీని తీసుకునే వారికి 5 ఎంబీపీఎస్ (రూ.11,988), 10 ఎంబీపీఎస్ (రూ.13,800), 30 ఎంబీపీఎస్ (రూ.18,000), 50 ఎంబీపీఎస్ (రూ.21,600), 100 ఎంబీపీఎస్ (రూ.30,000) ప్యాకేజీల్లో ప్లాన్స్ అందుబాటులో ఉంటాయి.

 

 

ప్రారంభమైన జియో గిగాఫైబర్ రిజిస్ట్రేషన్స్..

ప్రారంభమైన జియో గిగాఫైబర్ రిజిస్ట్రేషన్స్..

ఇండియన్ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో పెను సంచలనాలకు తెరతీస్తూ రిలయన్స్ అభివృద్థి చేసిన జియో గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఇప్పుడు అఫీషియల్‌గా లభ్యమవుతోంది. ఈ హైస్పీడ్ నెట్‌వర్క్ కనెక్షన్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్స్ అఫీషియల్‌గా ఓపెన్ అయ్యాయి. ఈ సర్వీసును వినియోగించుకోవాలనుకుంటోన్న యూజర్లు జియో అఫీషియల్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని కంపెనీ చెబుతోంది. గత కొంత కాలంగా టెస్టింగ్ దశలో ఉన్న ఈ సర్వీసు 700ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్‌లను నమోదు చేయగలిగిందట.

 

 

 

 

Best Mobiles in India

English summary
Tata Sky rolls out broadband service, offers 100Mbps for Rs 2,500.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X